RGV Bold Movie: ఆర్జీవీ నుంచి మరో బోల్డ్ మూవీ.. ఒకే పాట మూడు వెర్షన్లు.. టీజర్లతోనే హీటు పుట్టించిన డైరెక్టర్
16 October 2024, 14:13 IST
- RGV Saaree Movie: ఆర్జీవీ మరో బోల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలోని ఐ వాంట్ లవ్ అనే పాట మూడు వెర్షన్లకు సంబంధించిన టీజర్లను అతడు తన ఎక్స్ అకౌంట్ ద్వారా బుధవారం (అక్టోబర్ 16) షేర్ చేశాడు. ఇవన్నీ హీటు పుట్టించేలా ఉన్నాయి.
ఆర్జీవీ నుంచి మరో బోల్డ్ మూవీ.. ఒకే పాట మూడు వెర్షన్లు.. టీజర్లతోనే హీటు పుట్టించిన డైరెక్టర్
RGV Saaree Movie: రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు దేశం మొత్తం మెచ్చిన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన డైరెక్టర్. కొంతకాలంగా బూతు సినిమాలకే పరిమితమయ్యాడు. ఇప్పుడలాంటి డైరెక్టర్ సమర్పణలో శారీ అనే మరో బోల్డ్ మూవీ వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఐ వాంట్ లవ్ అనే ఓ పాట మూడు వెర్షన్లకు సంబంధించిన టీజర్లను అతడు ఎక్స్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు.
సినిమా చరిత్రలో ఇదే తొలిసారి అంటూ..
అసలు సినిమా చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి అంటూ ఈ ఒకే పాట మూడు వెర్షన్ల టీజర్లను రామ్ గోపాల్ వర్మ షేర్ చేశాడు. ఆరాధ్య దేవి నటిస్తున్న ఈ మూవీలోని సాంగ్ టీజరే హీటు పుట్టించేలా ఉంది. ఆమె తడి అందాలను చూపిస్తూ ఈ సాంగ్ షూట్ చేసినట్లు టీజర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ మూడు వెర్షన్లు పూర్తి సాంగ్స్ గురువారం (అక్టోబర్ 17) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు అతడు వెల్లడించాడు.
ఈ మూవీని రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తుండగా.. గిరీష్ కృష్ణ కమల్ డైరెక్ట్ చేశాడు. రవి వర్మ నిర్మిస్తున్నాడు. "ఫిల్మ్ హిస్టరీలో తొలిసారి ఏఐ ద్వారా రీఇమేజిన్ చేసిన ఒకే పాట మూడు వేర్వేరు వెర్షన్లు రాబోతున్నాయి. శారీ మూవీలోని ఐ వాంట్ లవ్ సాంగ్ ఇది. ఇందులో ఆరాధ్యదేవి నటించింది. ఈ పాటలన్నీ అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు రాబోతున్నాయి" అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
ఈ మూడు వెర్షన్లకు సంబంధించిన వేర్వేరు టీజర్లను కూడా అతడు రిలీజ్ చేశాడు. ఒకే పాటపై ఆరాధ్యదేవి రెచ్చిపోయి అందాల ఆరబోస్తూ డ్యాన్స్ చేసిన వీడియోలు అవి. ఈ టీజర్లతోనే ఆమె హీటు పుట్టించింది. ఇక ఫుల్ సాంగ్స్ వస్తే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
లారెన్స్ బిష్ణోయ్, సల్మాన్ ఖాన్ ఇష్యూపై..
ఇక ఆర్జీవీ కొన్ని రోజులుగా గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్, సల్మాన్ ఖాన్ ఇష్యూపై వరుస ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మరోసారి స్పందించాడు. బిష్ణోయ్ కంటే మంచి లుక్ ఉన్న ఫిల్మ్ స్టార్ లేడని, అతనికి సల్మాన్ ఖాన్ కూడా వార్నింగ్ ఇవ్వాల్సిందే అని ట్వీట్లు చేశాడు.
ఆర్జీవీ ఈ అంశంపై చేస్తున్న ప్రతి ట్వీట్ వైరల్ అవుతోంది. ఏ అంశంపై అయినా తనదైన స్టైల్లో స్పందించే ఈ డైరెక్టర్.. ఈ సీరియస్ విషయంపై కూడా తనదైన రీతిలోనే ట్వీట్లు చేస్తున్నాడు. వీటి మధ్యలోనే తన నెక్ట్స్ మూవీ శారీ గురించి అప్డేట్స్ ఇస్తుండటం విశేషం.