60 ఏళ్లలో కొత్త కెరీర్ మొదలుపెట్టనున్న బ్రహ్మానందం..
మంగళవారం బ్రహ్మానందం జన్మదినం. ఆయన పుట్టిన రోజు ను పురస్కరించుకొని ’పంచతంత్రం‘ సినిమా స్పెషల్ టీజర్ ను విడుదలచేశారు. ఇందులో వేదవ్యాస్ అనే పాత్రలో బ్రహ్మానందం కనిపిస్తున్నారు.

మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచారు హాస్యనటుడు బ్రహ్మానందం. భిన్నమైన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ప్రతి సినిమాలో వైవిధ్యతను కనబరుస్తూ తెలుగు సినీ హాస్య ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. మంగళవారం బ్రహ్మానందం జన్మదినం. ఆయన పుట్టిన రోజు ను పురస్కరించుకొని ’పంచతంత్రం‘ సినిమా స్పెషల్ టీజర్ ను విడుదలచేశారు. ఇందులో వేదవ్యాస్ అనే పాత్రలో బ్రహ్మానందం కనిపిస్తున్నారు. ఆలిండియా రేడియో రిటైర్డ్ ఉద్యోగిగా ఆయన పాత్రను టీజర్ లో చిత్రబృందం పరిచయం చేసింది.
కెరీర్ ఇరవై లోనే మొదలుపెట్టాలా...అరవైలో మొదలుపెట్టకూడదా అంటూ టీజర్ లో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. అరవై ఏళ్ల వయసులో ఓ లక్ష్యం కోసం యువతరంతో పోటీ పడే వ్యక్తిగా బ్రహ్మానందం ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో వినోదాత్మక పాత్రలో కాకుండా నటనకు ఆస్కారమున్న క్యారెక్టర్ ను బ్రహ్మానందం పోషిస్తున్నట్లు సమాచారం. ఎమోషనల్ గా ఈ పాత్ర సాగుతుందని తెలిసింది. ఐదు కథల సమాహారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సముద్రఖని, స్వాతి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హర్ష పులి పాక దర్శకత్వం వహిస్తున్నారు. అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
సంబంధిత కథనం