Rashmika Mandanna : నాన్ వెజ్ తిననని రష్మిక అబద్ధం చెప్పిందా?
06 June 2023, 11:46 IST
- Rashmika Mandanna Trolled : ఓ చికెన్ బర్గర్ ప్రకటనలో రష్మిక మందన్న నటించింది. ఇప్పుడు ఆ యాడ్ పై చర్చ మెుదలైంది. రష్మిక మందన్నకు కొంతమంది మద్దతు ఇస్తుండగా.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు.
రష్మిక మందన్న
నటి రష్మిక మందన్న(Actress Rashmika Mandanna)కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనితోపాటుగా ఆమెను ట్రోల్ చేసే నెటిజన్ల సంఖ్య కూడా భారీగానే ఉంది. సెలబ్రిటీలు ఏం చేసినా జనాలు చాలా శ్రద్ధగా గమనిస్తారు. రష్మిక మందన్న విషయంలో కూడా అలాగే ఉంది. రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఫేమస్. పుష్ప(Pushpa)తో ఆమెకు పాన్-ఇండియా స్థాయిలో పాపులారిటీ వచ్చింది. పలు ప్రతిష్టాత్మక బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉంది. తాజాగా రష్మిక మందన్న(Rashmika Mandanna) ఓ చికెన్ బర్గర్ ప్రకటనలో కనిపించింది. అయితే తాను నాన్ వెజ్(Non Veg) తిననని గతంలో చెప్పింది ఆమె. దీంతో రష్మిక మందన్న మీద నెటిజన్లు ట్రోల్స్ మెుదలుపెట్టారు.
బాలీవుడ్(Bollywood) గరిమ కుమార్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దీని గురించి ఒక ప్రశ్న తలెత్తింది. రష్మిక మందన్న కొత్త యాడ్‌లో నాన్ వెజ్ తింటోంది. కానీ ఆమె శాఖాహారులమని చెప్పిందని అందులో ఉంది. ఈ పోస్ట్ మీద నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మమ్మల్ని మోసం చేయడం ఆపండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరు రష్మికపై విమర్శలు చేస్తుండగా.., మరికొందరు నటికి మద్దతు పలుకుతున్నారు. 'సెలబ్రిటీలందరూ తాము ప్రమోట్ చేసే వస్తువులను ఉపయోగించరు. ప్రచార అంబాసిడర్ మాత్రమే.' అని అంటున్నారు. గతంలో రష్మిక మందన్న, నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి పురుషుల లోదుస్తుల ప్రకటనలో నటించిన విషయం కూడా వివాదమైంది.
రష్మిక మందన్న.. క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. సోషల్ మీడియా(Social Media)లో ఫాలోవర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. అందుకే చాలా కంపెనీలు ఆమెను ప్రచార అంబాసిడర్‌గా నియమించుకుంటున్నాయి. నటి రష్మిక మందన్నకు అన్ని రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.8 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.