Vijay Deverakonda Free Vacation: ఫ్యాన్స్‌కు విజయ్ బంపర్ ఆఫర్.. ఫ్రీగా హాలీడేకు పంపిస్తున్న రౌడీ హీరో
Vijay Deverakonda Free Vacation: నూతన సంవత్సరం సందర్భంగా విజయ్ దేవరకొండ ప్రతి ఏటా అభిమానులకు బహుమతులిస్తుంటాడు. దేవరా శాంటా పేరుతో ఆ కార్యం చేస్తున్నాడు. అయితే ఈ సారి వంద మంది అభిమానులను ఉచితంగా వెకేషన్‌కు పంపించనున్నాడు.
Vijay Deverakonda Free Vacation: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కేవలం నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, గాయకుడిగానూ తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అంతేకాకుండా సామాజిక సేవలోనూ తన మార్కును చూపిస్తున్నాడు. ఇప్పటికే తన పుట్టినరోజుకు ఎన్నో సేవ కార్యక్రమాలను స్వయంగా చేస్తూ వార్తల్లో నిలిచాడు. ఎప్పుడూ తన పుట్టినరోజుకో, ప్రత్యేకమైన రోజుల్లోనో వినూత్నమైన ఆలోచనను తీసుకొచ్చే విజయ్ దేవకొండ.. మరోసారి వైవిధ్యమైన ఆలోచనతో వచ్చాడు.
న్యూ ఇయర్ బహుమతులు ఇస్తూ గత ఐదేళ్లుగా దేవరశాంటా(Devera Santa) పేరుతో ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నారు స్టార్ హీరో విజయ్. అభిమానులకు ఒక్కో సంవత్సరం ఒక్కో బహుమతి ఇస్తూ సర్ప్రైజ్ చేస్తున్నాడు. అయితే ఈ సారి మాత్రం ప్రపంచంలో ఇప్పటివరకు ఏ హీరో చేయని రీతిలో సరికొత్త ఆలోచనతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఫ్రీ వెకేషన్ పేరుతో తన అభిమానులను హాలిడేకు పంపించబోతున్నాడు.
100 మంది అభిమానులను ఉచితంగా హాలీడేకు పంపించబోతున్నాడు. దేవరశాంటా యాష్ ట్యాగ్ పేరుతో తనకు వచ్చిన రిక్వెస్టుల నుంచి వందమంది అభిమానులను ఎంపికచేసి పూర్తి ఖర్చులు తానే భరించి వెకేషన్‌తో వారిని సంతృప్తిపరచనున్నాడు. ఇందుకు నాలుగు ఆప్షన్స్ విజయ్ సూచించాడు. మౌంటెయిన్స్ ఆఫ్ ఇండియా, బీచెస్ ఆఫ్ ఇండియా, కల్చర్ ట్రిప్ ఆఫ్ ఇండియా, డిసెర్ట్స్ ఇన్ ఇండియా...ఇలా ఈ నాలుగు ఆప్షన్స్‌లో ఏ పర్యటనకు వెళ్లాలన్నా విజయ్ దేవరకొండ పూర్తిగా ఉచితంగా పంపించబోతున్నాడు.
ఇప్పటివరకు ప్రపంచంలో ఏ హీరో తన అభిమానులను ఇలా ఫ్రీ హాలీడే ట్రిప్‌కు పంపించలేదు. మొదటిసారిగా రౌడీ హీరో ఈ విధంగా అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. సెలవుల్లో ఏదైనా టూర్‌కు వెళ్లాలనుకుని ఖర్చులకు సందేహించే అభిమానులు దేవరశాంటా ఆలోచనను ప్రశంసిస్తున్నారు.
సంబంధిత కథనం