తెలుగు న్యూస్  /  Entertainment  /  Rrr Did Not Make In The Bafta 2023 Nominations

RRR BAFTA Nominations: బాఫ్టా నామినేషన్స్‌లో ఆర్ఆర్ఆర్‌కు మొండి చేయి.. అంతర్జాతీయ వేదికపై అదరగొడుతున్న చిత్రం

19 January 2023, 22:11 IST

    • RRR BAFTA Nominations: రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు బ్రిటీష్ అకాడ్మీ ఫిల్మ్ అవార్డుల్లో రిక్త హస్తాలే మిగిలాయి. ఈ ఏడాది బాఫ్టాకు ఎంపిక చేసిన నామినేషన్‌లో ఈ సినిమాను తీసుకోలేదు.
ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్

RRR BAFTA Nominations: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికగా వరుస పెట్టి అవార్డులు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆస్కార్ రేసులో పోటీ పడుతున్న ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు సహా పలు పురస్కారాలు వచ్చాయి. అయితే ప్రతిష్టాత్మక బ్రిటీష్ అకాడమనీ ఫిల్మ్ అవార్డ్స్-బాఫ్టా(BAFTA)లో మాత్రం ఆర్ఆర్ఆర్ నామినేట్ కాలేదు. ఈ ఏడాది బాఫ్టా నామినేషన్స్‌లో ఈ సినిమాను ఎంపిక చేయలేదు.

ట్రెండింగ్ వార్తలు

Dhanraj: ఆ దర్శకులందరూ నా గురువులే.. అతను లేకుంటే డైరెక్టర్ అయ్యేవాన్ని కాదు: జబర్దస్త్ ధన్‌రాజ్

Manjummel Boys OTT release date: ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెడుతున్న మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Releases: ఈ వారం ఓటీటీలోకి 2 బ్లాక్ బస్టర్ సినిమాలు.. రెండూ డిఫరెంట్ జోనర్స్.. మొత్తంగా 16 స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Jr NTR Dinner: బాలీవుడ్ స్టార్లతో జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్ నైట్.. బ్రహ్మాస్త్ర, వార్ 2 టీమ్‌తో కలిసి..

బెస్ట్ ఫిల్మ్ నాన్-ఇంగ్లీష్ కేటగిరి కోసం పోటీ పడిన ఆర్ఆర్ఆర్‌ బాఫ్టా పురస్కారాల నామినేషన్‌లో తీసుకోలేదు. ఈ మూవీ కాకుండా ఆళ్ క్వైట్ ఇన్ వెస్టర్న్ ఫ్రంట్, అర్జెంటీనా 1985, కార్సేజ్, డెసిషన్ టూ లీవ్, ది క్వైట్ గర్ల్ సినిమాలు ఈ విభాగంలో నామినేట్ అయ్యాయి. భారత్‌ నుంచి షౌనక్ సేన్ రూపొందించిన ఆల్ దట్ భ్రీథ్స్ అనే డాక్యూమెంటరీ మాత్రమే నామినేటైంది.

ఫిబ్రవరి 19న బాఫ్టా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. రిచర్చ్ ఈ గ్రాంట్, అలిసన్ హమాండ్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. బాఫ్టా పురస్కారాలకు ఆర్ఆర్ఆర్ నామినేట్ కానప్పటికీ.. ఇతర అంతర్జాతీయ అవార్డుల్లో మాత్రం దుమ్మురేపుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించింది. ఇది కాకుండా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను కూడా రెండు విభాగాల్లో సాధించింది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.