తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Project K Deepika Padukone: ప్రాజెక్ట్ కేలో దీపికా ప‌డుకోణ్ క్యారెక్ట‌ర్స్‌పై ప్రొడ్యూస‌ర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Project k Deepika Padukone: ప్రాజెక్ట్ కేలో దీపికా ప‌డుకోణ్ క్యారెక్ట‌ర్స్‌పై ప్రొడ్యూస‌ర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

26 February 2023, 10:59 IST

  • Project k Deepika Padukone: ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌పై నిర్మాత అశ్వ‌నీద‌త్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని రివీల్ చేశాడు. ఆయ‌న ఏమ‌న్నాడంటే...

దీపికా ప‌డుకోణ్
దీపికా ప‌డుకోణ్

దీపికా ప‌డుకోణ్

Project k Deepika Padukone: ప్ర‌స్తుతం పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ నెల‌కొన్న భారీ బ‌డ్జెట్‌ సినిమాల్లో ప్రాజెక్ట్ కే ఒక‌టి. ప్ర‌భాస్ హీరోగా సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న ప్రాజెక్ట్ కే రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

Bastar The Naxal Story OTT: అదాశర్మ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా..

Geethanjali Malli Vachindi OTT Streaming: ఇంకా ఓటీటీలోకి రాని గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఆలస్యానికి ఇదే కారణమా?

Jyothi Rai: గుప్పెడంత మనసు జ్యోతి రాయ్ అశ్లీల వీడియోలు వైరల్.. అలా చేస్తే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామంటూ..

Partner OTT: రెండు ఓటీటీల‌లో రిలీజైన‌ హ‌న్సిక క‌న్ఫ్యూజ‌న్ కామెడీ మూవీ - అబ్బాయి...అమ్మాయిగా మారితే!

ఓ ఇంట‌ర్వ్యూలో ప్రాజెక్ట్ కేపై అశ్వ‌నీద‌త్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. ప్రాజెక్ట్ కే క‌థ మొత్తం ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ ప్ర‌ధానంగా సాగినా దీపికా ప‌డుకోణ్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ పాత్ర‌ల‌కు సినిమాలో ప్రాధాన్య‌ముంటుంద‌ని తెలిపారు. దీపికా, అమితాబ్ క్యారెక్ట‌ర్స్‌కు సంబంధించి మ‌రో ఏడు నుంచి ప‌ది రోజులు మాత్ర‌మే షూటింగ్ బ్యాలెన్స్‌గా ఉంద‌ని పేర్కొన్నాడు. త్వ‌ర‌లోనే వారు తిరిగి షూటింగ్‌లో జాయిన్ కాబోతున్న‌ట్లు వెల్ల‌డించాడు.

గ్రాఫిక్స్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు సినిమాలో ఇంపార్టెన్స్ ఎక్కువేన‌ని, ఈ వీఎఫ్ఎక్స్ ప‌నుల కోసం ఐదు నెల‌ల క్రిత‌మే ఐదు కంపెనీల‌తో టై అప్ అయిన‌ట్లు అశ్వ‌నీద‌త్ చెప్పారు. అంతేకాకుండా ఈ సినిమాకు మిక్కీ జే మేయ‌ర్ స్థానంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా సంతోష్ నారాయ‌ణ‌న్‌ను తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మార్పుకు గ‌ల కార‌ణాల్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. అశ్వ‌నీద‌త్ కామెంట్స్ ప్ర‌భాస్ అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్నాయి. సూపర్ హీరో కథాంశంతో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.