తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable S4: రొమాంటిక్ సినిమాలా.. కామెడీ చిత్రాలా? సీఎం చంద్రబాబు ఆన్సర్ ఇదే.. జైలులో పవన్‍తో చెప్పిన మాటలు వెల్లడి

Unstoppable S4: రొమాంటిక్ సినిమాలా.. కామెడీ చిత్రాలా? సీఎం చంద్రబాబు ఆన్సర్ ఇదే.. జైలులో పవన్‍తో చెప్పిన మాటలు వెల్లడి

26 October 2024, 7:14 IST

google News
    • Unstoppable Season 4 - Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా వచ్చిన అన్‍స్టాపబుల్ 4వ సీజన్ తొలి ఎపిసోడ్‍ స్ట్రీమింగ్‍కు వచ్చింది. హోస్ట్ బాలకృష్ణ ఆయనను చాలా ప్రశ్నలు అడిగారు. ఎలాంటి చిత్రాలు ఇష్టమనే ప్రశ్న కూడా వేశారు. దీనికి ఆయన స్పందించారు.
Unstoppable S4: రొమాంటిక్ సినిమాలా.. కామెడీ చిత్రాలా? చంద్రబాబు చెప్పిన ఆన్సర్ ఇదే.. జైలులో పవన్‍తో చెప్పిన మాట వెల్లడి
Unstoppable S4: రొమాంటిక్ సినిమాలా.. కామెడీ చిత్రాలా? చంద్రబాబు చెప్పిన ఆన్సర్ ఇదే.. జైలులో పవన్‍తో చెప్పిన మాట వెల్లడి

Unstoppable S4: రొమాంటిక్ సినిమాలా.. కామెడీ చిత్రాలా? చంద్రబాబు చెప్పిన ఆన్సర్ ఇదే.. జైలులో పవన్‍తో చెప్పిన మాట వెల్లడి

గాడ్ ఆఫ్ మాసెస్, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఉన్న పాపులర్ టాక్ షో అన్‍స్టాపబుల్ నాలుగో సీజన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా తొలి ఎపిసోడ్ జరిగింది. ‘తిరిగొచ్చిన విజయం’ పేరుతో ఈ ఎపిసోడ్ శుక్రవారం రాత్రి ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. తన బావ సీఎం చంద్రబాబును సీరియస్ ప్రశ్నలతో పాటు కొన్ని సరదా విషయాలు కూడా అడిగారు బాలయ్య. ఈ క్రమంలోనే ఎలాంటి సినిమాలను ఇష్టపడతారని రెండు ఆప్షన్లు ఇచ్చి అడిగారు. దీనికి చంద్రబాబు స్పందించారు.

నీ సినిమాలు చూస్తా

రొమాంటిక్ సినిమాలా.. కామెడీ చిత్రాలా అంటూ చంద్రబాబు నాయుడుకు ఓ ఫొటో చూపించారు బాలకృష్ణ. తీరిక సమయాల్లో ఎలాంటి చిత్రాలు చూసేందుకు ఇష్టపడతారని ప్రశ్న అడిగారు. దీనికి చంద్రబాబు స్పందించారు. “ఎవరేమన్నా బాలకృష్ణ నటించిన రొమాంటిక్ సినిమాలు అప్పుడప్పుడు చూస్తే” అంటూ ఆయన నవ్వారు. “బాలకృష్ణ దగ్గరి నుంచి కొన్ని కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు దగ్గరి నుంచి కొన్ని కోరుకుంటారు. డిఫరెన్స్ ఉంటుంది” అని చంద్రబాబు అన్నారు.

వీలున్నప్పుడు బాలకృష్ణ సినిమాలు చూసి రిలాక్స్ అవుతానని చంద్రబాబు చెప్పారు. “మా చెల్లెలితో రొమాంటిక్ సినిమా చూసింది ఒకటి చెప్పండి” అని బాలకృష్ణ అడిగారు. “నువ్వు క్రాస్ ఎగ్జామిన్ చేస్తే చాలా సమస్యలు వస్తాయి” అని చంద్రబాబు సరదాగా అన్నారు. “ఒక్కోసారి నాకు టైమ్ తక్కువగా ఉన్నప్పుడు నా భార్యతో కలిసి కూర్చొని నవ్వుతూ నీ సినిమాలు చూస్తే రిలాక్సియేషన్‍గా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్‌ను సపోర్ట్ చేసినట్టు కూాడా కొంత అవుతుంది. రెండు పనులు అవుతాయి” అని చంద్రబాబు చెప్పారు. స్టార్ క్రికెటర్లుగా ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల్లో ఎవరు ఇష్టం అని అడుగగా.. కోహ్లీనే తాను ప్రిఫర్ చేస్తానని చంద్రబాబు చెప్పారు.

పవన్‍తో చెప్పిన మాటలు ఇవే

జైలులో ఉన్నప్పుడు తనను కలిసేందుకు వచ్చిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍తో చెప్పిన మాటలను చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అందరం కలికి పోటీ చేద్దామని తాను చూచాయిగా ఆ భేటీలో చెప్పానని తెలిపారు. ఆ తర్వాత పొత్తును పవన్ ప్రకటించారని అన్నారు. “ఆకాశంలో సూర్యచంద్రులు. ఆంధ్రలో బాబు, కల్యాణ్ బాబు అంటున్నారు. ఈ కలయిక గురించి మాట్లాడే ముందు ఓ చిన్న సందేహం. ఈ కలయిక ముందే జరగనుందని ఊహించారా” అని చంద్రబాబు చెప్పారు.

విశాఖపట్నంలో ఓసారి హోటల్‍లో కూడా ఉండకూడదని పవన్ కల్యాణ్‍ను అప్పటి ప్రభుత్వం కట్టడి చేసిందని, అప్పుడు ఆయనకు తాను సంఘీభావం తెలియజేశానని చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత తాను జైలుకు వెళ్లానని, హైదరాబాద్ నుంచి పవన్ వచ్చేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నారని చెప్పారు.

“పవన్ హైదరాబాద్‍లో ఉంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేయించారు. రోడ్డు మీద వస్తే నందిగామ దగ్గర ఆపేశారు. వేరే రోడ్డు వైపుగా వస్తే రానీయకపోతే ఆయన రోడ్డు మీద పడుకొని ధర్నా చేశారు. తర్వాతి రోజు నన్ను అరెస్ట్ చేసే వరకు రానీయకుండా కట్టడి చేశారు. తర్వాత నేను జైలులో ఉన్నప్పుడు మీరు, లోకేశ్, పవన్ కల్యాణ్ వచ్చారు” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

తెలుగు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన మీటింగ్ అది, అక్కడ ఏం జరిగిందనేది ప్రజలు తెలియాలని బాలకృష్ణ అడిగారు. “రెండు నిమిషాలు నేను పవన్ కల్యాణ్ మాట్లాడాం. ధైర్యంగానే ఉన్నారా అని అడిగారు. నా జీవితంలో అధైర్యం ఉండదు, భయపడను అని చెప్పా. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు చూశాక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకుండా ప్రయత్నిస్తానని పదేపదే చెప్పారు. ఇద్దరం కలిసి ఓ మాట అనుకున్నాం. నేను ముందు చెప్పా. ఒకవేళ మీరు ఆలోచంచండి.. అందరం కలిసి పోటీ చేద్దామని చూచాయిగా అన్నాను. ఆయన కూడా ఆలోచించి ఓకే చెప్పారు. బీజేపీని కూడా నచ్చజెప్పి కూటమికి తీసుకొస్తానని అన్నారు” అని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత బయట ముగ్గురూ పొత్తు ప్రకటించారని అన్నారు. బీజేపీతో చెప్పకుండానే పవన్ కల్యాణ్ ప్రకటించారని బాలకృష్ణ అన్నారు. తమ విజయానికి అదే ప్రారంభం అని చంద్రబాబు చెప్పారు. జైలులో తాను ఎదుర్కొన్న పరిస్థితులను కూడా ఆయన వివరించారు.

గతేడాది సుమారు 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు ఓ కేసు విషయంలో జైలులో ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

రెండేళ్ల క్రితం అన్‍స్టాపబుల్ రెండో సీజన్ తొలి ఎపిసోడ్‍కు కూడా చంద్రబాబు నాయుడు వచ్చారు. అప్పుడు ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్‍కు ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం