తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Virupaksha Title Glimpse: సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. తారక్ వాయిస్ అదుర్స్

Virupaksha Title Glimpse: సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. తారక్ వాయిస్ అదుర్స్

07 December 2022, 12:00 IST

    • Virupaksha Title Glimpse: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. కార్తిక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సుకుమార్ కథను అందించారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ విడుదల
విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ విడుదల

విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ విడుదల

Virupaksha Title Glimpse: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్నారు. గతేడాది బైక్ ప్రమాదం జరగడంతో చికిత్స తీసుకున్న అతడు మూవీస్ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలకు ఓకే చెబుతూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం విరూపాక్ష అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ కథను సిద్ధం చేశారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రానికి మాట సహాయం చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

ఈ వీడియోను గమనిస్తే.. జూనియర్ ఎన్టీఆర్ మాటలతో మొదలవుతుంది. "అజ్ఞానం భయానికి మూలం.. భయం మూఢనమ్మకానికి కారణం.. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం" అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. తారక్ బేస్ వాయిస్‌లో కథలో ఇంటెన్సిటీ అర్థమవుతుంది.

ఈ వీడియోను బట్టి చూస్తే సినిమా మూఢనమ్మకాల నేపథ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ కథకు ప్రాణం పోసినట్లు ఉంది. ఆయన డైలాగుకు మెగా అభిమానులకు పూనకాలు గ్యారెంటీ అన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాక్షన్ సన్నివేశాలకు కూడా ఢోకా లేనట్లు సమాచారం. సాయి తేజ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు.

ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేస్తోది. సుకుమార్ ఈ చిత్రానికి కథను అందించగా.. కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అజ్నీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. శా‌మ్‌దత్ సైనుద్దిన్ సినిమాటోగ్రాఫర్ వ్యవహరిస్తుండగా.. నవీన్ నూలీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పాన్ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానుంది. 2023 ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.