తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Today Episode: "అసలు అది పెళ్లి ఎలా అవుతుంది".. వసు మాటలకు రిషి ఫైర్

Guppedantha Manasu Today Episode: "అసలు అది పెళ్లి ఎలా అవుతుంది".. వసు మాటలకు రిషి ఫైర్

05 April 2023, 14:10 IST

google News
    • Guppedantha Manasu Today Episode: గుప్పెడంత మనసులో ఈ రోజు జరగబోయే ఎపిసోడ్‌లో రిషి-వసుధార మధ్య పెళ్లి గురించి చర్చ జరుగుతుంది. ఇరువురు విభిన్న అభిప్రాయాలను వెల్లడిస్తారు. దీంతో జయచంద్ర ఓటింగ్ నిర్వహిస్తారు.
గుప్పెడంత మనసు లేటెస్ట్ ఎపిసోడ్
గుప్పెడంత మనసు లేటెస్ట్ ఎపిసోడ్ (Twitter/StarMAA)

గుప్పెడంత మనసు లేటెస్ట్ ఎపిసోడ్

Guppedantha Manasu Today Episode: రిషి-వసుల గురించి మాట్లాడాలని జయచంద్రను కలుస్తుంది జగతీ. మీరు రెండు జీవితాల సంప్రదాయబద్ధమైన సంగమం జరపాలి అంటూ జయచంద్రకు రిషి-వసుల పరిస్థితి వివరిస్తుంది. ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలో ఇద్దరూ గోప్పవాళ్లేనని, కానీ వారిద్దరూ మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారని వాళ్లను మీరే కలపాలి అంటూ పెళ్లి జరిగిన పరిస్థితి, తర్వాత రిషి.. నువ్వు నా భార్యవు కాదు అన్న సందర్భం గురించి వివరిస్తుంది.

అంతా విన్న జయచంద్ర ఇక అది నా బాధ్యత.. మీరు ఆలోచించకండి అంటూ జగతీకి ధైర్యం చెప్పి పంపిస్తాడు. అనంతరం కాలేజ్‌లో స్టూడెంట్స్‌తో ఓ చర్చగోష్ఠి నిర్వహిస్తారు జయచంద్ర. ప్రపంచం మొత్తం మన దేశాన్ని ఆదర్శంగా తీసుకున్న మన వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుకుందామా? స్టూడెంట్స్‌ను అడుగ్గా.. వారు అందుకు ఒప్పుకుంటారు. "భారతీయ సంప్రదాయాన్ని విదేశాలు కూడా పాటిస్తున్నాయి. సంబంధాలు మాట్లాడుకోవడం గురించి.. నిశ్చితార్థం, పెళ్లి ఇలా ప్రతిదీ మన పూర్వీకులు గొప్పగా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆధునికత ఎక్కవై.. ప్రతి చిన్న కారణానికి విడాకులు తీసుకంటున్నారు. అసలు వివాహం ఏంటో మీకు తెలుసా?" అని విద్యార్థులను అడుగుతారు. అందుకు వారు తాళీ కట్టడమని, జీలకర్ర బెల్లం పెట్టడమని ఇలా తలో మాట మాట్లాడుతారు.

"మీరు చెప్పినవన్నీ వివాహంలో భాగం మాత్రమే.. పెళ్లి అంటే రెండు మనసులు కలవడం.. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ ఇద్దరూ ఒకటిగా బతకడం" అని జయచంద్ర చెబుతారు.పెళ్లి గురించి టాపిక్ రాగానే మహేంద్ర కంగారు పడగా.. జగతీ మాత్రం కూల్‌గా ఉంటుంది. "ఎనిమిది రకలా వివాహల గురించి నేను విన్నాను. బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచ" అంటూ ప్రతి వివాహం గురించి వివరించి చెబుతారు జయచంద్ర. ఆయన మాటలు విన్న రిషి.. మన పెళ్లి ఏ పద్ధతిలో జరిగింది? అని వసుతో అంటాడు. అయితే వసు ఆవేదనగా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది. నువ్వు నేను చేసుకున్న వివాహం.. ఆ ఎనిమిదింటోలో ఏ రకం?అని మళ్లీ చిన్నగా అంటాడు.

తొమ్మిదో రకం వివాహం..

వెంటనే వసు పైకి లేచి ఈ ఎనిమిది రకాల వివాహాలే కాకుండా ఇంకో రకం కూడా ఉంది సార్.. అది కూడా చేర్చాలి. అదే ఆపత్కాల వివాహం అని వసు అంటుంది. దీంతో అంతా షాక్ అవుతారు. ఇది తొమ్మిదో రకం వివాహం.. దీన్ని కూడా పరిగణనలోకి తీసకోవాలి, తీసుకొని తీరాలని వసు స్పష్టం చేస్తుంది. ఇందుకు జయచంద్ర బదులిస్తూ ఏం చెప్పాలనుకున్నావో ఇక్కడకు వచ్చి చెప్పమ్మా.. అంటూ వేదికపైకి ఆహ్వానిస్తారు జయచంద్ర. ఓ పక్క మహేంద్ర కంగారూ పడుతుండగా.. జగతీ మాత్ర ఆగు అన్నట్లు సైగ చేస్తుంది.

వేదికపైకి వచ్చిన వసు మాట్లాడుతూ.. "దిక్కుతోచని స్థితిలో ఓ ఆడపిల్ల తన ప్రేమను రక్షించడానికి, తనంతట తానే మాంగళ్యాన్ని మెడలో వేసుకోడాన్ని ఆపత్కాల వివాహం" అని చెబుతుంది. "ఆ పరిస్థితులు ఏమైనా కావచ్చు. తమ వారి ప్రాణాలను కాపాడుకోడానికి, ఓ దుర్మార్గుడు నుంచి తప్పించుకోడానికి ఏదో బలమైన కారణం ఉండొచ్చు." అంటూ వసు అంటుంది. మరోపక్క రిషి ఆవేశంతో చూస్తూ ఉండిపోతాడు. "సాధారణంగా ఓ వ్యక్తిని చంపడం నేరం.. అదే తనను తాను రక్షించుకునే క్రమంలో ఎదుటి వ్యక్తిని గాయపరచుకోవడం నేరం కాదని చట్టం చెబుతోంది. అలాగే తనను తాను రక్షించుకోవడం కోసం మెడలో తాళి వేసుకోవడం తప్పు కాదు కదా.. అది వివాహమే కదా?" అని జయచంద్ర వైపు ఆవేదనగా చూస్తుంది వసు.

వెంటనే రిషి పైకి లేచి నాకు చిన్న సందేహం ఉంది సార్.. అని అంటాడు. యంగ్ మ్యాన్ నువ్వు వేదికపైకి వచ్చి చెప్పు అని జయచంద్ర అనగా.. రిషి పైకి వచ్చి మాట్లాడతాడు. సార్ మీరు చెప్పిన వివాహాల్లో స్త్రీ పురుషులు లేకుండా జరిగే పెళ్లి ఏదైనా ఉందా? లేదు కదా? అంటాడు. ఇందుకు వసు మాట్లాడుతూ అందుకే నేను తొమ్మిదో రకం అన్నాను అని ఆవేదనంతో మాట్లాడుతుంది.

అసలు అది పెళ్లవుతుందా: రిషి

వసు వైపు కోపంగా చూసిన రిషి.. ఎంత మనస్సాక్షి ఉన్నా.. ఎంత ప్రేమ ఉన్నా స్త్రీ పురుషులు ఇద్దరూ ఉండి చేుసుకుంటేనే అది వివాహం అవుతుంది. ఒక పురుషుడ్ని ఊహించుకొని మెడలో తాళి వేసుకుంటే అది ఊహే అవుతుంది కానీ పెళ్లి కాదు. అంటాడు రిష. దీంతో వసు మౌనంగా తలదించుకుని నిలబడుతుంది. పెళ్లి అంటే పద్దతి ప్రకారం జరగాలని వసుధార చెప్పినట్లు జరిగే పెళ్లి ఏదైనా సంప్రదాయం ఒప్పుకుంటుందా? సంస్కృతీ అంగకరిస్తుందా? ఇందాక సార్ అన్నట్లు..పెళ్లి అంటే రెండు మనస్సులు కలవడం. ఇద్దరూ ఒకటిగా బతకడం.. ఇక్కడ రెండోవాళ్లు లేనప్పుడు అసలు అది పెళ్లి ఎలా అవుతుందని నా అభిప్రాయం అని రిషి అంటాడు.

ఇద్దరిని పిలిచిన జయచంద్ర మీ ఆలోచనలు బట్టి చక్కటి విశ్లేషణ ఇచ్చారు అంటూ ప్రశంసిస్తారు. ఇటు వైపు రిషి.. పెడదారులు పడుతున్న యువ గురించి భయపడుతున్న పెద్దలకు ఊరట. సంప్రదాయాలు లేవు, సంస్కృతీ లేదని యువత విలువల్నీ మర్చిపోతుంటే ఇంత గొప్పగా చదువుకుని, విద్యాసంస్థకు నిర్వాహకుడై సంప్రదాయాల గురించి మాట్లాడుతున్న రిషి నిజంగా ఆదర్శప్రాయుడు. రిషి, వసు ఇద్దరి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కానీ ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పో మీరే చెప్పండి అంటూ జయచంద్ర ఓటింగ్ నిర్వహిస్తాడు. ఈ ఓటింగ్ బట్టే రిషిధారల జీవితం ముందుకు సాగబోతుందని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం