Ram charan fans Attack on Sunisith: శాక్రిఫైజింగ్ స్టార్‌ను చావగొట్టారు.. ఉపాసనపై కామెంట్లు చేసిన సునిశిత్
13 May 2023, 16:40 IST
- Ram charan fans Attack on Sunisith: శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్‌పై మెగా ఫ్యాన్స్ దాడి చేశారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి అగౌరవంగా మాట్లాడినందుకు గాను అతడికి దేహశుద్ధి చేశారు. అంతేకాకుండా క్షమాపణలు కూడా చెప్పించారు.
సునిశిత్‌పై దాడి చేసిన మెగా ఫ్యాన్స్
Ram charan fans Attack on Sunisith: శాక్రీఫైజింగ్ స్టార్ సునిశిత్(Sacrificing Star Sunisith).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతమున్న చాలా మంది హీరోలకు తన ఆఫర్లు త్యాగం చేశానని చెప్పుకుంటూ శాక్రిఫైజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ స్టార్ చెప్పే మాటలు వింటే ఆశ్చర్యం.. ఆ తర్వాత కోపం.. ఇంకాస్తే ఆగితే నవ్వు అన్నీ వాటంతటా అవే వస్తాయి. ఇతనీకేమైనా పిచ్చా ఉందా? లేక వింటున్న మనకుందా? అనే అనుమానంగా రాకమానదు. ఆ విధంగా గత రెండు, మూడేళ్లుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ మధ్య కాలంలో మళ్లీ మీడియా ముందుకొచ్చిన సునిశిత్.. ఈ సారి ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిపై ఉపాసనపై కామెంట్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు మన శాక్రిఫైజింగ్ స్టార్.
సునిశిత్‌కు దేహశుద్ధి(Attack Sunisith)..
సునిశిత్ ఎప్పుడు దొరుకుతాడా? అని ఎదురుచూసిన రామ్ చరణ్ అభిమానులు దొరకగానే చితక బాదేశారు. మా వదిననే తప్పుడు మాటాలు అంటావా? అని పిచ్చ కొట్టుడు కొట్టారు. అంతటితో ఆగకుండా ఉపాసన గురించి ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చేయడం తప్పని ఒప్పించి, ఇంకెప్పుడూ అలా మాట్లాడనని సునిశిత్‌తో మీడియా ముందే చెప్పించారు. ఉపాసన గురించి తప్పుగా మాట్లాడినందుకు రామ్ చరణ్ గారి అభిమానులు తనను కొట్టారని, ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని సునిశిత్ చెప్పాడు.
సునిశిత్ ఈ విధంగా తన నోటి దూలతో అభిమానుల ఆగ్రహానికి గురవ్వడం ఇదే మొదటి సారి కాదు. గతంలో లావణ్య త్రిపాఠితో తనకు వివాహమైందని, ఆమెతో రిలేషన్‌లో ఉన్నానంటూ ఏవేవో చెప్పడంతో సదరు హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మన శాక్రీఫైజింగ్ స్టార్ ఊసలు లెక్కపెట్టాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తన పంథాను మార్చుకోలేదు సునిశిత్. తమన్నా తనను వాడుకుందని, ఆర్ఆర్ఆర్‌లో తనకే ముందు ఛాన్స్ వచ్చిందని ఒక్కటేమిటి.. టాలీవుడ్ స్టార్లలో చాలా మంది పేర్లను వాడుకుంటూ పబ్లిసిటీ పెంచుకున్నాడు.
ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సునిశిత్.. చిరంజీవి తన ఇంటికొచ్చి బెదిరించాడని, మహేష్, ఎన్టీఆర్ల నుంచి బెదిరింపులు వచ్చాయని, నయనతార తనను వాడుకుందని, గీతాగోవిందంలో మొదట హీరో నేనే అని.. అబ్బో మనోడు చెప్పిన లిస్టు చాలానే ఉంది. ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఆ మధ్య నందమూరి ఫ్యాన్స్ చేతిలో కూడా సునిశిత్ దెబ్బలు తిన్నాడు. రవితేజ ఫ్యాన్స్ అయితే కెమెరా ముందే డైరెక్టుగా కొట్టినంత పనిచేశారు. తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. మరి సునిశిత్ ఇకనైనా తన తీరు మార్చుకుంటాడో లేదో చూడాలి.
టాపిక్