తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salman To Remake Pawan Movie: పవన్‌ కల్యాణ్‌ మూవీ రీమేక్‌ చేస్తున్న సల్మాన్

Salman to remake Pawan Movie: పవన్‌ కల్యాణ్‌ మూవీ రీమేక్‌ చేస్తున్న సల్మాన్

HT Telugu Desk HT Telugu

16 September 2022, 9:40 IST

    • Salman to remake Pawan Movie: పవన్‌ కల్యాణ్‌ మూవీని రీమేక్‌ చేస్తున్నాడు సల్మాన్‌ఖాన్‌. అయితే ఈ సినిమా పవన్‌ కెరీర్‌లోని ఫ్లాప్స్‌లో ఒకటి కావడం విశేషం.
సల్మాన్ ఖాన్, పవన్ కల్యాణ్
సల్మాన్ ఖాన్, పవన్ కల్యాణ్ (Twitter)

సల్మాన్ ఖాన్, పవన్ కల్యాణ్

Salman to remake Pawan Movie: సాధారణంగా ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్‌ చేస్తుంటారు. ఆ సినిమా తమ భాషలో డబ్‌ కాకుండా ఉండేలా చూసుకుంటారు. కానీ ఇప్పుడు బాలీవుడ్‌ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌ మాత్రం ఓ ఫ్లాప్‌ మూవీని, అందులోనూ ఇప్పటికే హిందీలో డబ్‌ అయి, టీవీల్లో ఎన్నోసార్లు వచ్చిన సినిమాను రీమేక్‌ చేస్తుండటం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

ఇది టాలీవుడ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన మూవీ. అయితే అతని కెరీర్‌లో ఫ్లాప్‌ అయిన మూవీ. ఆ సినిమా పేరు కాటమరాయుడు. నిజానికి పవన్‌ కూడా అప్పటికే తమిళంలో హిట్‌ అయి, తెలుగులో కూడా డబ్‌ అయిన వీరమ్‌ అనే మూవీని కాటమరాయుడుగా రీమేక్‌ చేశాడు. ఈ సినిమా అప్పటికే తెలుగు ప్రేక్షకులు అందరికీ దగ్గరైంది.

థియేటర్లలో ఆడియెన్స్‌ను బాగానే అట్రాక్ట్‌ చేయడంతోపాటు మూడు, నాలుగు సార్లు టీవీల్లోనూ వచ్చింది. కాటమరాయుడు రిలీజ్‌కు ముందు రోజు కూడా ఈ సినిమా టీవీలో రావడం విశేషం. అయినా ఈ సినిమాను రీమేక్‌ చేయడానికి పవన్‌ మొగ్గు చూపాడు. దీంతో ఆ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది. అలాంటి సినిమాను ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌ రీమేక్‌ చేస్తున్నాడు.

ఈ సినిమా హిందీలో కూడా డబ్‌ అయింది. తెలుగులో ఈ హక్కులు సొంతం చేసుకున్న జీ నెట్‌వర్కే హిందీలోనూ దక్కించుకొని ఇప్పటికే టీవీల్లో టెలికాస్ట్ చేసింది. కానీ సల్మాన్‌ ఇప్పుడు కిసీ కా భాయ్‌, కిసీ కా జాన్‌ పేరుతో బాలీవుడ్‌లో చేస్తున్న మూవీ ఈ కాటమరాయుడు రీమేకే అని తేలింది. ఈ సినిమాలో వెంకటేశ్‌ కూడా నటిస్తుండగా.. రామ్‌చరణ్‌ స్పెషల్‌ అప్పియరెన్స్‌ కూడా ఉంది. ఆ మధ్య చాలా రోజుల పాటు ఈ మూవీని హైదరాబాద్‌లోనే షూట్‌ చేశారు.

తమిళంలో హిట్‌ అయిన మూవీని తెలుగులో రీమేక్‌ చేసి పవన్‌ కల్యాణ్‌ చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడదే మూవీని మరోసారి సల్మాన్‌ బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తుండటంతో అతను ఎంత వరకూ సక్సెస్‌ అవుతాడన్నది సందేహమే. గతంలో సల్మాన్‌ నటించిన దబంగ్‌ను తెలుగులో గబ్బర్‌సింగ్‌గా రీమేక్‌ చేసి పవన్‌ పెద్ద హిట్‌ కొట్టాడు. కానీ అదే రిజల్ట్ ఇప్పుడు సల్మాన్‌ వస్తుందని మాత్రం చెప్పే పరిస్థితి లేదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.