తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Record: పుష్ప 2 @ రూ.500 కోట్లు.. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు

Pushpa 2 Record: పుష్ప 2 @ రూ.500 కోట్లు.. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు

Hari Prasad S HT Telugu

07 December 2024, 22:14 IST

google News
    • Pushpa 2 Record: పుష్ప 2 మూవీ ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. మూడోరోజే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ వసూళ్లు రూ.500 కోట్ల మార్క్ దాటడం విశేషం.
పుష్ప 2 @ రూ.500 కోట్లు.. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు
పుష్ప 2 @ రూ.500 కోట్లు.. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు (Photo: X)

పుష్ప 2 @ రూ.500 కోట్లు.. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు

Pushpa 2 Record: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల్లోనే రూ.400 కోట్లకుపైగా వసూళ్లతో పుష్ప 1 లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసిన ఈ సీక్వెల్.. మూడో రోజు ఏ ఇండియన్ సినిమాకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్క్ అందుకున్న సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.

పుష్ప 2 రికార్డు

పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వసూళ్లలో రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మూడో రోజు రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా పుష్ప 2 నిలిచినట్లు ఎక్స్ అకౌంట్ ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.

"బిగ్గెస్ట్ ఇండియన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్ లా వ్యాప్తిస్తూ రికార్డులను తిరగరాస్తోంది.. పుష్ప 2 ద రూల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.500 గ్రాస్ కలెక్షన్లను అత్యంత వేగంగా సాధించిన ఇండియన్ సినిమా.. రూలింగ్ ఇన్ సినిమాస్" అనే క్యాప్షన్ తో ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. ఆల్ టైమ్ రికార్డు.. ఫాస్టెస్ట్ రూ.500 కోట్లు సాధించిన ఇండియన్ సినిమా అంటూ ఆ పోస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

పుష్ప 2 ఇండియా వసూళ్లు

పుష్ప 2 ఇండియాలో సాధించిన వసూళ్లు మూడు రోజుల్లో (శనివారం రాత్రి 9 గంటల వరకు) రూ.364.63 కోట్లకు చేరింది. ప్రీమియర్ షోలు, తొలి రోజు కలిపి ఇండియాలోనే రూ.175 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు రూ.93.8 కోట్లు రాబట్టింది. ఇక మూడో రోజు రాత్రి 9 గంటల వరకు రూ.95.93 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తంగా మూడు రోజులు కలిపి ఇండియాలోనే రూ.364.63 కోట్లు వచ్చాయి.

పుష్ప 2 తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమా, రెండు భాషల్లో ఒకే రోజు రూ.50 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమాగా పలు రికార్డులను నమోదు చేసింది. ఇక ఇప్పుడు అత్యంత వేగంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లతో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. నాలుగో రోజైన ఆదివారం (డిసెంబర్ 8) ఈ వసూళ్లు మరింత పెరగనున్నాయి.

ఈ రికార్డుల పరంపరను పుష్ప 2 టీమ్ ఘనంగానే సెలబ్రేట్ చేసుకుంది. శనివారం (డిసెంబర్ 7) రాత్రి మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో అల్లు అర్జున్, సుకుమార్ తోపాటు టీమ్ అంతా పార్టిసిపేట్ చేసింది. ఈ సందర్భంగా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పాడు.

తదుపరి వ్యాసం