Jr NTR for SDT15: సాయి ధరమ్‌ తేజ్‌ మూవీ ఎస్‌డీటీ15 టైటిల్‌ గ్లింప్స్‌కు ఎన్టీఆర్‌ వాయిస్‌-jr ntr for sdt15 as the makers announced to release the title glimpse on december 7th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr For Sdt15: సాయి ధరమ్‌ తేజ్‌ మూవీ ఎస్‌డీటీ15 టైటిల్‌ గ్లింప్స్‌కు ఎన్టీఆర్‌ వాయిస్‌

Jr NTR for SDT15: సాయి ధరమ్‌ తేజ్‌ మూవీ ఎస్‌డీటీ15 టైటిల్‌ గ్లింప్స్‌కు ఎన్టీఆర్‌ వాయిస్‌

HT Telugu Desk HT Telugu
Dec 05, 2022 08:36 PM IST

Jr NTR for SDT15: సాయి ధరమ్‌ తేజ్‌ మూవీ ఎస్‌డీటీ15 టైటిల్‌ గ్లింప్స్‌కు ఎన్టీఆర్‌ వాయిస్‌ ఇస్తుండటం విశేషం. ఈ విషయాన్ని మేకర్స్‌ ట్విటర్‌ ద్వారా అనౌన్స్‌ చేశారు.

ఎస్డీటీ15 టైటిల్ గ్లింప్స్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్
ఎస్డీటీ15 టైటిల్ గ్లింప్స్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్

Jr NTR for SDT15: సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తున్న మూవీ ఎస్‌డీటీ15. ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ రాబోతోంది. ఈ విషయాన్ని అనౌన్స్‌ చేస్తూ మేకర్స్‌ ఫ్యాన్స్‌కు మరో పండగలాంటి న్యూస్‌ చెప్పారు. సాయి ధరమ్‌ నటిస్తున్న 15వ మూవీ ఇది. ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ బుధవారం (డిసెంబర్‌ 7) రిలీజ్‌ కానుంది. దీనికి జూనియర్‌ ఎన్టీఆర్‌ వాయిస్‌ అందిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

"#NTRforSDT హ్యాష్‌ట్యాగ్‌పై అభిమానులు తమ ప్రేమను కురిపిస్తున్నారు. ట్విటర్‌ ఇండియాలో ట్రెండింగ్‌ అవుతోంది. తారక్‌ మెజిస్టిక్‌ వాయిస్‌లో ఎస్‌డీటీ15 టైటిల్‌ గ్లింప్స్‌ డిసెంబర్‌ 7 ఉదయం 11 గంటలకు రాబోతోంది" అని మేకర్స్‌ ట్వీట్‌ చేశారు. ఆ వెంటనే ఈ ఎన్టీఆర్‌ ఫర్‌ ఎస్‌డీటీ హ్యాట్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. హీరో ఓ పిడికిలి బిగించి మరో చేతిలో కాగడా పట్టుకొని కనిపిస్తున్నాడు.

మెగా కాంపౌండ్‌ హీరో మూవీకి జూనియర్‌ ఎన్టీఆర్‌ వాయిస్‌ ఇస్తున్నాడన్న న్యూస్‌ ఇద్దరు హీరోల అభిమానుల్లోనూ ఎంతో ఉత్సాహం నింపింది. ఈ ఎస్‌డీటీ15కు కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. అతనికి ఇదే తొలి సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌ కింద బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదో థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కుతోంది.

ఈ ఏడాది మార్చి 29న ఎస్‌డీటీ15 షూటింగ్‌ మొదలైంది. అంతకుముందు సాయి ధరమ్‌ తేజ్‌ ఓ యాక్సిడెంట్‌కు గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆరు నెలల పాటు అతడు షూటింగ్స్‌కు దూరంగా ఉన్నాడు. ఆ గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఎస్‌డీటీ15 టీమ్‌ అతనికి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పింది. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తర్వాత ఇప్పటి వరకూ మరో మూవీ చేయని తారక్‌.. త్వరలోనే కొరటాల శివతో ఎన్‌టీఆర్‌20 చేయబోతున్నాడు.

Whats_app_banner