Riyan Parag Trolls: రియాన్ ప‌రాగ్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు - కార‌ణం ఇదే-ipl 2023 gujarat titans defeat rajasthan royals by 9 wickets ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Riyan Parag Trolls: రియాన్ ప‌రాగ్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు - కార‌ణం ఇదే

Riyan Parag Trolls: రియాన్ ప‌రాగ్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు - కార‌ణం ఇదే

HT Telugu Desk HT Telugu
May 06, 2023 06:27 AM IST

RR vs GT: గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో మ‌రోసారి విఫ‌ల‌మైన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యంగ్ ప్లేయ‌ర్ రియాన్ ప‌రాగ్‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. ఈ ట్రోల్స్ మీమ్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

రియాన్ ప‌రాగ్‌
రియాన్ ప‌రాగ్‌

RR vs GT: శుక్ర‌వారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై గుజ‌రాత్ టైటాన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. బ్యాటింగ్‌లో హార్దిక్‌ పాండ్య‌, బౌలింగ్‌లో ర‌షీద్‌ఖాన్‌, నూర్ అహ్మ‌ద్ మెర‌వ‌డంతో గుజ‌రాత్ అల‌వోక‌గా విజ‌యాన్ని అందుకున్న‌ది. కాగా ఈ మ్యాచ్‌లో దేవ‌ద‌త్‌ఫ‌డిక్క‌ల్‌, హెట్‌మేయ‌ర్‌, ధృవ్ జురేల్‌తో పాటు రాజ‌స్థాన్‌ హిట్ట‌ర్లు వ‌రుస‌గా విఫ‌ల‌మ‌య్యారు. వీరింద‌రిని వ‌దిలిపెట్టిన నెటిజ‌న్లు రియాన్ ప‌రాగ్ మాత్రం టార్గెట్ చేశారు.

ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా రియాన్ ప‌రాగ్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ‌రిలో దించింది. కానీ ఆరు బాల్స్‌లో నాలుగు ప‌రుగులు చేసిన రియాన్ ప‌రాగ్... ర‌షీద్‌ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూగా వెనుదిరిగాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఐపీఎల్‌లో సీజ‌న్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన రియాన్ ప‌రాగ్ కేవ‌లం 58 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. అత‌డి హ‌య్యెస్ట్ స్కోరు ఇర‌వై ర‌న్స్ కావ‌డం గ‌మ‌నార్హం. వ‌రుస‌గా విఫలం అవుతోన్న రియాన్ ప‌రాగ్‌ను నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు.

రియాన్ ప‌రాగ్ ఓ రివ్యూతో పాటు ప‌ది నిమిషాల టైమ్‌, ఇంపాక్ట్ ప్లేయ‌ర్ కోటాను వేస్ట్ చేశాడ‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఐపీఎల్‌లోనే అత‌డు వ‌ర‌స్ట్ ప్లేయ‌ర్ అంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశాడు. అత‌డి కోసం రాజ‌స్థాన్ మూడు కోట్ల ఎన‌భై ల‌క్ష‌ల‌ను వేస్ట్ చేసింద‌ని మ‌రో నెటిజ‌న్ ట్వీట్ చేశాడు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అత‌డికి ఇచ్చిన చివ‌రి అవ‌కాశం ఇదే అయితే బాగుండున‌ని మ‌రో నెటిజ‌న్ అన్నాడు. రియాన్ ప‌రాగ్‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు చేస్తోన్న‌, ట్రోల్స్ మీమ్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

WhatsApp channel