తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Role In Citadel: సిటడెల్‌లో శక్తిమంతమైన పాత్రలో సమంత.. హై యాక్షన్ సీన్లతో దుమ్మురేపనున్న సామ్

Samantha Role in Citadel: సిటడెల్‌లో శక్తిమంతమైన పాత్రలో సమంత.. హై యాక్షన్ సీన్లతో దుమ్మురేపనున్న సామ్

03 March 2023, 18:36 IST

google News
    • Samantha Role in Citadel: టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం సిటడెల్ అనే సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్న రాజ్-డీకే ఇందులోని సామ్ పాత్ర గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశారు.
సిటడెల్‌లో సమంత
సిటడెల్‌లో సమంత

సిటడెల్‌లో సమంత

Samantha Role in Citadel: సమంత రూత్ ప్రభు ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న సౌత్ హీరోయిన్లలో ఒకరు. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. హిందీ సిటడెల్ అనే సిరీస్‌లో నటిస్తోంది ఈ బ్యూటీ. ఇది హాలీవుడ్ సిటడెల్‌కు ఇండియన్ అడాప్షన్. సమంత, వరుణ్ ధావన్ మెయిన్ రోల్‌లో నటిస్తున్న ఈ సిరీస్‌కు రాజ్-డీకే దర్శకులుగా పనిచేస్తున్నారు. తాజాగా వీరు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత పాత్ర గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సిటడెల్‌లోని సామ్ రోల్‌ గురించి తెలియజేశారు.

"మేము సమంత, వరుణ్ ధావన్‌తో షూటింగ్ ప్రారంభించారు. ఈ క్యారెక్టర్ శక్తిమంతంగా ఉంటుంది. సమంత సామర్థ్యాలను ఉపయోగించుకుని ఆమెకు మరింత సవాలు విసిరే పాత్ర ఇది. పర్ఫార్మెన్స్‌లో ఆమెలోని మరిన్ని అంశాలను స్పృశించే కోణాలు ఇందులో ఉన్నాయి" అని రాజ్-డీకే అన్నారు. హై ఆన్ యాక్షన్ రోల్‌లో సామ్ నటిస్తున్నట్లు ఈ సిరీస్ దర్శకులు చెప్పారు.

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం వరుణ్ ధావన్‌‌తో పాటు సామ్ కూడా హై యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోందని సమాచారం. ఇప్పటికే నటికి సంబంధించిన సెట్స్‌కు కొన్ని గ్లింప్స్‌ వీడియోలను షేర్ చేసింది. గత నెలలో ఫిబ్రవరి 20న సామ్ ఈ తన ట్రైనింగ్ వీడియోను షేర్ చేసింది. స్టంట్ పర్ఫార్మర్‌, యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో కలిసి ఈ ముద్దుగుమ్మ కసరత్తులు మొదలెట్టింది. ఇటీవలే చేతులు గాయపడినట్లున్న ఫొటోను కూడా పంచుకుంది.

సామ్‌కు ఈ యాక్షన్ ఘట్టాల్లో నటించడం ఇదే తొలిసారి కాదు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కోసం ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే పోరాటలను చేసింది. రాజీగా ఆమె నటనకు, యాక్షన్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. దీంతో సిటడెల్‌లోనూ అదే తరహా యాక్షన్ సన్నివేశాలు రిపీట్ అవుతాయని సినీ ప్రియులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ మ్యాన్ దర్శకులే ఈ సిటడెల్‌కు దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్న సిటడెల్ సిరీస్‌ను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రూసో బ్రదర్స్ ఒరిజినల్ హాలీవుడ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అక్కడ కూడా సిటడెల్ పేరుతోనే తెరకెక్కుతోంది. ఈ సిరీస్ గ్లోబల్ వెర్షన్‌కు ప్రియాంక చోప్రా జోనాస్, రిచర్డ్ మ్యాడెన్, స్టాన్లీ టస్సీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తదుపరి వ్యాసం