తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Apologies To Vijay Fans: విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు చెప్పిన సమంత.. కారణం అదేనా?

Samantha Apologies to Vijay Fans: విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు చెప్పిన సమంత.. కారణం అదేనా?

01 February 2023, 13:31 IST

    • Samantha Apologies to Vijay Fans: రౌడీ హీరో విజయ్ దేవరకొండతో.. సమంత ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సామ్ కారణంగా ఆలస్యం కాగా.. తాజాగా ఈ అమ్మడు విజయ్ అభిమానులకు క్షమాపణలు చెప్పింది.
సమంత
సమంత (instagram)

సమంత

Samantha Apologies to Vijay Fans: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. మధ్యలో మయోసైటిస్ అనే అనారోగ్యం బారిన పడిన ఈ ముద్దుగుమ్మ కోలుకుంది. ఈ వ్యాధి చికిత్స కారణంగా మధ్యలో మూవీస్‌కు కాస్త బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ.. తిరిగి తన పనిలో తీరిక లేకుండా గడపనుంది. తెలుగులో ఇప్పటికే విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా గతేడాది జూన్‌లో తాత్కాలికంగా వాయిదా పడగా.. సామ్ అనారోగ్యం కారణంగా ఇంతవరకు ప్రారంభమవలేదు. దీంతో అభిమానులు ఖుషీ సినిమా పునఃప్రారంభం గురించి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా ఈ ప్రశ్నకు సామ్ బదులిచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

NNS May 9th Episode: భాగీకి దగ్గరవుతున్న పిల్లలు.. యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న అమర్.. ఆరు కోరికకు మాయమైన యముడు

Kalvan OTT: ఓటీటీలోకి ల‌వ్ టుడే హీరోయిన్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Devara Release: దేవర సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారనుందా?

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సిటడల్ హిందీ రీమేక్‌లో సామ్ నటిస్తోంది. ఇటీవలే ఆ సిరీస్ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే విజయ్ దేవరకొండతో సినిమాకు సామ్ డేట్స్ ఇవ్వడం లేదంటూ గత కొద్దిరోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖుషీ మూవీ పరిస్థితి ఏంటి? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. సామ్ స్పందించిది. విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు చెప్పింది.

"విజయ్ దేవరకొండ అభిమానులను నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఖుషీ సినిమా త్వరలోనే మళ్లీ ప్రారంభమవుతుంది." అని సామ్ ట్విటర్ వేదికగా తెలిపింది. సమంత ఇచ్చిన ఈ గుడ్‌న్యూస్‌తో విజయ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. త్వరలో ఈ సినిమాలో కూడా ఆమె నటిస్తున్నట్లు శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, జయరామ్, సచిన్ ఖేడ్కర్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత తొలి సారిగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.