తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar: సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతున్న సలార్ సినిమా.. ఎందుకంటే!

Salaar: సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతున్న సలార్ సినిమా.. ఎందుకంటే!

20 April 2024, 17:17 IST

    • Salaar Movie Trending: సలార్ సినిమా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నేడు ఈ చిత్రంపై ఎక్స్(ట్విట్టర్)లో భారీగా ట్వీట్స్ వస్తున్నాయి. ఇందుకు కారణమేంటంటే..
Salaar Trending: సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతున్న సలార్ సినిమా.. ఎందుకంటే!
Salaar Trending: సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతున్న సలార్ సినిమా.. ఎందుకంటే!

Salaar Trending: సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతున్న సలార్ సినిమా.. ఎందుకంటే!

Salaar Movie: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం గతేడాది డిసెంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రభాస్ యాక్షన్ సీన్లు ఈ చిత్రంలో అదిరిపోయాయి. పాన్ ఇండియా రేంజ్‍లో సూపర్ హిట్ అయింది సలార్. ఈ మూవీ విషయంలో సోషల్ మీడియాలోనూ హంగామా చాలా నడిచింది. థియేట్రికల్ రన్ సమయంలో, ఓటీటీ రిలీజ్ టైమ్‍లో ఈ మూవీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. ఇప్పుడు, నేడు మరోసారి సలార్ సినిమా సోషల్ మీడియాలో టాప్‍లో ట్రెండ్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Eesha Rebba: ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నన్ను హీరోయిన్ అని చెప్పి మోసం చేశారు: ఈషా రెబ్బ

Madgaon Express OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Yuvaraj OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన కాంతార‌ హీరోయిన్ యాక్ష‌న్ డ్రామా మూవీ - తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

కారణమిదే..

సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో సలార్ (#Salaar) హ్యాష్ ట్యాగ్ నేడు ట్రెండ్ అవుతూనే ఉంది. వేలాది పోస్టులు వస్తున్నాయి. ఇందుకు కారణం ఈ సినిమా టీవీ ఛానెల్‍లోకి వస్తుండడమే. సలార్ సినిమా రేపు (ఏప్రిల్ 21) సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ‘స్టార్ మా’ ఛానెల్‍లో ప్రసారం కానుంది. దీంతో ఈ మూవీపై సోషల్ మీడియాలో మళ్లీ బజ్ నెలకొంది.

ప్రభాస్ మాటలతో ప్రోమో

టీవీ ప్రీమియర్ కోసం ప్రభాస్ మాటలతో ప్రోమోను తాజాగా తీసుకొచ్చింది స్టార్ మా ఛానెల్. సలార్ వరల్డ్ టీవీ ప్రీమియర్‌ను మిస్ అవొద్దని, స్టార్ మా ఛానెల్‍లో చూడండి అంటూ ప్రభాస్ చెప్పారు. ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఏప్రిల్ 21 సాయంత్రం 5:30 గంటలకు సలార్ వచ్చేస్తోందంటూ చాలా మంది నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. దీంతో మళ్లీ నేడు (ఏప్రిల్ 20) ఈ చిత్రం ట్రెండ్ అవుతోంది.

సలార్ సినిమా గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చి భారీ హిట్ అయింది. సుమారు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. తెలుగు, హిందీతో పాటు విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో దేవగా ప్రభాస్, వరద రాజమన్నార్‌గా వృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు.

సలార్ మూవీలో శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, టిన్నూ ఆనంద్, బాబీ సింహా కీలకపాత్రల్లో నటించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ మూవీని నిర్మించారు. సలార్ మూవీకి సీక్వెల్‍గా పార్ట్ 2 కూడా రానుంది. 2025లోనే సలార్ పార్ట్ 2: శౌర్యాంగపర్వం విడుదలయ్యే అవకాశం ఉంది.

సలార్ సినిమా ప్రస్తుతం రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, మే 9న విడుదల కావల్సిన ఈ చిత్రం వాయిదా పడనుంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సినీ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‍ను మేకర్స్ ప్రకటించనున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం