తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha At Airport: మయోసైటిస్‌ నుంచి కోలుకుంటూ సమంత ఇలా.. ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన నటి

Samantha at Airport: మయోసైటిస్‌ నుంచి కోలుకుంటూ సమంత ఇలా.. ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన నటి

Hari Prasad S HT Telugu

06 January 2023, 14:08 IST

    • Samantha at Airport: మయోసైటిస్‌ నుంచి కోలుకుంటున్న సమంత చాలా రోజుల తర్వాత తొలిసారి కెమెరాకు చిక్కింది. ఆమె ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.
ముంబై ఎయిర్ పోర్టులో సమంత
ముంబై ఎయిర్ పోర్టులో సమంత

ముంబై ఎయిర్ పోర్టులో సమంత

Samantha at Airport: టాలీవుడ్‌ నటి సమంత రుత్‌ ప్రభు మరికొద్ది రోజుల్లో శాకుంతలం మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మైథలాజికల్‌ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్‌ కానుంది. యశోదలాంటి సూపర్‌ హిట్‌ మూవీ తర్వాత ఆమె నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ గుణశేఖర్‌లాంటి డైరెక్టర్‌తో తీసిన భారీ బడ్జెట్‌ సినిమా.

ట్రెండింగ్ వార్తలు

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

The First Omen OTT: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

ఈ మధ్యే ఈ మూవీకి డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోను కూడా ఆమె ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. అయితే తాజాగా శుక్రవారం (జనవరి 6) సామ్‌ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు ఆమె చెప్పిన తర్వాత తొలిసారి ఇలా కెమెరాకు చిక్కింది. యశోద మూవీకి డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో చేతికి సెలైన్‌ పెట్టుకొని ఉన్న ఫొటోతో సమంత ప్రముఖంగా వార్తల్లో నిలిచింది.

ఆ తర్వాత తాను మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఆ వ్యాధికి ఆమె ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకుంటోంది. దాని నుంచి కోలుకుంటున్న సందర్భంలో ఇప్పుడిలా ఎయిర్‌పోర్ట్‌లో సమంత కనిపించింది. పూర్తి వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో కనిపించిన సామ్‌.. కళ్లకు బ్లాక్‌ గాగుల్స్‌ పెట్టుకుంది. ముఖానికి ఎలాంటి మేకప్‌ లేకుండా చాలా సింపుల్‌గా కనిపించింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె.. ఈ ఫొటోల్లో మాత్రం చాలా సీరియస్ గా ఉండటం చూడొచ్చు.

ఇప్పుడీ ఫొటో వైరల్‌గా మారింది. ఆమె తప్పుకుందని భావిస్తున్న బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌ షూటింగ్‌లో పాల్గొనేందుకే సమంత ముంబై వచ్చిందన్న వార్తలు వస్తున్నాయి. యశోద తర్వాత శాకుంతలంతో వస్తున్న ఆమె.. ఓవైపు ఖుషీ మూవీలోనూ నటిస్తోంది. త్వరలోనే మరో షెడ్యూల్‌ కోసం ఖుషీ సెట్స్‌లో చేరనుంది. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ లీడ్‌ రోల్‌లో కనిపిస్తున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం