Jaragandi Song: గేమ్ ఛేంజర్ నుంచి జరగండి సాంగ్ రిలీజ్ డేట్, టైమ్ ఇదే.. డైరెక్టరే చెప్పేశాడు
Jaragandi Song: రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి జరగండి సాంగ్ రిలీజ్ అయ్యే డేట్, టైమ్ రివీల్ చేశాడు డైరెక్టర్ శంకర్ షణ్ముగం. చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ పాట రానుంది.
Jaragandi Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మొత్తానికి డైరెక్టర్ శంకర్ షణ్ముగమే ఓ సూపర్ అప్డేట్ ఇచ్చాడు. ఈ మూవీ నుంచి ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న జరగండి సాంగ్ రిలీజ్ డేట్, టైమ్ ను శంకర్ రివీల్ చేశాడు. గతేడాది దీపావళికే వస్తుందనుకున్న ఈ పాట ఇప్పుడు చరణ్ బర్త్ డే నాడు అభిమానులను అలరించడానికి వస్తోంది.

జరగండి సాంగ్ రిలీజ్ టైమ్ ఇదే
గేమ్ ఛేంజర్ మూవీ నుంచి జరగండి సాంగ్ బుధవారం (మార్చి 27) ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు డైరెక్టర్ శంకర్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించాడు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. నిజానికి ఇది గతేడాది ఈ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చెబుతూ తీసుకొచ్చిన పోస్టరే ఇది. అందులో చరణ్ బ్యాక్ చూపించారు.
ఈ తాజా పోస్టర్ లో బ్లూ డ్రెస్ లో అదిరిపోయే చరణ్ ఫ్రంట్ లుక్ రివీల్ చేశారు. జరగండి సాంగ్ తెలుగుతోపాటు తమిళం, హిందీల్లోనూ రాబోతోంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు. తాజా పోస్టర్ లో చరణ్ తోపాటు బ్యాక్‌గ్రౌండ్ అంతా కలర్‌ఫుల్ గా కనిపిస్తోంది.
నిజానికి చరణ్ బర్త్ డే సందర్భంగానే మూవీ టీమ్ నుంచి ఈ సాంగ్ రిలీజ్ పై ఏదో ఒక అప్డేట్ వస్తుందని ముందు నుంచి అభిమానులు భావించారు. ఊహించినట్లుగానే ఒక రోజు ముందు డైరెక్టర్ శంకరే ఈ సాంగ్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారు.
చరణ్ లుక్స్ లీక్
ఇక ఈ మధ్యే గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరిగింది. అక్కడి నుంచి సెట్స్ లో రామ్ చరణ్ లుక్ ఫొటోలు కొన్ని లీకయ్యాయి. చరణ్ తోపాటు కియారా అద్వానీ లుక్ కూడా లీకైంది.
పూర్తిగా క్లీన్ షేవ్, మీసంతో రామ్‍చరణ్ ఈ నయా లుక్‍లో అదిరిపోయారు. స్పెక్ట్స్ ధరించి క్లాస్ లుక్‍లో సూపర్‌గా ఉన్నారు. ఆ చిత్రంలో ఓ పొలిటికల్ పార్టీ మీటింగ్ సందర్భంగా చెర్రీ ఈ లుక్‍లో కనిపించనున్నారని టాక్. సెట్స్ నుంచి చరణ్‍కు సంబంధించిన మరో వీడియో కూడా లీక్ అయింది. అదే లుక్‍లో గాగుల్స్ ధరించి చెర్రీ మెట్లు దిగి వస్తున్న వీడియో బయటికి వచ్చింది.
రామ్ చరణ్, కియారా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.110 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ తమ ఓటీటీలోనే రాబోతోందని ప్రైమ్ వీడియోనే ఈ మధ్య జరిగిన ఓ ఈవెంట్లో వెల్లడించిన విషయం తెలిసిందే.
గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుందని సమాచారం. ఇటీవలే విశాఖపట్టణంలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. వైజాగ్‍లో రామ్ చరణ్‍కు ఘన స్వాగతం లభించింది. రెండేళ్ల క్రితమై ఈ మూవీ షూటింగ్ మొదలైనా ఆలస్యమవుతూ వస్తోంది. డైరెక్టర్ శంకర్.. ఇండియన్ 2 మూవీ కూడా చేయడంతో ఈ చిత్రానికి పలుమార్లు బ్రేకులు పడ్డాయి. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ షూటింగ్ చివరి దశకు వచ్చిందని తెలుస్తోంది. మరికాస్త మాత్రమే చిత్రీకరణ మిగిలి ఉందని టాక్. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‍లో సాగనుంది.
టాపిక్