Rajamouli About Oscar Entry: ది చెల్లో షో ఆస్కార్ నామినేషన్‌పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. ఆర్ఆర్ఆర్‌కే ఛాన్స్ ఎక్కువ
Rajamouli About Oscar Entry: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ఆస్కార్ నామినేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనదేశం తరఫున అఫిషియల్‌గా ఎంట్రీ కోసం పోటీ పడుతున్న ఛెల్లో షో చిత్రంపై తన స్పందనను తెలియజేశారు. ఆర్ఆర్ఆర్‌కే గెలిచే ఛాన్స్ ఎక్కువుందని తెలిపారు.
Rajamouli About Oscar Entry: గతేడాది పాన్ నళిని తెరకెక్కించిన గుజరాతీ మూవీ ఛెల్లో షో(The Last Flim Show) సినిమా భారత్ తరఫున ఆస్కార్‌కు నామినేషన్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. 21 ఏళ్ల తర్వాత బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో 2023 ఆస్కార్ నామినేషన్స్ కోసం ఎంపికైంది. అంతేకాకుండా ఆస్కార్ నామినేషన్స్‌కు షార్ట్ లిస్ట్ కూడా అయింది. మరోపక్క ఆర్ఆర్ఆర్ కూడా తప్పకుండా అకాడమీకి నామినేట్ అవుతుందని ఊహించారు. కానీ ఆ చిత్రాన్ని మన దేశం తరఫున ఎంపిక చేయకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ డైరెక్టుగానే నామినేషన్స్ కోసం పోటీ పడింది. తాజాగా చెల్లో షో సినిమా ఆస్కార్ నామినేషన్ కోసం పంపడంపై దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జక్కన్న.. చెల్లో షో నామినేషన్‌పై స్పందించారు." భారత్ తరఫున ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్‌కు ఎంపిక కాకపోవడంపై కాస్త నిరుత్సాహంగా అనిపించింది. కానీ మేము జరిగిన దాని గురించి ఆలోచిస్తూ అలాగే కూర్చొనేవాళ్లం కాదు. జరిగిందేదో జరిగింది. ఇలాగే ముందుకు వెళ్తాం. ఆస్కార్స్‌కు భారతీయ చిత్రం(ది లాస్ట్ ఫిల్మ్ షో) షార్ట్ లిస్ట్ కావడం నాకు ఆనందంగా ఉంది. కానీ ఆర్ఆర్ఆర్ ఎంపికైనట్లయితే.. ఆస్కార్ గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉండేవి. కానీ భారతీయ ఫిల్మ్ ఫెడరేషన్ ఏమనుకుందో నాకు తెలియదు. వారి నిబంధనలు, నియమాల గురించి నాకు ఐడియా లేదు. ఈ విషయంపై నేను కామెంట్ చేయను." అని రాజమౌళి అన్నారు.
2023 ఆస్కార్ నామినేషన్ కోసం భారత్ తరఫున గుజరాతీ చిత్రం ఛెల్లో షో అనే సినిమాను పంపించారు. ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్‌కు షార్ట్ లిస్ట్ కూడా అయింది. మరోపక్క డైరెక్టుగా ఓటింగ్ కోసం ఆర్ఆర్ఆర్ అకాడమీ కోసం పోటీ పడింది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ షార్ట్ లిస్టులో ఎంపికైంది. ఇటీవలే ఈ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ సహా పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.
సంబంధిత కథనం