Tollywood Stars Lineup Movies: ప్ర‌భాస్ ఐదు...ప‌వ‌న్ నాలుగు - టాలీవుడ్ స్టార్స్ లైన‌ప్ మామూలుగా లేదుగా-pawan kalyan prabhas mahesh babu and other tollywood star heroes massive line up upcoming movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pawan Kalyan Prabhas Mahesh Babu And Other Tollywood Star Heroes Massive Line Up Upcoming Movies

Tollywood Stars Lineup Movies: ప్ర‌భాస్ ఐదు...ప‌వ‌న్ నాలుగు - టాలీవుడ్ స్టార్స్ లైన‌ప్ మామూలుగా లేదుగా

Nelki Naresh Kumar HT Telugu
Feb 23, 2023 09:46 AM IST

Tollywood Stars Lineup Movies: ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్ర‌భాస్‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ స్టార్స్ సినిమాల స్పీడును పెంచేశారు. ఒకేసారి రెండు, మూడు సినిమాల్లో న‌టిస్తూ అభిమానుల‌ను అల‌రించేందుకు రెడీ అవుతోన్నారు.

ప్ర‌భాస్‌
ప్ర‌భాస్‌

Tollywood Stars Lineup Movies: గ‌తంలో ఏడాదికి ఒక సినిమా అనే ఫార్ములాను స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేవారు టాలీవుడ్ స్టార్స్‌. ఒక సినిమా పూర్త‌యిన త‌ర్వాతే మ‌రో సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేవారు. ఇప్పుడా రూల్‌ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేశారు. ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేస్తూ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నారు. ప్ర‌స్తుతం స్టార్ హీరోల లైన‌ప్స్ ఎలా ఉన్నాయంటే...

ప్ర‌భాస్ (Prabhas) ఐదు సినిమాలు...

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్స్‌లో అంద‌రికంటే ఎక్కువ‌గా బిజీగా ఉన్నారు ప్ర‌భాస్‌. ఏడాదికి ఒక సినిమా చొప్పున 20 ఏళ్ల కెరీర్‌లో కేవ‌లం ఇర‌వై సినిమాలు మాత్ర‌మే చేశాడు ప్ర‌భాస్‌. ఒకేసారి త‌న సినిమాల స్పీడును పెంచి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఐదు సినిమాల్లో న‌టిస్తున్నాడు.

ప్ర‌భాస్ రాముడిగా న‌టిస్తోన్న ఆదిపురుష్ సినిమా జూన్ 16న రిలీజ్ కానుంది. రామాయ‌ణ‌గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. అలాగే కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ సినిమా చేస్తోన్నాడు ప్ర‌భాస్‌. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 18న రిలీజ్ కానుంది.

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రాజెక్ట్ కే తో సంక్రాంతి కి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. వీటితో పాటుగా ద‌ర్శ‌కుడు మారుతితో కెరీర్‌లో తొలిసారి ఓ హార‌ర్ సినిమా చేయ‌బోతున్నాడు ప్ర‌భాస్‌. అలాగే బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో పాన్ ఇండియ‌న్ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

ప‌వ‌న్ నాలుగు సినిమాలు...

ప్ర‌భాస్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan)అత్య‌ధికంగా నాలుగు సినిమాల్ని లైన్‌లో పెట్టాడు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న హారిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమా షూటింగ్ స‌గం వ‌ర‌కు పూర్త‌వ్వ‌గా ఉస్తాద్‌భ‌గ‌త్‌సింగ్ తో పాటు సుజిత్ సినిమా, వినోధ‌య‌సీత‌మ్ రీమేక్‌ పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకున్నాయి.

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొఘ‌లుల కాలం నాటి బందిపోటు దొంగ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. సుజిత్ సినిమా గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశంతో రూపొంద‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ తేరి రీమేక్ అనే అంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న వినోధ‌య సీత‌మ్‌లో దేవుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌బోతున్నారు.

విజ‌య్ నాలుగు సినిమాలు...

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) డేట్స్ మ‌రో రెండు, మూడేళ్ల పాటు ఫుల్ అయ్యాయి. ప్ర‌స్తుతం మూడు సినిమాలు చేస్తోన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మ‌హాన‌టి త‌ర్వాత విజ‌య్‌, స‌మంత క‌ల‌యిక‌లో ఖుషి సినిమా రూపొందుతోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈసినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే పునఃప్రారంభంకానుంది. జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరితో గూఢ‌చార నేప‌థ్య సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు విజ‌య్‌. అలాగే గీత‌గోవింద త‌ర్వాత ప‌ర‌శురామ్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించాడు. వీటితో పాటుగా విజ‌య్ సుకుమార్ సినిమాను అనౌన్స్‌చేసి చాలా కాల‌మైంది. అది కూడా ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ర‌వితేజ (Raviteja) మూడు...

ఈ ఏడాది ర‌వితేజ హీరోగా న‌టించిన రావ‌ణాసుర‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావుతో పాటు మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చేందుకు ర‌వితేజ ప్లాన్స్ చేస్తోన్నాడు.

ఎన్టీఆర్‌, మ‌హేష్‌, చ‌ర‌ణ్ - రెండు సినిమాలు...

ఎన్టీఆర్‌, మ‌హేష్‌బాబు, రామ్‌చ‌ర‌ణ్ రెండేసి సినిమాల‌కు ప‌చ్చ‌జెండా ఊపారు. కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్‌ల‌తో ఎన్టీఆర్ సినిమాలు చేయ‌నున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే సెట్స్‌పైకిరానున్నాయి. మ‌రోవైపు రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ పాన్ ఇండియ‌న్ సినిమాను పూర్తిచేసే ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్నాడు. ఈ సినిమాతో పాటుగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో మ‌రో యాక్ష‌న్‌ సినిమాను అంగీక‌రించాడు చ‌ర‌ణ్‌.

మ‌హేష్ - రాజ‌మౌళి మూవీ....

ఓ సినిమా త‌ర్వాత మ‌రో సినిమా రూల్‌ను పాటిస్తూ వ‌చ్చిన మ‌హేష్‌బాబు మొద‌టిసారి రెండు సినిమాల్ని లైన్‌లో పెట్టాడు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో హ్యాట్రిక్ ఫిల్మ్ చేస్తోన్నాడు మ‌హేష్‌బాబు. ఈ సినిమా ఆగ‌స్ట్‌లో రిలీజ్ కానుంది. త్రివిక్ర‌మ్‌తో పాటుగా అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో అడ్వెంచ‌ర్ సినిమా చేయ‌నున్నాడు మ‌హేష్‌బాబు. మ‌హేష్‌, రాజ‌మౌళి సినిమా ఈ ఏడాది చివ‌ర‌లో సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

యంగ్ హీరోలు సాయిధ‌ర‌మ్‌తేజ్‌, వ‌రుణ్‌తేజ్‌తో రెండేసి సినిమాల‌కు అంగీక‌రించి జోరుమీదున్నారు.

IPL_Entry_Point