Nivetha Pethuraj Fight With Police: పోలీసులతో గొడవ పడిన హీరోయిన్ నివేదా పేతురాజ్.. వీడియో వైరల్
Nivetha Pethuraj Fight With Police: హీరోయిన్ నివేదా పేతురాజ్ పోలీసులతో గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇది ఏదో ఒక సినిమా ప్రమోషన్స్‌లో భాగమని నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ వీడియోలో ఏముందని చూస్తే..
Nivetha Pethuraj Fight With Police: బ్యూటిఫుల్ హీరోయిన్ నివేదా పేతురాజ్ తెలుగులో మంచి సినిమాలతో పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన పాగల్, దాస్ కా ధమ్కీ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. ఇవే కాకుండా ఇతర చిత్రాలతో అలరించిన నివేదా పేతురాజ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

పోలీసులతో గొడవ
నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) పోలీసులతో గొడవ పడుతున్న వీడియో (Nivetha Pethuraj Fight Video) సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోయింది. ఇందులో పోలీసులపై కోపంతో మాట్లాడింది నివేదా పేతురాజ్. ఇంతకీ వీడియోలో ఏముందనే వివరాల్లోకి వెళితే..
పేపర్స్ చూపిస్తాను
కారులో నివేదా పేతురాజ్ ప్రయాణిస్తూ ఉంది. ఓ చోట ఆమెను పోలీసులు ఆపి డిక్కీ ఓపెన్ చేయాలని కోరారు. దానికి నివేదా పేతురాజ్ ఒప్పుకోలేదు. దానికి బదులుగా పోలీసులతో కోపంగా మాట్లాడింది నివేదా పేతురాజ్. "రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్ కూడా ఉన్నాయి. కావాలంటే చూపిస్తాను. చెక్ చేసుకోండి" అని నివేదా పేతురాజ్ బదులిస్తుంది.
కుటుంబ పరువు
అయినా పోలీసులు అవేం వద్దు ట్రంక్ (కారు డిక్కీ) ఓపెన్ చేయండి మేడమ్ అని గట్టిగా వారించారు. దానికి "అర్థం చేసుకోండి. ఇది మా కుటుంబ పరువుకు సంబంధించినది. డిక్కీలో ఏం లేవు. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు" అని నివేదా పేతురాజ్ అసహనం వ్యక్తం చేస్తుంది. ఇంతలో రికార్డ్ అవుతున్న కెమెరావైపు చూస్తూ "ఎందుకు రికార్డ్ చేస్తున్నారు.. ఆపండి" అంటూ కోపంగా కెమెరా తీసేసుకుంది నివేదా పేతురాజ్. ఇంతటితో వీడియో ముగిసింది.
సెకండ్ హీరోయిన్ అన్నార్రా
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, నెటిజన్స్ మాత్రం వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా ఏదో సినిమా ప్రమోషన్స్ అయింటుందంటూ వెటకారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. "ఇది ఏ సినిమా ప్రమోషన్ మాస్టారు", "ఇంతమంచి నటిని సెకండ్ హీరోయిన్ అన్నారురా?", "పోలీసులు జీవించేశారు" అంటూ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
చెప్పులు వేసుకున్న పోలీసులు
అంతేకాకుండా వీడియోలో పోలీసులు షూస్ వేసుకోవడానికి బదులు క్రాక్స్ (చెప్పులు) వేసుకోవడాన్ని మరింకొంతమంది గమనించారు. ఇదే విషయాన్ని చెబుతూ ఇది పక్కా ప్రమోషనల్ వీడియోనే (Movie Promotions) అని తేల్చేస్తున్నారు. మొత్తానికి ఇలా నివేదా పేతురాజ్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
శ్రీ విష్ణు మూవీతో ఎంట్రీ
ఇదిలా ఉంటే, మెంటల్ మదిలో అనే సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. ఇందులో హీరోగా శ్రీ విష్ణు చేశాడు. ఆ తర్వాత అల వైకుంఠపురములో సెకండ్ హీరోయిన్‌గా అలరించింది. బ్రోచెవారెవరురాలో ఓ పాత్ర చేసింది. రెడ్ మూవీలో కూడా మరో హీరోయిన్‌గా పోలీస్ ఆఫీసర్ రోల్‌లో యాక్ట్ చేసింది.
విశ్వక్ సేన్‌తో 3 సినిమాలు
ఇక విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ, పాగల్, బూ మూడు సినిమాల్లో నటించింది నివేదా పేతురాజ్. ఇవే కాకుండా రానా దగ్గుబాటి, సాయి పల్లవిల విరాట పర్వం మూవీలోను అలరించింది. బ్లడ్ మేరీ అనే ఓటీటీ సినిమాతో కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. ఇప్పుడు వైరల్ అయిన వీడియో కూడా ఏదో ఒక ఓటీటీ సినిమా ప్రమోషన్స్‌లో భాగమే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.