తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Movie: హనుమాన్‌ మూవీలో హిందూ మతం గురించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్

Hanuman Movie: హనుమాన్‌ మూవీలో హిందూ మతం గురించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

11 January 2024, 10:46 IST

google News
  • Prasanth Varma About Hanuman Movie: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ అంటే హిందూ మతం కాదని, అందులో మత ప్రస్తావనే లేదని, కల్చర్‌లోనే ఆయన పాతుకుపోయాడని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. డీసీ, మార్వెల్ సూపర్ హీరో సినిమాలా హనుమాన్ ఉండదని హెచ్‌టీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తెలిపారు.

హనుమాన్‌లో హిందూ మతం లేదు.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్
హనుమాన్‌లో హిందూ మతం లేదు.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్

హనుమాన్‌లో హిందూ మతం లేదు.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్

Prasanth Varma About Lord Hanuman: 2021లో హనుమాన్ మూవీ ప్రకటించినప్పటి నుంచి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో మొదటిసారిగా ఒక సూపర్ హీరో చిత్రం వస్తుందని భారీగా బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా చుట్టూ ఉన్న క్రేజ్, బజ్ మరెవరో కాదు హనుమంతుడే అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తాజాగా హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఇదంతా హనుమంతుడి వల్లే జరిగింది. మేము ప్రస్తుతం ఢిల్లీలోని ఒక పురాతన హనుమాన్ ఆలయాన్ని సందర్శించాం. హనుమాన్ ఆలయంలో ఉన్నంత జనసమూహాన్నినేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు. చాలా మంది ఆయనను ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. వారు అతన్ని ప్రార్థించే విధానం మరొక స్థాయిలో ఉంటుంది. సినిమా చుట్టూ బజ్ 99% హనుమాన్‌ది ఉంటే కేవలం ఒక శాతం మాత్రం నా కంటెంట్" అని తన ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.

సాంస్కృతికంగా రూపుదిద్దుకున్న సూపర్ హీరో సినిమా

హనుమాన్ మూవీ వెనుక ఉన్న ప్రేరణ గురించి అడగ్గా.. "నేను ఎప్పటినుంచో ఒక సూపర్ హీరో సినిమా చేయాలనుకున్నాను. నిజానికి నేను సూపర్ హీరో కావాలనుకున్నా! (నవ్వుతూ) అది కుదరదు కాబట్టి సినిమా చేద్దామనుకున్నాను. ఇది మార్వెల్ లేదా డీసీ లాంటి సూపర్ హీరో చిత్రంగా ఉండాలని నేను అనుకోవట్లేదు. కానీ దేశీయంగా, సాంస్కృతికంగా పాతుకుపోవాలని అనుకుంటున్నాను. హనుమంతుడి గురించి నా మదిలో మెదిలిన మొదటి ఆలోచనతో నేను ఈ కథ రాశాను. అప్పుడే మా ఇతిహాసాల (చరిత్ర) ఆధారంగా వివిధ సూపర్ హీరోలకు సంబంధించిన ఆలోచనలు వచ్చాయి. వాటినుంచే కథ అల్లుకున్నాను" అని ప్రశాంత్ వర్మ తెలిపారు.

"హనుమాన్‌ మూవీలో పురాతన విషయాలకు సంబంధించిన ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఆధునిక కాలానికి అనుగుణంగా ఉంటాయి. ఈ అఖండ భారత్ విశ్వంలో సమాంతరంగా జరిగే కథే ఈ సినిమా. ఇదొక కూలెస్ట్ థింగ్" అని వర్మ చెప్పారు. "ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రానికి హనుమాన్ అని టైటిల్‌గా నేను మా టీమ్ అనుకున్నాం. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకసారి టీవీలో హనుమంతుడు కూల్ సూపర్ హీరో అని అన్నారు" అని ప్రశాంత్ వర్మ గుర్తు చేసుకున్నారు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్?

ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గురించి కొంత చర్చ జరుగుతోంది. హనుమాన్ తర్వాత వర్మ అధీరా అనే మరో సూపర్ హీరో సినిమా లైన్‌లో ఉందని ప్రస్తావిస్తే ''ఇది నాకు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. నేను హనుమాన్ సినిమాపై వర్క్ చేస్తున్నప్పుడు నా సోదరి (నాతో కలిసి రాసేవారు), నా రచయితల బృందం చాలా మంది సూపర్ హీరోలను సృష్టించడం ప్రారంభించాము. ఈ వివిధ సూపర్ హీరోలను, వారి కథలను అనుసంధానించేలా ఒక కథను క్రియేట్ చేస్తే చాలా బాగుంటుందని అనుకున్నాము. ఒకవేళ హనుమాన్ మూవీ సక్సెస్ అయితే దాని గురించి మరిన్ని విషయాలు వెల్లడిస్తాను'' అని వర్మ వివరించారు.

"హనుమాన్ సాంస్కృతికంగా చాలా పాతుకుపోయింది. హనుమాన్ లాంటి సూపర్ హీరోను భారతీయులు ఇదివరకు ఎప్పుడూ చూసి ఉండరు. ఇది భారతీయ కథ. ఇందులో పాటలు, భావోద్వేగాలు వంటి చాలా అంశాలు ఉన్నాయి. మొదట్లో ఈ సినిమాను ఓ స్టార్‌ హీరోను పెట్టి తీయాలనుకున్నారు. కానీ, వాళ్ల డేట్ కోసం కొంతకాలం ఆగాల్సి వస్తుంది. సినిమా ప్రక్రియకు నిజాయతీగా ఉంటాను. అందుకే ఈ కథకు స్టార్ హీరో కంటే సాధారణ నటుడితో బాగా కనెక్ట్ అవుతారని అనిపించింది. ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం కాకుండా పాత్రకు సరిపోయే వ్యక్తితో సినిమా తీయాలనుకున్నా" అని ప్రశాంత్ వర్మ తెలిపారు.

''సాధారణంగా ఒక సినిమా ఫస్ట్ కాపీ చేతికి అందగానే నేను రిలాక్స్ అయిపోతాను. కొత్త సినిమా కోసం ప్లాన్ చేసుకుంటాను. కానీ, హనుమన్ మాత్రం నాకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. చాలా ఇంపార్టెంట్ సినిమా. ఈ సినిమా వర్కవుట్ అయితే తదుపరి సూపర్ హీరో ప్రాజెక్టులకు కొత్త దర్శకులను పరిచయం చేయాలనుకుంటున్నాను. మన ఇతిహాసాలు, సంస్కృతి నుంచి ఇతర కథలు చెప్పడానికి చాలా స్కోప్ ఉంది. అందుకే ఈ సినిమా వర్కవుట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని ప్రశాంత్ వర్మ అన్నారు.

హనుమాన్ మూవీలో మతం ప్రస్తావనే లేదు

హనుమంతుడిలో హిందూ మతం ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, అన్ని మతాలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుంటుందా? అన్నదానికి.. ''ఈ సినిమాలో మతం ప్రస్తావనే లేదు. హనుమంతుడి పాత్ర మాత్రమే ఉంది. హనుమంతుడిని గౌరవించే, ప్రేమించే ఇతర మతాలకు చెందిన వారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్‌లో పనిచేసిన చాలా మంది ఇతర మతాలకు చెందిన వారే. మా టీమ్ అంతా ఈ సినిమాకి బెస్ట్ ఇచ్చారు. హనుమంతుడు అన్ని వయసుల వారిని మెప్పించే విధంగా ఉండబోతుంది. ఈ సినిమాలో మీకు ఇబ్బంది కలిగించే ఒక్క ఎలిమెంట్ కూడా లేదు. మీరు మీ కుటుంబంతో కలిసి వెళ్లి, సరదాగా గడపవచ్చు'' అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం