తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vikramarkudu 2: విక్రమార్కుడు 2 కథ రెడీ.. హీరో కోసమే వెయిటింగ్.. స్టేజీపై నిర్మాత లేటెస్ట్ కామెంట్స్

Vikramarkudu 2: విక్రమార్కుడు 2 కథ రెడీ.. హీరో కోసమే వెయిటింగ్.. స్టేజీపై నిర్మాత లేటెస్ట్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

20 April 2024, 12:18 IST

  • Producer KK Radhamohan On Vikramarkudu 2: విక్రమార్కుడు 2 సినిమా కథ రెడీగా ఉందని, నటీనటులు కోసమే ఎదురుచూస్తున్నట్లు తాజాగా నిర్మాత కేకే రాధామోహన్ రచయిత విజయేంద్ర ప్రసాద్ ముందే షాకింగ్ కామెంట్స్ చేశారు. దానికి అవును అన్నట్లుగా విజయేంద్ర ప్రసాద్ తల ఊపారు.

విక్రమార్కుడు 2 కథ రెడీ.. హీరో కోసమే వెయిటింగ్.. స్టేజీపై నిర్మాత లేటెస్ట్ కామెంట్స్
విక్రమార్కుడు 2 కథ రెడీ.. హీరో కోసమే వెయిటింగ్.. స్టేజీపై నిర్మాత లేటెస్ట్ కామెంట్స్

విక్రమార్కుడు 2 కథ రెడీ.. హీరో కోసమే వెయిటింగ్.. స్టేజీపై నిర్మాత లేటెస్ట్ కామెంట్స్

KK Radhamohan Vikramarkudu 2 Ruslaan Meet: రవితేజ, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన విక్రమార్కుడు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అటు రవితేజకు, ఇటు రాజమౌళికి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Krishna mukunda murari serial: మీరానే సరోగసి మథర్.. ఆదర్శ్, ముకుంద పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తున్న భవానీ

Brahmamudi May13th Episode: అత్త ఛాలెంజ్‌కు కావ్య సై - భార్య‌కు రాజ్ క్లాస్ - ఓట‌మితో ల‌గేజీ స‌ర్ధేసుకున్న రుద్రాణి

కార్తీకదీపం 2 సీరియల్..బావ కోసం అల్లాడిపోయిన జ్యోత్స్న.. దీపకి ఎప్పటికీ తోడుగా ఉంటానని తేల్చేసిన కార్తీక్

Star Review: స్టార్ రివ్యూ - కెవిన్ లేటెస్ట్ త‌మిళ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఎలా ఉందంటే?

హిందీలో తొలిసారిగా

అయితే, విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్‌గా విక్రమార్కుడు 2 రావాలని ప్రేక్షకులు, సినీ అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. విక్రమార్కుడు 2 మూవీకి స్క్రిప్ట్ పూర్తయిందని తాజాగా నిర్మాత కెకె రాధామోహన్ తెలిపారు. ఇటీవల గోపీచంద్‌తో భీమా సినిమాను రూపొందించిన నిర్మాత కేకే రాధామోహన్ బాలీవుడ్‌లో తొలిసారిగా నిర్మిస్తున్న సినిమా రుస్లాన్.

ముఖ్య అతిథిగా విజయేంద్ర ప్రసాద్

బాలీవుడ్ యంగ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ చేస్తున్న రుస్లాన్ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. కరణ్ బీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రుస్లాన్ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అథిగా హాజరయ్యారు.

రెండు స్టోరీలు రెడీ చేశారు

కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్ స్పీచ్ తర్వాత నిర్మాత కేకే రాధామోహన్ మాట్లాడారు. "మన రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు నాకు రెండు స్టోరీలు తయారు చేశారు. ఒకటి విక్రమార్కుడు 2. హిందీలో రౌడీ రాథోడ్ 2. తెలుగులో విక్రమార్కుడు 2. సబ్జెక్ట్ అంతా రెడీగా ఉంది. క్యాస్టింగ్ గురించి ట్రై చేస్తున్నాం. సరైనా క్యాస్టింగ్ దొరికితే (హీరో, హీరోయిన్, నటీనటులు) దాదాపుగా ప్రారంభించే అవకాశం ఉంది" అని నిర్మాత కేకే రాధామోహన్ అన్నారు.

భజరంగీ భాయిజాన్ 2 కథ కూడా

విక్రమార్కుడు 2 గురించి నిర్మాత చెప్పేటప్పుడు హాల్ అంతా అరుపులు వినిపించాయి. నిర్మాత మాటలకు అవును అన్నట్లుగా రైటర్ విజయేంద్ర ప్రసాద్ తల ఊపారు. తర్వాత ఇక అది కూడా చెప్పు అన్నట్లుగా విజయేంద్ర ప్రసాద్ చేయి చూపించారు. దాంతో భజరంగీ భాయిజాన్ 2 కథ గురించి కూడా కేకే రాధామోహన్ చెప్పారు.

సల్మాన్ ఖాన్ ఓకే అంటే

"ఇది నా ప్రొడక్షన్ కాకపోవచ్చు. ఆయన భజరంగీ భాయిజాన్ 2 స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నారు. నేను చెప్పేది రైటా సార్" అని నిర్మాత అంటే.. అవును అని విజయేంద్ర ప్రసాద్ నవ్వుతూ తల ఊపారు. "స్క్రిప్ట్ రెడీగా ఉంది. సల్మాన్ ఖాన్‌కు స్క్రిప్ట్ చెప్పేందుకు కొంత సమయం తీసుకుంటున్నారు అంతే. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం" అని నిర్మాత కేకే రాధామోహన్ తెలిపారు.

అద్భుతంగా వచ్చింది

అనంతరం రుస్లాన్ సినిమా గురించి కేకే రాధామోహన్ మాట్లాడారు. "హిందీలో ఇది మా మొదటి సినిమా. ఈ సినిమా చాలా కష్టపడి అద్భుతంగా తీశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. ఎమోషన్, యాక్షన్, మంచి డైలాగ్స్, అందమైన విజువల్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది" అని నిర్మాత చెప్పారు.

హీరోయిన్‌గా సుశ్రీ మిశ్రా

"రుస్లాన్ ఏప్రిల్ 26న విడుదల అవుతోంది. అందరూ ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి పెద్ద విజయాన్ని చేకూర్చుతారని నమ్ముతున్నాను'' అని ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్‌లో ఆయుష్ శర్మతోపాటు హీరోయిన్ సుశ్రీ మిశ్రా, జగపతి బాబు పాల్గొన్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం