Rajinikanth - Chiranjeevi: రజనీకాంత్ హీరో - చిరంజీవి విలన్ - సూపర్ స్టార్స్ కాంబోలో వచ్చిన తెలుగు మూవీ ఏదో తెలుసా?
24 October 2024, 10:12 IST
Rajinikanth Chiranjeevi: దక్షిణాది సూపర్‌స్టార్స్ రజనీకాంత్, చిరంజీవి కలిసి కెరీర్ ఆరంభంలో రెండు సినిమాలు చేశారు. కాళి, బందిపోటు సింహం పేరుతో యాక్షన్ మూవీస్ చేశారు. ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్‌గా నిలవడం గమనార్హం.
చిరంజీవి, రజనీకాంత్
Rajinikanth Chiranjeevi: రజనీకాంత్, చిరంజీవి దక్షిణాదిసినీ పరిశ్రమను చాలా ఏళ్లుగా ఏలుతోన్న సూపర్ స్టార్స్. కోలీవుడ్ అగ్రకథానాయకుడిగా రజనీకాంత్ కొనసాగుతోండగా...టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా చిరంజీవి నిలుస్తోన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తెలుగు, తమిళ భాషల్లో పలు రికార్డులు బ్రేక్ చేశారు చిరంజీవి, రజనీకాంత్.
ఎంతో మందికి స్ఫూర్తి...
చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి స్వయంకృషితో సూపర్‌స్టార్స్‌గా ఎదిగి ఎంతో మందికి చిరంజీవి, రజనీకాంత్ స్ఫూర్తిగా నిలిచారు. కెరీర్ ఆరంభంలో రజనీకాంత్, చిరంజీవి కలిసి రెండు సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచి ఆడియెన్స్‌ను డిసపాయింట్ చేశారు.
కాళి మూవీ...
కాళి సినిమాలో చిరంజీవి, రజనీకాంత్ ఇద్దరు హీరోలుగా కనిపించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి మలయాళ టాప్ డైరెక్టర్ ఐవీ శశి దర్శకత్వం వహించాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీని రూపొందించారు. తెలుగులో చిరంజీవి చేసిన క్యారెక్టర్‌ను తమిళంలో విజయ్ కుమార్ పోషించారు. అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు.
బందిపోటు సింహం...
ఆ తర్వాత చిరంజీవి, రజనీకాంత్ కలిసి తమిళంలో రాణువ వీరన్ అనే మూవీ చేశారు.ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించగా...చిరంజీవి విలన్‌గా కనిపించారు. తెలుగులో ఈ మూవీ బందిపోటు సింహం పేరుతో డబ్ అయ్యింది.
చిరంజీవి విలన్...
చిరంజీవి విలన్ క్యారెక్టర్ అప్పట్లో పాపులర్ అయ్యింది. గడ్డం, గాజు కన్నుతో కంప్లీట్ మాస్ లుక్‌లో తన విలనిజంతో ఆడియెన్స్‌ను భయపెట్టాడు చిరంజీవి. బందిపోటు సింహం సినిమాలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించడం గమనార్హం. తొలుత ఈ సినిమాలో ఎమ్‌జీఆర్‌ను విలన్‌గా తీసుకోవాలని డైరెక్టర్ ఎస్‌పి. ముత్తురామన్ అనుకున్నాడు. కానీ ఎమ్‌జీఆర్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆ అవకాశం చిరంజీవిని వరించింది. బందిపోటు సింహం చిరంజీవి, రజనీకాంత్ కాంబోలో వచ్చిన లాస్ట్ మూవీ.
రెండు డిజాస్టర్సే...
ఈ సినిమా తర్వాత వీరిద్దరు మళ్లీ కలిసి సినిమా చేయలేదు. రజనీకాంత్, చిరంజీవి ఒకే ఫ్రేమ్‌లో చూడాలనే అభిమానుల ఆశ తీరింది. కానీ కమర్షియల్‌గా మాత్రం కాళి, బందిపోటు సింహం...రెండు సినిమాలు డిజాస్టర్స్‌గానే మిగిలాయి.
వేట్టయన్‌తో బ్లాక్‌బస్టర్...
ఇటీవలే వేట్టయన్‌తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు రజనీకాంత్. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో సోషల్ మెసేజ్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వేట్టయన్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు.
150 కోట్ల బడ్జెట్...
మరోవైపు ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌తో చిరంజీవి బిజీగా ఉన్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో సోషియా ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తోన్నారు.
త్రిష హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.