తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Setu Anthem: జై శ్రీరామ్‌.. రామ్‌ సేతు ఆంథెమ్‌ సాంగ్‌ ఓ విజువల్‌ ఫీస్ట్

Ram Setu Anthem: జై శ్రీరామ్‌.. రామ్‌ సేతు ఆంథెమ్‌ సాంగ్‌ ఓ విజువల్‌ ఫీస్ట్

HT Telugu Desk HT Telugu

20 October 2022, 15:21 IST

google News
    • Ram Setu Anthem: జై శ్రీరామ్‌ అంటూ సాగిపోయే రామ్‌ సేతు మూవీ ఆంథెమ్‌ సాంగ్‌ను మేకర్స్‌ గురువారం (అక్టోబర్‌ 20) రిలీజ్ చేశారు. రామసేతును కనిపెట్టడానికి ఓ సాహస యాత్ర చేసే అక్షయ్‌కుమార్‌ను ఇందులో చూస్తాం. సాంగ్‌ మొత్తం ఓ విజువల్‌ ఫీస్ట్‌ అని చెప్పొచ్చు.
రామ్ సేతు మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సత్యదేవ్, అక్షయ్ కుమార్
రామ్ సేతు మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సత్యదేవ్, అక్షయ్ కుమార్

రామ్ సేతు మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సత్యదేవ్, అక్షయ్ కుమార్

Ram Setu Anthem: బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన మరో ప్రతిష్టాత్మక సినిమా రామ్‌ సేతు. రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి శ్రీరాముడు నిర్మించాడని చెబుతున్న రామసేతును గుర్తించే పనిలో ఉన్న ఓ ఆర్కియాలజిస్ట్‌గా ఈ సినిమాలో అక్షయ్‌ కనిపించనున్నాడు. ఆకాశం నుంచి చూసినా కనిపించే నిర్మాణంగా రామసేతుకు పేరున్నా.. ఇప్పటికీ దాని ఉనికిపై చర్చ జరుగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో రామ్‌ సేతు పేరుతో ఈ సినిమా తీస్తుండటం విశేషం. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రామ్‌సేతు ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా.. తాజాగా గురువారం (అక్టోబర్‌ 20) ఆంథెమ్‌ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జై శ్రీరామ్‌ అంటూ సాగే ఈ పాట మొత్తం రామ్‌ సేతు కోసం అక్షయ్‌ చేసే సాహసయాత్ర, అందులో అతనికి ఎదురయ్యే అడ్డంకులను చూపిస్తూ సాగింది.

ఈ ఆంథెమ్‌ సాంగ్‌ ఓ విజువల్‌ ఫీస్ట్‌గా చెప్పొచ్చు. ఇదొక్క సాంగ్‌తోనే ఈ రామ్‌ సేతు మూవీ ఎలా ఉండబోతోందో మేకర్స్‌ కళ్లకు కట్టారు. సముద్ర లోతులు, ఎడారుల్లో అక్షయ్‌ సాహస యాత్ర సాగుతుంది. ఈ మ్యూజిక్‌ వీడియో ఫ్యాన్స్‌కు మంచి థ్రిల్‌ పంచుతోంది. విక్రమ్‌ మాంట్రోస్‌ ఈ పాట పాడడంతోపాటు మ్యూజిక్‌ కూడా అందించాడు. ఇక శేఖర్‌ అస్తిత్వ లిరిక్స్‌ అందించాడు.

ఈ రామ్‌ సేతు మూవీలో టాలీవుడ్‌ స్టార్‌ సత్యదేవ్‌ కూడా ఓ స్పెషల్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. నాజర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నుస్రత్‌ బరూచా, ప్రవేశ్‌ రానా ముఖ్యమైన పాత్రలు పోషించారు. అభిషేక్‌ శర్మ ఈ సినిమాకు కథ అందించడంతోపాటు దర్శకత్వం వహించాడు. రామ్‌ సేతు మూవీ అక్టోబర్‌ 25న హిందీతోపాటు తెలుగు, తమిళంలలోనూ రిలీజ్‌ కాబోతోంది. ఆ తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ మూవీ స్ట్రీమ్‌ కానుంది.

తదుపరి వ్యాసం