తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi: సాయి పల్లవి కోసం బౌన్సర్‌గా మారిన రానా.. వీడియో వైరల్‌

Sai Pallavi: సాయి పల్లవి కోసం బౌన్సర్‌గా మారిన రానా.. వీడియో వైరల్‌

HT Telugu Desk HT Telugu

14 June 2022, 15:56 IST

google News
    • విరాట్‌ పర్వం మూవీతో తొలిసారి సిల్వర్‌ స్క్రీన్‌పై జంటగా కనిపించనున్నారు రానా, సాయి పల్లవి. హీరోయిన్ ఓరియెంటెడ్‌ మూవీ అయినా తన ఇమేజ్‌ను పక్కన పెట్టిన రానా ఈ మూవీలో నటించాడు.
రానా, సాయి పల్లవి
రానా, సాయి పల్లవి (Twitter)

రానా, సాయి పల్లవి

విరాట పర్వం.. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో హీరోయిన్‌ సెంట్రిక్‌గా తిరిగే కథ. ఇలాంటి మూవీని చేయడానికి చాలా మంది నిరాకరించినా.. తాను కథనే నమ్ముకొని చేయడానికి అంగీకరించినట్లు హీరో రానా ఈ మధ్యే చెప్పాడు. అయితే సినిమాలో హీరోయిన్‌కు ప్రాధాన్యమివ్వడమే కాదు.. బయట కూడా సాయిపల్లవి చుట్టే ఉంటున్నాడు రానా.

ఆ మధ్య కర్నూల్‌లో జరిగిన ఈవెంట్‌లో వర్షంలో సాయిపల్లవి మాట్లాడుతుంటే.. పక్కనే ఆమెకు గొడుగు పట్టుకొని నిల్చున్నాడు రానా. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. రానాని చాలా మంది ప్రశంసించారు. ఇక ఇప్పుడు విరాట పర్వం ప్రమోషన్ల కోసం వెళ్తున్న సమయంలో ఎక్కడికెళ్లినా సాయిపల్లవిని చూడటానికి, ఆమెను కలవడానికి అభిమానులు ఎగబడుతున్నారు.

వాళ్ల నుంచి ఆమెను కాపాడటానికి రానా బౌన్సర్‌ అవతారమెత్తాడు. ఎవరినీ ఆమె దగ్గరకి రానివ్వకుండా రెండు చేతులూ అడ్డుపెడుతూ ఎక్కడికక్కడ ఫ్యాన్స్‌ను అడ్డుకుంటున్నాడు. దాదాపు ప్రతి ప్రమోషనల్ ఈవెంట్‌లోనూ రానా అదే పని చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అంతేకాదు తనకు రానా బౌన్సర్‌గా ఎలా ఉంటున్నాడో కూడా ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి చెబుతున్న మాటలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి.

తన విషయంలోనే కాదు.. సెట్స్‌లో ఉండే అందరు ఫిమేల్‌ యాక్టర్స్‌తోనూ రానా చాలా హుందాగా ప్రవర్తిస్తాడని సాయిపల్లవి కొనియాడింది. వాళ్లు జాగ్రత్తగా ఉండాలని రానా కోరుకుంటాడని ఆమె చెప్పింది. ఎక్కడైనా ఏదైనా గందరగోళం జరగబోతోంది అనిపిస్తే రానా ముందుగా తనను అక్కడి నుంచి పంపిచేస్తాడని ఆమె తెలిపింది. ఈ మధ్య ఎంతో మంది తన చేతులు పట్టి లాగడానికి ప్రయత్నించగా.. రానా అడ్డుకున్నట్లు చెప్పింది.

తదుపరి వ్యాసం