తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  C Kalyan: నా కథను కాపీ కొట్టాడు...బాలకృష్ణ దర్శకుడిపై నిర్మాత సి. కళ్యాణ్ కామెంట్స్

C kalyan: నా కథను కాపీ కొట్టాడు...బాలకృష్ణ దర్శకుడిపై నిర్మాత సి. కళ్యాణ్ కామెంట్స్

HT Telugu Desk HT Telugu

10 July 2022, 18:24 IST

google News
  • దర్శకుడు గోపిచంద్ మలినేనిపై (gopichand malineni)సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ (c kalyan)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను రైట్స్ కొనుగోలు చేసిన ఓ తమిళ సినిమా కథను గోపీచంద్ మలినేని కాపీ కొట్టాడంటూ పేర్కొన్నాడు. మై డియర్ భూతం ప్రెస్ మీట్ లో సి.కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.  

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని (twitter)

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని

రవితేజ (ravi teja)హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో సుదీర్ఘ విరామం తర్వాత రవితేజతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని విజయాల బాట పట్టారు. ఈ సక్సెస్ తర్వాత బాలకృష్ణతో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు గోపీచంద్ మలినేని. అతడిపై సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుదేవా హీరోగా నటించిన మైడియర్ భూతం ప్రెస్ మీట్ శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన సి. కళ్యాణ్ తన సినిమాను గోపీచంద్ మలినేని కాపీ కొట్టాడంటూ పేర్కొన్నాడు.

విజయ్ సేతుపతి హీరోగా నటించిన తమిళ సినిమా సేతుపతి హక్కులను తాను కొనుగోలు చేసినట్లు సి.కళ్యాణ్ తెలిపాడు. ఆ సినిమాను క్రాక్ పేరుతో దర్శకుడు గోపీచంద్ మలినేని కాపీ చేశాడని తెలిపాడు. విలన్ పాత్రలో మార్పులు చేసి తన కథను కాపీ కొట్టి తనకే వినిపించాడని పేర్కొన్నాడు. అతడు సినిమా చేయడానికి ఆసక్తిగా ఉండటంతో సేతుపతి హక్కులను ఇచ్చేశానని సి.కళ్యాణ్ అన్నాడు. గోపీచంద్ మలినేనిపై సి.కళ్యాణ్ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

అంతేకాకుండా విక్రమ్, మేజర్ తర్వాత సినిమాల్ని చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని సి.కళ్యాణ్ చెప్పాడు. మంచి సినిమాలు రిలీజ్ అయినా థియేటర్ల వైపు ప్రేక్షకులు కన్నెత్తి చూడటం లేదని ఆయన పేర్కొన్నాడు.

తదుపరి వ్యాసం