Panchathantram Trailer: పంచతంత్రం ట్రైలర్ విడుదల.. పంచేంద్రియాలంటున్న బ్రహ్మానందం-bramhanandam starred panchathantram movie trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Panchathantram Trailer: పంచతంత్రం ట్రైలర్ విడుదల.. పంచేంద్రియాలంటున్న బ్రహ్మానందం

Panchathantram Trailer: పంచతంత్రం ట్రైలర్ విడుదల.. పంచేంద్రియాలంటున్న బ్రహ్మానందం

Maragani Govardhan HT Telugu
Nov 26, 2022 05:18 PM IST

Panchathantram Trailer: బ్రహ్మానందం, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్ తదితరులన నటించిన ఆంథాలజీ మూవీ పంచతంత్రం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడులైంది. డిసెంబరు 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

పంచతంత్రం ట్రైలర్ రిలీజ్
పంచతంత్రం ట్రైలర్ రిలీజ్

Panchathantram Trailer: ఇటీవల కాలంలో ఆంథాలజీ కథలకు మంచి ఆదరణ దక్కుతుంది. ముఖ్యంగా వెబ్‌సిరీస్‌ల రూపంలో వీటిని తెరకెక్కిస్తున్నారు. అయితే కొన్ని సినిమాల రూపంలోనూ రాణించాయి. వేదం, మనమంతా, కేరాఫ్ కంచెరపాలెం లాంటి చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా ఈ జాబితాలో మరో చిత్రం వచ్చి చేరింది. అదే పంచతంత్రం. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంతో పాటు సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజేశేఖర్, దివ్వ దృష్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాతో కలర్స్ స్వాతి టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం.

ఈ ట్రైలర్‌ను గమనిస్తే ఐదు విభిన్న కథలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కథలను బ్రహ్మానందం తన పంచేంద్రియాలుగా పేర్కొనడం ఆసక్తికరంగా ఉంది. ఆధునిక ప్రపంచంలో మనుషుల అనుబంధాలు, విలువల గురించి ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది.

బ్రహ్మానందంతో పాటు కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్, సముద్రఖని, నరేశ్ అగస్త్య, దివ్య దృష్టి, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ తదితురులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్‌ను బట్టి ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తుంది.

టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్ధన్, సృజన్ యరబోలు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. హర్ష పులిపాక ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రావణ్ భరద్వాజ్, ప్రశాంత్ ఆర్ విహార్ ఈ సినిమాకు సంగీత దర్శకులుగా పనిచేయగా.. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. రాజ్ కే నల్లి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత కథనం