తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Birthday: తిరుమల చేరుకున్న రామ్‍చరణ్.. మగధీర థియేటర్లలో గేమ్ ఛేంజర్ సాంగ్ సర్‌ప్రైజ్

Ram Charan Birthday: తిరుమల చేరుకున్న రామ్‍చరణ్.. మగధీర థియేటర్లలో గేమ్ ఛేంజర్ సాంగ్ సర్‌ప్రైజ్

26 March 2024, 21:39 IST

    • Ram Charan Birthday: గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ బుధవారం (మార్చి 27) తన పుట్టిన రోజున తిరుమల ఆలయాన్ని దర్శించుకోనున్నారు. మరోవైపు, మగధీర సినిమా కూడా రీ-రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి తొలి సాంగ్ కూడా రానుంది.
Ram Charan Birthday: తిరుమల చేరుకున్న రామ్‍చరణ్
Ram Charan Birthday: తిరుమల చేరుకున్న రామ్‍చరణ్

Ram Charan Birthday: తిరుమల చేరుకున్న రామ్‍చరణ్

Ram Charan Birthday: గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్.. బుధవారం (మార్చి 27) తన 39వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఆయన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. చెర్రీ జన్మదినం సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి బుధవారం తొలి సాంగ్ రానుంది. మగధీర చిత్రం థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. కాగా, పుట్టిన రోజున తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా రామ్‍చరణ్ దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఆయన నేడు (మార్చి 26) తిరుమల చేరుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

గ్రాండ్ వెల్‍కమ్

తిరుమలకు వెళ్లేందుకు నేడు హైదరాబాద్‍లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రామ్‍చరణ్ బయలుదేరారు. ఆయన భార్య ఉపాసన, కుమార్తె క్లీంకార కూడా ఆయనతో వెళ్లారు. ఆ తర్వాత తిరుపతి రేణుగుంట విమానాశ్రయంలో రామ్‍చరణ్‍కు అభిమానులు గ్రాండ్ వెల్‍కమ్ చెప్పారు. విమానాశ్రయానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. రామ్‍చరణ్‍ను చుట్టుముట్టారు. ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. కేకలు, విజిళ్లతో మోతెక్కించారు. ఆ తర్వాత రామ్‍చరణ్.. తిరుమలకు వెళ్లారు.

పుట్టిన రోజున శ్రీవారి దర్శనం

తన పుట్టిన రోజైన బుధవారం (మార్చి 27) రామ్‍చరణ్ కుటుంబంతో కలిసి తిరుమల ఆలయానికి వెళ్లనున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. కుమార్తె క్లీంకార జన్మించిన తర్వాత వచ్చిన తన తొలి పుట్టిన రోజు కావడంతో చరణ్‍కు ఇది మరింత ప్రత్యేకంగా ఉంది.

గేమ్ ఛేంజర్ సాంగ్

రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానిసి దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా బుధవారం (మార్చి 27) గేమ్ ఛేంజర్ సినిమా నుంచి తొలిపాట రానుంది. ‘జరగండి’ అంటూ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. జరగండి పాటను ప్రముఖ సింగల్ దలైర్ మెహందీ పాడారు.

మగధీరతో జరగండి సాంగ్

రామ్‍చరణ్ బర్త్‌డే సందర్భంగా రేపు.. మగధీర చిత్రం థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 2009లో వచ్చి ఇండస్ట్రీ హిట్‍గా నిలిచింది. చరణ్‍ను స్టార్ హీరోగా నిలబెట్టింది. చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మార్చి 27న ఈ సినిమా థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. కాగా, మగధీర రీ-రిలీజ్ షోలతో పాటు గేమ్ ఛేంజర్ నుంచి రానున్న ‘జరగండి’ పాటను థియేటర్లలో ప్రదర్శించనున్నారు. దీంతో మగధీర ప్రదర్శితం కానున్న థియేటర్లలో జరగండి సాంగ్ మోతమోగనుంది.

మగధీర రీ-రిలీజ్ అవుతున్న థియేటర్లలో టికెట్ల బుకింగ్ జోరుగా జరిగింది. ఇప్పటికే కొన్ని చోట్ల థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఫ్యాన్స్ హంగామా భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ అయిన రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు మూవీ ప్లాన్ చేస్తోంది. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానతో మరో సినిమా (RC16) చేయనున్నారు చెర్రీ. ఇది స్పోర్ట్స్ బ్యాక్‍డ్రాప్‍లో ఉండనుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో రామ్‍చరణ్ సినిమా (RC17)కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో రంగస్థలం కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం