తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Goat Life Ott: పృథ్విరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?

The Goat Life OTT: పృథ్విరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?

12 May 2024, 16:39 IST

google News
    • The Goat Life OTT Release: ది గోట్ లైఫ్ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోంది. ఈ సర్వైవల్ డ్రామా సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్‍కు రానుందో తాజాగా  సమాచారం బయటికి వచ్చింది. 
The Goat Life OTT: పృథ్విరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?
The Goat Life OTT: పృథ్విరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?

The Goat Life OTT: పృథ్విరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?

The Goat Life OTT: మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఆడుజీవితం - ది గోట్ లైఫ్’ చిత్రం కమర్షియల్‍గా సక్సెస్ అవటంతో పాటు ప్రశంసలను దక్కించుకుంది. మార్చి 28వ తేదీన రిలీజై ఈ మూవీ సూపర్ హిట్‍గా నిలిచింది. సర్వైవల్ డ్రామా మూవీ 'ఆడుజీవితం'కు బ్లెస్సీ దర్శకత్వం వహించారు. నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా, ఆడుజీవితం చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.

మరింత ఆలస్యం

ఆడుజీవితం - ది గోట్‍లైఫ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం మే 10వ తేదీన స్ట్రీమింగ్‍కు వస్తుందని సమాచారం చక్కర్లు కొట్టింది. అయితే, అలా జరగలేదు. హాట్‍స్టార్ ఓటీటీలోకి ఈ చిత్రం ఇంకా రాలేదు.

ఆడుజీవితం సినిమా మే 26వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే, ఈ విషయంపై హాట్‍స్టార్ ఓటీటీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మొత్తంగా.. ఎంతో మంది నిరీక్షిస్తున్న ఆడుజీవితం మూవీ స్ట్రీమింగ్ మాత్రం మరింత ఆలస్యం అవుతోంది.

మరోవైపు, ఆడుజీవితం సినిమా హాట్‍స్టార్ ఓటీటీలోకి ఎక్కువ రన్‍టైమ్‍తో రానుందని కూడా తెలుస్తోంది. థియేటర్లలో ఈ చిత్రం రన్‍టైమ్ సుమారు 3 గంటలు ఉండగా.. మరో అరగంట ఎక్కువ నిడివితో ఓటీటీలోకి అడుగుపెడుతుందని టాక్. ఈ విషయంపై గతంలో దర్శకుడు బ్లెస్సీ హింట్ ఇచ్చారు.

నిజజీవిత ఘటనలతో..

కేరళ నుంచి సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లి బానిసగా మారిన నజీబ్ మహమ్మద్ అనే వ్యక్తి నిజజీవితంపై ఆడుజీవితం చిత్రం తెరకెక్కింది. సౌదీలో అతడు పడిన కష్టాలు, ఎడారి నుంచి బయపడేందుకు చేసిన ప్రయత్నాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. బెన్యామీన్ రచించిన ఆడుజీవితం బుక్ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కించారు.

ఆడుజీవితం మూవీలో పృథ్విరాజ్ సుకుమారన్‍కు జోడీగా అమలాపాల్ నటించారు. కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్, శోభనా మోహన్, తలీబ్ అల్ బలూషీ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని బ్లెస్సీ, జిమ్మీ జీన్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్ సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేయగా.. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. సునీల్ కేఎస్ సినిమాటోగ్రఫీ చేశారు.

కలెక్షన్లు ఇలా..

ఆడుజీవితం చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.155 కోట్ల కలెక్షన్లు దక్కాయి. హిట్‍గా నిలువడంతో పాటు మలయాళ ఇండస్ట్రీలో ఈ మూవీ మరో క్లాసిక్‍గా నిలిచింది. ఈ చిత్రాన్ని బ్లెస్సీ తెరకెక్కించిన విధానంపై ప్రశంసలు వచ్చాయి. ఎమోషనల్‍గా.. గ్రిప్పింగ్‍గా ఈ మూవీని చూపించారు. నజీబ్ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ జీవించేశారు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి మరో బలంగా నిలిచింది. సుమారు రూ.82 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం మంచి హిట్ సాధించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం