తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rana Daggubati: 35 నాకు పెద్ద పర్వతం లాంటింది.. అమ్మ కష్టమే గుర్తుకొచ్చింది: రానా దగ్గుబాటి

Rana Daggubati: 35 నాకు పెద్ద పర్వతం లాంటింది.. అమ్మ కష్టమే గుర్తుకొచ్చింది: రానా దగ్గుబాటి

Sanjiv Kumar HT Telugu

05 July 2024, 13:55 IST

google News
  • Rana Daggubati About 35 Chinna Katha Kaadu Teaser: 35 చిన్న కథ కాదు సినిమా స్టోరీ వింటే తనకోసం వాళ్ల అమ్మ పడిన కష్టమే గుర్తుకు వచ్చిందని రానా దగ్గుబాటి చెప్పారు. 35 చిన్న కథ కాదు సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రానా దగ్గుబాటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

35 నాకు పెద్ద పర్వతం లాంటింది.. అమ్మ కష్టమే గుర్తుకొచ్చింది: రానా దగ్గుబాటి
35 నాకు పెద్ద పర్వతం లాంటింది.. అమ్మ కష్టమే గుర్తుకొచ్చింది: రానా దగ్గుబాటి

35 నాకు పెద్ద పర్వతం లాంటింది.. అమ్మ కష్టమే గుర్తుకొచ్చింది: రానా దగ్గుబాటి

Rana Daggubati In 35 Chinna Katha Kaadu Teaser Launch: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ మూవీ "35 చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి నంద కిషోర్ ఈమాని కథ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా 35 చిన్న కథ కాదు మూవీ టీజర్‌ని విడుదల చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. గురువారం 35 సినిమా టీజర్ విడుదల చేస్తూ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత రానా దగ్గుబాటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.

"స్కూల్‌లో ఉన్నప్పుడు 35 అనేది నాకు పెద్ద పర్వతం లాంటింది (నవ్వుతూ). నందు ఈ కథ చెప్పినపుడు నాకు నేను గుర్తుకు వచ్చాను, మా అమ్మ గుర్తుకొచ్చింది. నా కోసం మా అమ్మపడిన కష్టం గుర్తుకు వచ్చింది. ఈ కథ వెళ్లి మా అమ్మకు చెప్పాను. ఇది మన అందరి కథ. చాలా మంది లైఫ్ ఇలా ఉంటుంది. ఈ కథని అందరూ రిలేట్ చేసుకుంటారు" అని రానా దగ్గుబాటి చెప్పారు.

"చాలా కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి. కానీ, ఇలాంటి ప్యూర్ హార్ట్ వార్మింగ్ స్టొరీలు రావడం చాలా అరుదు. ఇలాంటి మంచి కథలు సురేష్ ప్రొడక్షన్‌లో చేయాలనేది మా ఉద్దేశం. విశ్వ.. పరేషాన్ సినిమాతో వచ్చారు. సినిమాల పట్ల తనకి చాల పాషన్ ఉంది. నివేదాకి కథ నచ్చేతే ఆ కథతోనే ఉంటుంది. ప్రోడక్ట్ అద్భుతంగా రావడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. తను ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా అనందంగా ఉంది" అని రానా దగ్గుబాటి అన్నారు.

"ప్రియదర్శి ఫెంటాస్టిక్ యాక్టర్. ఇందులో తన లుక్ చూసిన వెంటనే మా మ్యాథ్స్ టీచర్ గుర్తుకొచ్చారు. నందు వెరీ వెరీ ప్యూర్ సోల్. ఇలాంటి అద్భుతమైన చిత్రాలు తను ఇంకెన్నో చేస్తాడు. కిడ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. సృజన్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఆగస్ట్ 15న ఈ సినిమా రావడం చాలా అనందంగా ఉంది. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. థియేటర్స్‌లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి" అని రానా దగ్గుబాటి తెలిపారు.

ఇక 35 చిన్న కథ కాదు టీజర్ విషయానికొస్తే.. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నడుస్తుంది. యంగ్ ఏజ్‌లోనే విశ్వదేవ్‌ని పెళ్లాడిన నివేదా థామస్‌కి స్కూల్‌కి వెళ్లే అబ్బాయి ఉంటాడు. తను చదువులో పూర్. పాస్ మార్కులు (35) సాధించడంలో విఫలమవడంతో ఫ్యామిలీలో నిరాశకి దారితీస్తుంది.

దర్శకుడు నంద కిషోర్ ఈమానీ హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో అందరూ రిలేట్ చేసుకునే సబ్జెక్ట్‌తో ప్రశంసలు అందుకున్నాడు. భావోద్వేగాలు చాలా ప్యూర్‌గా ఉన్నాయి. అతను నెరేటివ్‌కి సమానంగా ఎంటర్‌టైన్మెంట్ ఉండేలా చూసుకున్నాడు. డైలాగ్స్ ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం