Lawrence Bishnoi Hit List : సల్మాన్ ఖాన్ మెయిన్ టార్గెట్.. లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్ రివీల్.. ఎవరు ఉన్నారంటే-salman khan is main target lawrence bishnoi hit list revealed check names here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lawrence Bishnoi Hit List : సల్మాన్ ఖాన్ మెయిన్ టార్గెట్.. లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్ రివీల్.. ఎవరు ఉన్నారంటే

Lawrence Bishnoi Hit List : సల్మాన్ ఖాన్ మెయిన్ టార్గెట్.. లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్ రివీల్.. ఎవరు ఉన్నారంటే

Anand Sai HT Telugu
Oct 14, 2024 08:27 PM IST

Lawrence Bishnoi Hit List : గుజరాత్ జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తాను హిట్ లిస్ట్ తయారు చేసినట్లు ఎన్ఐఏ ముందు అంగీకరించాడు. ఆయన ప్రధాన టార్గెట్ సల్మాన్ ఖాన్. మిగిలిన వారి పేర్లను కూడా వెల్లడించాడు.

లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్
లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన తర్వాత ప్రముఖ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పుడు బిష్ణోయ్ హిట్ లిస్ట్ బయటకు వచ్చింది. ఇందులో పలువురి పేర్లు వెల్లడయ్యాయి. గుజరాత్ లోని సబర్మతి జైలులో ఉన్న బిష్ణోయ్ తాను హిట్ లిస్ట్ తయారు చేసినట్లు ఎన్ఐఏ ముందు అంగీకరించినట్లు సమాచారం. ఇందులో సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ మెయిన్ టార్గెట్‌గా ఉన్నాడు. బాబా సిద్ధిఖీ సల్మాన్ ఖాన్‌కు సన్నిహితుడు కాబట్టే ఆయనను హత్య చేసినట్లు వెల్లడైంది. బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌లో ఉండటంతో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి.

1998లో కృష్ణ జింకను చంపినప్పటి నుండి సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్ణోయ్ టార్గెట్‌లో ఉన్నాడు. కృష్ణ జింకలను చంపినందుకే సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేయాలనుకుంటున్నట్లు బిష్ణోయ్ ఎన్ఐఏ ముందు అంగీకరించాడు. బిష్ణోయ్ సమాజం కృష్ణ జింకలను పవిత్రంగా భావించి ఆరాధిస్తుంది. బిష్ణోయ్ ఆదేశాల మేరకు అతని అనుచరుడు సంపత్ నెహ్రా ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటిని రెక్కీ చేశాడు. కానీ సంపత్ పట్టుబడటంతో ప్లాన్ విజయవంతం కాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిగాయి. ఇందులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌కు భద్రతను పెంచారు.

బిష్ణోయ్ హిట్ లిస్ట్‌లోని పేర్లు

బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే గాయకుడు సిద్ధూ మూస్ వాలాను హతమార్చింది. మూస్ వాలా మేనేజర్ సగున్ ప్రీత్ సింగ్ కూడా బిష్ణోయ్ హిట్ లిస్ట్‌లో ఉన్నాడు. బిష్ణోయ్ హిట్ లిస్ట్‌లో గ్యాంగ్ స్టర్ కౌశల్ చౌదరి కూడా ఉన్నాడు. అతను లారెన్స్ బిష్ణోయ్ బద్ధ శత్రువైన బాంబిహా ముఠాలో భాగం. ఇది పంజాబ్‌తో సంబంధం ఉన్న ముఠా. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు 11 రాష్ట్రాల్లో నెట్ వర్క్ ఉంది. అంతేకాకుండా అతడికి దేశవ్యాప్తంగా 700 మంది షూటర్లు ఉన్నారు.

బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌లో ఉన్నాడు. బాబా సిద్ధిఖీతో పాటు ఆయన కుమారుడు జీషాన్ ను లక్ష్యంగా చేసుకోవాలని బిష్ణోయ్ షూటర్లకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. చాలా కాలం క్రితం ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న దుండగులు జీషాన్, బాబా సిద్ధిఖీల దినచర్యను నిశితంగా పరిశీలించారు. ఈ ఘటనకు ముందు జీషాన్ శనివారం రాత్రి కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు.

బాబా సిద్ధిఖీని ముంబైలోని ఆయన కార్యాలయం వెలుపల ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. హరియాణాకు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23), ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ (19)లను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. మరో నిందితుడు, కుట్రదారుడు ప్రవీణ్ లోంకర్‌ను ఆదివారం అరెస్టు చేశారు. ప్రవీణ్ లోంకర్ సోదరుడు శుభమ్‌కు జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శుభమ్ ఐడీ నుంచి లారెన్స్ బిష్ణోయ్ తరఫున ప్రవీణ్ ఈ హత్యకు బాధ్యత వహించినట్లు ఫేస్‌బుక్‌లో ప్రకటించాడు.

Whats_app_banner