తెలుగు న్యూస్ / ఫోటో /
Grammy Awards 2024: గ్రామీ అవార్డుల రెడ్ కార్పెట్‌పై టేలర్ స్విఫ్ట్, మైలీ సైరస్ మెరుపులు
Grammy Awards 2024: 66వ గ్రామీ అవార్డుల వేడుకు ఆదివారం (ఫిబ్రవరి 4) రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముందు రెడ్ కార్పెట్ పై సెలబ్రిటీలు తమ అందచందాలతో మెస్మరైజ్ చేశారు. టేలర్ స్విఫ్ట్, మైలీ సైరస్ లాంటి వాళ్లు తమ డ్రెస్ లతో అదరగొట్టారు.
(1 / 6)
Grammy Awards 2024: ప్రపంచ మ్యూజిక్ అవార్డుల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డులు 2024 వేడుక ఘనంగా జరిగింది. లాస్ ఏంజెల్స్ లోని క్రిప్టో.కామ్ అరెనాలో ఈ వేడుక జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద మ్యూజిక్ స్టార్లు ఈ అవార్డుల సెర్మనీ కోసం తరలి వచ్చారు. టేలర్ స్విఫ్ట్, దువా లిపా, మైలీ సైరస్, బిల్లీ ఎల్లిష్ లాంటి వాళ్లు రెడ్ కార్పెట్ పై సందడి చేశారు.
(2 / 6)
Grammy Awards 2024: ఈ 66వ యానువల్ గ్రామీ అవార్డుల సెర్మనీకి పారిస్ హిల్టన్ ఇలా ఓ గ్లామరస్ షీర్ గౌన్ లో వచ్చింది.(Jordan Strauss/Invision/AP)
(3 / 6)
Grammy Awards 2024: ఇక దువా లిపా ఇలా మెటాలిక్ గౌన్ లో మెరిసిపోయింది. లో వీనెక్, ఫుల్ స్లీవ్స్ తో లిపా స్టన్నింగ్ లుక్ లో కనిపించింది.(REUTERS/Mario Anzuoni)
(4 / 6)
Grammy Awards 2024: ఇక టేలర్ స్విఫ్ట్ ఇలా వైట్ గౌన్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఈ అవార్డుల సెర్మనీ వేదిక నుంచే ఆమె తన కొత్త ఆల్బమ్ న కూడా అనౌన్స్ చేసింది.(REUTERS/Mario Anzuoni)
(5 / 6)
Grammy Awards 2024: ఇక మైలీ సైరస్ లుక్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఏడాది గ్రామీ అవార్డుల్లో ఈ పాప్ స్టార్ గోల్డ్ సేఫ్టీ పిన్స్ తో తయారు చేసిన డ్రెస్ వేసుకొని రావడం విశేషం. బోల్డ్ ఫ్యాషన్ తో ఆకట్టుకునే మైలీ.. ఈసారి కూడా అలాంటి న్యూడ్ డ్రెస్ తో వచ్చింది.(REUTERS/Mario Anzuoni)
ఇతర గ్యాలరీలు