Samantha Quits Citadel: సమంతపై మరో గాసిప్.. ఖండించిన సామ్ టీమ్!-samantha ruth prabhu team rubbishes reports of her being replaced citadel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Quits Citadel: సమంతపై మరో గాసిప్.. ఖండించిన సామ్ టీమ్!

Samantha Quits Citadel: సమంతపై మరో గాసిప్.. ఖండించిన సామ్ టీమ్!

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 09:42 PM IST

Samantha Quits Citadel: సమంతపై మరో గాసిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌లో ఆమె చేస్తున్న సిరీస్ సిటడెల్ నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిని ఆమె టీమ్ ఖండించింది.

సమంత
సమంత

Samantha Quits Citadel: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన ఫోకస్‌ను బాలీవుడ్‌పై పెట్టింది. ఓ పక్క సౌత్ సినిమాలు చేస్తూనే హిందీ ప్రేక్షకులకు దగ్గర కావాలని చూస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఆమె అనారోగ్యానికి గురికావడంతో ఆమె నటిస్తున్న సినిమాలు ఆలస్యమవుతూ వచ్చాయి. ఫలితంగా ఆమె పలు ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. తాజాగా మరో గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సామ్ నటిస్తున్న బాలీవుడ్ సిరీస్ సిటడెల్‌ నుంచి ఆమె తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సామ్ టీమ్ స్పందించింది. ఈ వార్త కేవలం వదంతేనని తేల్చి చెప్పింది.

"సిటడెల్ నుంచి సమంత తప్పుకుందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇవి పూర్తిగా ఊహాగానాలు, చెత్త వదంతులు. త్వరలోనే ఆమె సిటడెల్ షూటింగ్‌లో పాల్గొంటుంది. జనవరి ద్వితీయార్థం నుంచి పాల్గొనే అవకాశముంది." అని సమంత టీమ్‌కు చెందిన ఒకరు తెలిపారు.

సిటడెల్ అనేది బాలీవుడ్‌లో స్పై థ్రిల్లర్ జోనర్‌లో రానున్న వెబ్ సిరీస్. ఫ్యామిలీ మెన్ సిరీస్ తెరకెక్కించిన రాజ్ నిడమోరు, కృష్ణ డీకేనే ఈ సిరీస్‌ను కూడా రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ కూడా ప్రైమ్ వీడియోలోనే విడుదలయ్యే అవకాశముంది. సమంతాకు జోడీగా వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. వరుణ్ ఈ సిరీస్ ద్వారా ఓటీటీలో అరంగేట్రం చేయనున్నాడు.

తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సామ్ గతేడాది సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించుకుంది.

నవంబరులో ఆమె నటించిన యశోద చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇది కాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహాకవి కాళీదాసు రాసి సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏక కాలంలో ఇది విడుదల కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం