Richest Heroine: ప్రపంచంలో రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే.. రూ.66 వేల కోట్ల సంపద.. టాప్ 10లో ఒకే ఒక్క ఇండియన్ హీరోయిన్
09 October 2024, 11:51 IST
- Richest Heroine: ప్రపంచంలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఏకంగా రూ.66 వేల కోట్ల సంపదతో ఆమె ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. నిజానికి ఆమె పేరు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఇక టాప్ 10లో ఇండియా నుంచి ఒకే ఒక్క నటికి చోటు దక్కింది.
ప్రపంచంలో రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే.. రూ.66 వేల కోట్ల సంపద.. టాప్ 10లో ఒకే ఒక్క ఇండియన్ హీరోయిన్
Richest Heroine: హీరోలతో పోలిస్తే ఏ సినిమా ఇండస్ట్రీ అయినా హీరోయిన్లకు దక్కేది చాలా తక్కువే. దీంతో ఆ హీరోల సంపదకు, హీరోయిన్ల సంపదకు అసలు పొంతనే ఉండదు. కానీ అమెరికాలో ఓ నటి ఉంది. ఆమె ప్రపంచంలోనే అత్యంత ధనికవంతురాలైన నటి. ఏకంగా 8 బిలియన్ డాలర్ల సంపద ఆమె సొంతం. ఇంతకీ ఆ నటి పేరు తెలుసా? జామీ గెర్ట్జ్.
రిచెస్ట్ హీరోయిన్ జామీ
రిచెస్ట్ హీరోయిన్ లిస్టులో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది జామీ గెర్ట్జ్. ఈమె అమెరికన్ నటి. ఫోర్బ్స్ ప్రకారం జామీ సంపద విలువ సుమారు 8 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.66 వేల కోట్లు. ఇప్పటి వరకూ పెద్దగా వినిపించని పేరు ఈమెది.
నిజానికి సినిమాల్లో ఆమె పెద్ద ఫెయిల్యూర్ యాక్ట్రెస్. కానీ మూవీస్ తర్వాత వ్యాపార రంగంలో మాత్రం భారీగా సంపాదించింది. ఎంతలా అంటే.. ప్రపంచంలో మరే హీరోగానీ, హీరోయిన్ గానీ ఆమె దరిదాపుల్లో కూడా లేరు.
ఆ ముగ్గురి సంపద కలిపినా..
ప్రపంచంలో అత్యంత ధనవంతులైన నటీమణుల జాబితాలో జామీ గెర్ట్జ్ తొలి స్థానంలో ఉంది. ఆమె సంపద విలువ తర్వాత జాబితాలో ఉన్న ముగ్గురి సంపద కలిపినా కూడా అంతకంటే ఎక్కువే.
ఈ లిస్టులో ప్రముఖ సింగర్ టేలర్ స్విఫ్ట్ రెండో స్థానంలో ఉంది. ఆమె సంపద విలువ 1.6 బిలియన్ డాలర్లు. ఆ తర్వాత రిహానా 1.4 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, సెలెనా గోమెజ్ 1.3 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. మడోనా ఐదో స్థానంలో ఉన్నా ఆమె సంపద బిలియన్ డాలర్ల కంటే తక్కువే.
ఇండియా నుంచి ఒకే ఒక్కరు
ఇండియాలో రిచెస్ట్ నటి ఎవరో తెలుసా? బాలీవుడ్ నటి జూహీ చావ్లా. ఈమె ప్రపంచంలో అత్యంత ధనికులైన నటీమణుల జాబితాలో టాప్ 10లో ఉన్న ఏకైక భారతీయ నటి. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం జూహీ సంపద విలువ 550 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.4600 కోట్లు. ఇప్పటికీ ఇండియాలో ఆమె దరిదాపుల్లో ఏ హీరోయిన్ లేదు.
అయితే ఈ జాబితాలో ఉన్న హీరోయిన్లందరూ నటన కంటే కూడా ఇతర వ్యాపారాల ద్వారానే ఎక్కువగా సంపాదించారు. జూహీ చావ్లా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హౌజ్ తోపాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ కు కూడా సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే.
ఎవరీ జామీ గెర్ట్జ్?
రిచెస్ట్ హీరోయిన్ జామీ గెర్ట్జ్ కూడా అంతే. 1965లో జన్మించిన ఈ అమెరికన్ నటి.. 1981లో ఎండ్‌లెస్ లవ్ అనే మూవీ ద్వారా సినిమాల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత 1987లో రాబర్ట్ డౌనీ జూనియర్ తో చేసిన లెస్ దాన్ జీరో మూవీ ద్వారా పేరు సంపాదించింది. అయితే తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఫెయిల్యూర్ స్టార్ గా మిగిలిపోయింది.
దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పింది. వ్యాపారవేత్త అయిన టోనీ రెస్లర్ ను పెళ్లి చేసుకుంది. వీళ్లు ఇద్దరూ కలిసి మేజర్ లీగ్ బాస్కెట్ బాల్, నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ లలో రెండు ఫ్రాంఛైజీలకు సహ యజమానులుగా ఉన్నారు. ఇవే కాకుండా వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన జామీ.. ఇంత భారీ సంపదను పోగేసుకుంది.