తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anikha Surendran Interview: తెలుగు రాకపోయినా సన్నివేశాలను అర్థం చేసుకుని నటించా.. బుట్ట బొమ్మ హీరోయిన్ అనిక

Anikha Surendran Interview: తెలుగు రాకపోయినా సన్నివేశాలను అర్థం చేసుకుని నటించా.. బుట్ట బొమ్మ హీరోయిన్ అనిక

19 January 2023, 21:15 IST

    • Anikha Surendran Interview: బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది బాలనటి అనిక సురేంద్రన్. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ బ్యూటీ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది.
అనిక సురేంద్రన్
అనిక సురేంద్రన్

అనిక సురేంద్రన్

Anikha Surendran Interview: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై బుట్టబొమ్మ అనే ఆసక్తికరమైన సినిమా రాబోతుంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్నలో అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. జనవరి 26న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా బుట్ట బొమ్మ చిత్రంలో హీరోయిన్‌గా చేసిన అనిక సురేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Dakshina Trailer: తెలుగులో క‌బాలి హీరోయిన్ సైకో కిల్ల‌ర్ మూవీ - ట్రైల‌ర్ రిలీజ్ చేసిన ఉప్పెన డైరెక్ట‌ర్‌

Zee Mahotsavam OTT: టీవీలో రమ్యకృష్ణ కాజల్ జయప్రద సందడి.. ఓటీటీలో కూడా చూడొచ్చు.. ఎలా అంటే?

Megalopolis Movie: 1977 లోఅనౌన్స్ - 2024లో రిలీజ్ - గాడ్ ఫాద‌ర్ డైరెక్ట‌ర్‌ వెయ్యి కోట్ల హాలీవుడ్ మూవీ ఏదో తెలుసా?

Raju Yadav: ఆ క్రికెటర్‌కు జరిగిన సర్జరీ ఆధారంగా గెటప్ శ్రీను రాజు యాదవ్ మూవీ: డైరెక్టర్

"ఎన్నో ఏళ్లుగా బాలనటిగా నటిస్తూ వచ్చాను. ఇప్పుడు హీరోయిన్‌గా అవకాశం రావండ సంతోషంగా ఉన్నాను. బుట్ట బొమ్మ చిత్రం మలయాళంలో వచ్చిన కప్పేలాకు రీమేక్. మాతృక చూసినప్పుడే నాకు బాగా నచ్చింది. ఇంతలో ఈ రీమేక్‌లోనే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. నటనకు ఆస్కారమున్న పాత్ర ఇది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందించడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పుకున్నాను." అని అనిక సురేంద్రన్ తెలిపింది.

హీరోయిన్‌గా చేసేటప్పుడు ఒత్తిడి ఎదుర్కొన్నారా అనే ప్రశ్నకు.. ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే కానీ, చిత్ర మద్దతుతో దాన్ని అధిగమించానని చెప్పుకొచ్చింది అనిక. "నాకు తెలుగు రాదు. కానీ సన్నివేశాలను అర్థం చేసుకుని నటించాను. దర్శకుడు రమేష్ గార, సన్నివేశాల తాలూకు ఎమోషన్స్‌ను బాగా వివరించి రాబట్టుకున్నారు. ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను. దర్శకత్వం విభాగంలో అనుభవమున్న రమేష్ నటన పరంగా ఎన్నో మెళకువలు నేర్పించారు. మాతృకతో పోలిస్తే ఈ సినిమాలో తెలుగు నెటివిటికీ తగినట్లు కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ కంటే ఇది ఇంకా కలర్‌ఫుల్‌గా ఉంటుంది" అని స్పష్టం చేశారు.

తన తదుపరి ప్రాజెక్టులు గురించి మాట్లాడుతూ.. మలయాళంలో ఓ మై డార్లింగ్ అనే మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నానని తెలిపింది. అలాగే తమిళంలో ఓ చిత్రం, తెలుగులో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు పేర్కొంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం