Guppedantha Manasu April 13 Episode: రౌడీల చెర నుంచి తప్పించుకున్న రిషి-వసు.. దేవయానికి రిషి స్ట్రాంగ్ వార్నింగ్
13 April 2023, 10:14 IST
- Guppedantha Manasu April 13 Episode: నిన్నటి ఎపిసోడ్‌లో రిషి-వసులను సౌజన్యరావు కిడ్నాప్ చేస్తాడు. అయితే ఈ రోజు అతడి చెర నుంచి వారు తెలివిగా తప్పించుకుంటారు. అంతేకాకుండా అతి చేస్తున్న దేవయానికి రిషి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తాడు.
గుప్పెడంత మనసు
Guppedantha Manasu April 13 Episode: గుప్పెడంత మనసు నిన్నటి ఎపిసోడ్‌లో రిషి-వసులను సౌజన్యరావు కిడ్నాప్ చేస్తాడు. అతడికి ఇంకెవరో ఆర్డర్లు పాస్ చేస్తుండటంతో వారి ఆదేశాల మేరకు ఇద్దరినీ కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించి ఉంచుతారు. ఎలా తప్పించుకోవాలా అని రిషి, వసులు ఆలోచిస్తుండటంతో బుధవారం ఎపిసోడ్ ముగుస్తుంది. నేటి ఎపిసోడ్‌లో సౌజన్యరావు.. రిషేంద్ర భూషణ్ గురించి తనలో తాను ఆలోచిస్తూ ఉంటాడు. నిన్ను చాలాసార్లు పడగొట్టాలని చూశాని రిషీంద్ర భూషన్.. ప్రతిసారి తప్పించుకున్నావ్.. కానీ ఈ సారి మాత్రం అలా కుదరదు అని అనుకుంటూ ఉంటాడు. మీరు పేరు ప్రఖ్యాతలు ఈ రోజుతో మంట కలిసిపోతాయని ఆనంద పడతాడు.
మరోవైపు రిషి, వసుధార బయట వెళ్లేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. సార్ ఇప్పుడేం చేద్దాం.. ఎలాగోలా ఇక్కడ నుంచి బయటపడాలి అనడంతో కొద్దిసేపు ఆగు వసుధార అని రిషి అంటాడు. అప్పుడు పక్కనే ఓ కిటికీ ఉండటంతో దాన్ని ఓపెన్ చేయగా బయటకు మార్గం ఉండటంతో సంతోషిస్తారు. సరిగ్గా మనిషి పట్టేంత వీలున్న ఆ కిటికీ నుంచి ఇద్దరూ ఎస్కేప్ అవుతారు. ఆ తర్వాత గేట్ వద్దకు చిన్నగా వెళ్తారు. అయితే అక్కడ రౌడీలు ఉండటం చూసి దాక్కుంటారు.
తప్పించుకున్న రిషి-వసు..
ఇంతలోనే అక్కడకు ప్రెస్ వాళ్లు ఉండటం రిషి, వసు గమనిస్తారు. ఇక్కడే ఉంటే ప్రమాదం జరుగుతుందని ఊహించి ఎలాగైనా వెళ్లిపోవాలని వసుధార, రిషి అక్కడ నుంచి తప్పించుకుంటారు. ఆ తర్వాత చిన్నగా బయటకు వస్తారు. మనల్ని, మన కాలేజ్ పరువు తీసేందుకు చాలా పకడ్బంధీగా ప్లాన్ చేశారు. అందుకే ఇద్దరినీ ఒకటే గదిలో బంధించారని వసుతో రిషి అంటాడు. సార్ మన మొబైల్ ఫోన్లు, కార్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా సార్.. ఇప్పుడు ఎలా అని ప్రశ్నించగా.. అవన్నీ ఎలా తీసుకురావాలో నాకు తెలుసు వసుధార.. ముందు మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. అక్కడికి వెళ్తే మనం ప్లాన్ అంతా రివర్స్ అవుతుందని రిషి చెబుతాడు.
వసు కాలికి గుచ్చుకున్న గాజు పెంకు.. ఎత్తుకున్న రిషి
ఇక్కడే ప్రమదామని, అర్జెంటుగా వెళ్లిపోవాడని వసుతో అంటాడు రిషి. ఇద్దరు అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. వసు కాలికి గాజు పెంకు లాంటి మేకు ఒకటి గుచ్చుకుంటుంది. రిషి టెన్షన్ పడుతూ.. ఏమైంది వసుధార.. అంటూ ఆ గాజు పెంకును తీసేస్తాడు. తన కర్ఛీఫ్‌తో ఆమె కాలికి కట్టుకడతాడు. అప్పుడు కూడా వసు నొప్పితో విలవిల్లాడటంతో తట్టుకోలేకపోయిన రిషి.. సారీ వసు నిన్ను ఇబ్బంది పెడుతున్నానంటూ బాధపడతాడు. అదే లేదులేండి సార్ అంటూ రిషిని ఓదేర్చే ప్రయత్నం చేస్తుంది వసు. ఆమె నడవడానికి ఇబ్బంది పడుతుంటే రిషి ఎత్తుకుని మరి అక్కడ నుంచి తీసుకెళ్తాడు. ఓ వైపు వసు మాత్రం వద్దులేండి సార్ అన్నప్పటికీ రిషి తన రెండు చేతులతో ఆమెను మోసుకొని వెళ్తాడు.
ఆ తర్వాత ఆ వైపుగా ఓ ఆటో రావడంతో ఇద్దరూ ఎక్కుతారు. డ్రైవర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని జరిగినదంతా పోలీసులకు వివరిస్తాడు. ఎలాగైనా తమను ఇబ్బంది పెట్టిన వారిని శిక్షించాలని చెబుతాడు. మరోవైపు రిషి, వసులు ఇంకా ఇంటికి రాలేదని జగతీ, మహేంద్రలపై దేవయాని పైర్ అవుతుంటుంది. మీ అందరికీ నేను అన్న మాటలే కనిపిస్తాయి.. కానీ రిషి మీద ఉన్న ప్రేమ మాత్రం కనిపించదు అని అరుస్తూ ఉంటుంది. మీ శిష్యురాలికి ఇదేమైనా పుట్టినిల్లా? ఇక్కడ ఎలా ఉండాలో చెప్పాలి కదా అని జగతీపై సీరియస్ అవుతుంటుంది. అప్పుడు వరకు ఓపికగా భరించిన ఫణీంద్ర భూషణ్.. దేవయాని అని కోపంగా ఆమెపై అరుస్తాడు. భరిస్తున్నారు కదా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు అని సీరియస్‌గా వార్నింగ్ ఇస్తాడు. రిషిని పెంచావు కానీ.. కనింది జగతీ కదా.. ఆమె ఇంకెంత బాధపడాలి అంటూ వార్నింగ్ ఇస్తాడు.
దేవయానికి రిషి స్ట్రాంగ్ వార్నింగ్..
ఇంతలో రిషి, వసుధారలు ఇంటికి చేరుకుంటారు. దీంతో అందరూ టెన్షన్ పడుతూ ఏమైంది అంటూ ఆరా తీయడం ప్రారంభిస్తారు. దేవయానికి అయితే రిషి మాట్లాడేందుకు కూడా అవకాశమివ్వకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తుంటుంది. అంతటితో ఆగకుండా రిషిపై సీరియస్ అవుతుంది. ఆగండి పెద్దమ్మా అంటూ రిషి సీరియస్ అవుతాడు. మేడమ్ వసుధార కాలికి దెబ్బతగిలింది, ఫస్టెయిడ్ చేయమని జగతీ చెప్పడంతో ఆమె కంగారు పడి వసును గదిలోకి తీసుకెళ్తుంది. పెద్దమ్మ మేము ఇంటికి లేటుగా రావడానికి కారణముంది. కానీ కావాలని ఆలస్యం చేయలేదు అని రిషి అంటాడు. ఈ రోజంతా సంతోషంగా గడిపాము.. బయటకు వెళ్లాము. కానీ మాకు అపాయం పొంచి ఉంటుందని ఊహించలేదు అని అంటాడు. సొసైటీ ఏమంటుంది అని మీరు అంటున్నారు.. కానీ మీరు అలా మాట్లాడటం నాకు నచ్చలేదు పెద్దమ్మా.. తప్పు చేసినవాళ్లే అలా భయపడతారు. మేము అలా కాదని దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు రిషి.
సౌజన్యరావు ప్లాన్ బీ..
మరోవైపు సౌజన్య రావు.. రిషి-వసులు తప్పించుకోడాన్ని తట్టుకోలేకపోతారు. నువ్వు చాలా సమర్థుడివి రిషి. నేను వేసిన ప్లాన్ నుంచి ఎస్కేప్ అయ్యావు అనుకుంటూ ఆగ్రహంతో ఊగిపోతాడు. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే మరో ప్లాన్ వేస్తాను అంటూ చదరంగంలో రాజును చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్డేట్ ఏంటి అని అవతలి వైపు నుంచి మెసేజ్ వస్తుంది. ప్లాన్ ఫెయిల్ అయిందని, వాళ్లు తప్పించుకున్నారని సౌజన్యరావు చెబుతాడు. ఏం పర్లేదు ప్లాన్ బీ అమలు చేయండి అంటూ అవతలి వైపు నుంచి మెసేజ్ వస్తుంది.
రిషి.. తమకు జరిగినదంతా ఫణీంద్ర, మహేంద్రలకు వివరిస్తాడు. ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఇందతా ఎవరు చేశారో బయటకు చెబితే వారి పరువు పోతుంది అని రిషి అంటాడు. ఇంతలో మహేంద్ర ఇలా రెచ్చగొడుతూ ఇబ్బంది పెడుతున్న వాళ్లపై కచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అంటాడు. ఇప్పుడు కూడా సైలెంట్‌గా ఉంటే ఎలా రిషి అనగా.. నేను వాళ్లను కచ్చితంగా వదిలిపెట్టను.. యాక్షన్ తీసుకుంటాను అని రిషి బదులిస్తాడు. అంతేకాకుండా అతడు అనుకున్న ప్లాన్ వారితో చెబుతాడు. నేను ఓ నిర్ణయం తీసుకున్నా డాడ్.. ఈ విషయం గురించి పేపర్‍లో ప్రకటిస్తాను అంటూ తన ప్లాన్ మొత్తం వివరిస్తాడు.