Pawan Kalyan Birthday: పవన్ బర్త్‌డే స్పెషల్.. జల్సా రీరిలీజ్ కలెక్షన్లన్నీ రైతులకే
Pawan Kalyan Birthday: పవన్ బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్‌గా వస్తున్న జల్సా మూవీకి వచ్చే కలెక్షన్లను విరాళంగా ఇవ్వాలని ఫ్యాన్స్ నిర్ణయించడం విశేషం. శుక్రవారం (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ తన పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
Pawan Kalyan Birthday: ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అతని సూపర్ డూపర్ హిట్ మూవీ పోకిరిని రీరిలీజ్ చేశారు. అంతేకాదు ఆ మూవీ ద్వారా వచ్చిన కలెక్షన్లను మహేష్ బాబు ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చి వాటితో చిన్నారుల హార్ట్ సర్జరీలు చేయించారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వంతు వచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
శుక్రవారం (సెప్టెంబర్ 2) పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా అతని కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోయిన జల్సా మూవీని ఒక రోజు ముందే రీరిలీజ్ చేశారు. పవన్ 51వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటున్న ఫ్యాన్స్.. ఇప్పుడీ సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్లను ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబాలకు ఇవ్వనున్నారు. టాలీవుడ్‌లో మరే హీరోకు లేని ఫాలోయింగ్ పవన్ సొంతం.
ఇప్పుడు వాళ్లంతా పవన్ బర్త్‌డే నాడు జల్సా మూవీ రీరిలీజ్‌ను ఓ పండగలా జరుపుకుంటున్నారు. ఈ స్పెషల్ షోలను 4 కే క్వాలిటీలో వేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 501 షోలతో జల్సా రీరిలీజ్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ షోల ద్వారా వచ్చిన కలెక్షన్లలో కొంత జనసేన పార్టీకి, మరికొంత ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇవ్వాలని ఫ్యాన్స్ నిర్ణయించారు.
పవన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ జల్సా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా ద్వారానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం అనేది ప్రారంభమైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అప్పట్లో ఓ సెన్సేషన్. ఇందులోని పాటలు ఇప్పటికీ ఊపు తెప్పిస్తాయి. పైగా ఈ మూవీలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ అనేది మరో అట్రాక్షన్.
మరోవైపు పవన్ బర్త్ డే సందర్భంగానే శుక్రవారం సాయంత్రం 5.45 గంటలకు అతని నెక్ట్స్ మూవీ హరి హర వీర మల్లు నుంచి పవర్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు ఈ మూవీ మేకర్స్. ఈ విషయాన్ని రెండు రోజులకు ముందే ప్రకటించారు. ఈ హరి హర వీర మల్లు మూవీ వచ్చే ఏడాది మార్చి 30న రిలీజ్‌కానుంది.