Telugu News  /  Entertainment  /  Salman Khan Along With Venkatesh And Pooja Hegde Had Dinner At Ram Charans Home
రామ్ చరణ్ ఇంట్లో పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్, వెంకటేశ్
రామ్ చరణ్ ఇంట్లో పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్, వెంకటేశ్ (Instagram)

Ram Charan: రామ్‌చరణ్‌ ఇంట్లో సల్మాన్‌, వెంకటేశ్‌, పూజా డిన్నర్‌.. ఫొటోలు వైరల్‌

26 June 2022, 21:11 ISTHT Telugu Desk
26 June 2022, 21:11 IST

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హైదరాబాద్‌లో సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు ఇస్తూనే ఉన్నాడు. తాజాగా వెంకటేశ్‌, పూజా హెగ్డేలతో కలిసి రామ్‌ చరణ్‌ ఇంట్లో అతడు డిన్నర్‌ చేశాడు.

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తన నెక్ట్స్‌ మూవీ కభీ ఈద్‌ కభీ దివాళీ మూవీ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన విషయం తెలిసిందే. వచ్చినప్పటి నుంచీ అటు షూటింగ్‌లో బిజీగా ఉంటేనే ఖాళీ సమయాల్లో తన ఫ్రెండ్స్‌ అయిన చిరంజీవి, వెంకటేశ్‌లనూ తరచూ కలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికే చిరంజీవి ఇంటికి కూడా వెళ్లాడు. ఆ సమయంలో విక్రమ్‌ సక్సెస్‌ మీట్‌ కోసం వచ్చిన కమల్‌ హాసన్‌ను కూడా అక్కడే కలిశాడు.

ట్రెండింగ్ వార్తలు

ఆ తర్వాత చిరంజీవి, వెంకటేశ్‌లతో కలిసి ఓ ప్రైవేట్‌ పార్టీలో కనిపించాడు. ఇక ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ఇంటికి కూడా వెళ్లాడు. అతనితోపాటు వెంకటేశ్‌, పూజా హెగ్డే కూడా ఉన్నారు. ఈ ముగ్గురికీ రామ్‌చరణ్‌ మంచి ఆతిథ్యమిచ్చాడు. అతనితోపాటు భార్య ఉపాసన కూడా వీళ్లతో కలిసి ఫొటోలు దిగింది. ఆల్‌వేస్‌రైమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఈ ఫొటో షేర్‌ చేశారు. ఇది వారి పెట్‌ డాగ్‌ ఇన్‌స్టా పేజ్‌. "నేను చాలా లక్కీ పప్పీని. ప్రేమ, హగ్స్‌ అన్నీ నాకే" అనే క్యాప్షన్‌ పెట్టారు.

సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న ఈ కభీ ఈద్‌ కభీ దివాళీ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 30న రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమాలోని ఓ పాటలో రామ్‌చరణ్‌తోపాటు వెంకటేశ్‌ కూడా గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తున్నారు. ఈ గెస్ట్‌ రోల్‌ కోసం రామ్‌చరణ్‌ ఎలాంటి రెమ్యునరేషన్‌ తీసుకోవడం లేదని ఈ మధ్యే వార్తలు వచ్చాయి. ఈ సినిమాను సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ తెరకెక్కిస్తోంది.