తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmanandam Look In Keeda Cola: బ్రహ్మీ ఈజ్ బ్యాక్.. తరుణ్ భాస్కర్ చిత్రం‌తో రీ ఎంట్రీ

Brahmanandam Look in Keeda Cola: బ్రహ్మీ ఈజ్ బ్యాక్.. తరుణ్ భాస్కర్ చిత్రం‌తో రీ ఎంట్రీ

01 February 2023, 13:03 IST

    • Brahmanandam Look in Keeda Cola: ఇటీవల కాలంలో సినిమాలకు కామెడీ కింగ్ బ్రహ్మానందం కాస్త గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. స్వల్ప విరామం తర్వాత బ్రహ్మీ అదిరిపోయే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న కీడా కోలీ చిత్రంతో పునరాగమనం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ విడుదలైంది.
తరుణ్ భాస్కర్ చిత్రంలో బ్రహ్మానందం
తరుణ్ భాస్కర్ చిత్రంలో బ్రహ్మానందం

తరుణ్ భాస్కర్ చిత్రంలో బ్రహ్మానందం

Brahmanandam Look in Keeda Cola: టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ మెగా ఫోన్ పట్టి చాలా కాలమే అయింది. 2016లో విడుదలైన పెళ్లి చూపులతో తెలుగు చిత్రసీమలో దర్శకుడిగా అరంగేట్రం చేసిన తరుణ్.. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ రెండు చిత్రాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో అతడి దర్శకత్వంలో తదుపరి చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూడసాగారు. అయితే దర్శకత్వం కంటే కూడా నటుడిగానే బిజీగా మారిన తరుణ్ భాస్కర్.. ఎట్టకేలకు కీడా కోలా అనే సినిమాతో ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు లేకుండా 8 మంది కీలక పాత్రలతో తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఇందులో ముఖ్య పాత్రలో నటిస్తున్న కామెడీ కింగ్ బ్రహ్మానందం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Super Star Krishna: అమెరికాలో తీసిన తొలి తెలుగు సినిమా.. 44 ఏళ్ల నాటి సూపర్ స్టార్ కృష్ణ మూవీ ఏదంటే?

OG Movie: ఓజీ సినిమాలో టబు చేయాల్సిన క్యారెక్టర్ ఎవరికి వెళ్లిందో తెలుసా?

OTT Heroine: ఓటీటీలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్.. ఆమె ముందు స్టార్ హీరోలు సైతం దిగదుడుపే!

NTR Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై కీలక అప్‍డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పటి నుంచో చెప్పిన టీమ్

బుధవారం బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్భంగా కీడా కోలా సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. బ్రహ్మీ తనదైన ఎక్స్‌ప్రెషన్‌తో హిలేరియస్‌గా కనిపించారు. అంతేకాకుండా మీ ప్రపంచం వింతగా మారబోతోంది. అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ను జోడించారు. ఈ పోస్టర్‌ను బ్రహ్మానందం పాత్ర ఏ విధంగా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు.

ఈ చిత్రంతో బ్రహ్మానందం రీ ఎంట్రీగా మేకర్స్ చెబుతున్నారు. వరదరాజులు అనే పాత్రలో బ్రహ్మీ కనిపించనన్నారు. ప్రేమ, రిలేషన్‌షిప్స్ అంటే ద్వేషాన్ని కక్కే ముసలి తాత పాత్రలో కనిపించనున్నారు. బ్రహ్మీ కామెడీ, వెటకారం ఈ సినిమా మరింత ఆకర్షణగా మారుతుందని సమాచారం. దీంతో కీడా కోలా చిత్రం పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతుందని తెలుస్తోంది.

ఈ చిత్రం వీజీ సైన్మా పతాకంపై తెరకెక్కుతోంది. ఈ సినిమాకు భరత్ కుమార్, శ్రీపాద నందిరా, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం