Samantha about fans: మీరే నా కుటుంబం.. సమంత ఎమోషనల్ పోస్ట్
11 November 2022, 12:09 IST
- Samantha on Yashoda: మీరే నా కుటుంబం అంటూ సమంత ఎమోషనల్ అయింది. యశోద రిలీజ్ అయిన శుక్రవారం (నవంబర్ 11) ఉదయాన్నే ఆమె ట్విటర్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
సమంత
Samantha on Yashoda: చాలా రోజుల తర్వాత సమంత నటించిన మూవీ యశోద శుక్రవారం (నవంబర్ 11) థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఉదయం నుంచే మూవీ గురించి ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ అని, సమంత నటన అద్భుతమని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని.. ఇలా రకరకాలుగా యశోదపై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
అటు సమంత కూడా ఉదయాన్ని ట్విటర్ ద్వారా అభిమానులకు ఓ సందేశాన్ని పంపించింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి మీ సపోర్ట్ కావాలని, మీరే నా కుటుంబమంటూ ఆమె ఎమోషనల్ అయింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్లలో తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లుగా కూడా ఆమె చెప్పిన విషయం తెలిసిందే. చేతికి సెలైన్ పెట్టుకొని మరీ ఈ మూవీకి డబ్బింగ్ చెబుతున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.
"గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో మీ సపోర్ట్ కోసం నేను ప్రార్థిస్తున్నాను. మూవీ రిలీజ్‌కు ముందు నాపైనా, యశోద మూవీపైనా మీరు చూపించిన ప్రేమాభిమానాలు ఎప్పటికి మరవలేను. ఎప్పటికీ కృతజ్ఞురాలిగానే ఉంటాను. మీరే నా కుటుంబం. మీకు ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్యూ" అని సమంత ట్వీట్ చేసింది.
సమంత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా యశోద టీమ్ పెద్దగా ప్రమోషనల్ ఈవెంట్లు నిర్వహించలేదు. తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు సమంత ఈ మధ్యే వెల్లడించింది. అయినా కూడా ఆమె కొన్ని ప్రమోషనల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలకు వచ్చింది. "కొన్నిసార్లు అడుగు వేయడం కూడా కష్టమవుతుంది. కొన్ని రోజులు బాగానే ఉంటుంది.
కొన్ని రోజులు నేను ఫైట్ చేయాలనుకుంటాను. కానీ అలా ఫైట్ చేయాల్సిన రోజులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే మూడు నెలలు గడిచాయి. కానీ ఇప్పట్లో నేనేమీ చనిపోను. నాకు ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లుగా కొందరు రాస్తున్నారు. కానీ అది కాదు. నేను ఎప్పుడూ ఓ ఫైటర్‌నే. ఫైట్ చేస్తాను" అని సమంత ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.