OTT: నేరుగా ఓటీటీలోకి హనుమాన్ ప్రశాంత్ వర్మ మూవీ.. థియేటర్‌లో కాకుండానే.. ఎక్కడ చూడాలంటే?-hanuman prasanth varma tamannaah that is mahalakshmi directly released into ott netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: నేరుగా ఓటీటీలోకి హనుమాన్ ప్రశాంత్ వర్మ మూవీ.. థియేటర్‌లో కాకుండానే.. ఎక్కడ చూడాలంటే?

OTT: నేరుగా ఓటీటీలోకి హనుమాన్ ప్రశాంత్ వర్మ మూవీ.. థియేటర్‌లో కాకుండానే.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 04, 2024 08:52 AM IST

That Is Mahalakshmi OTT: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన దటీజ్ మహాలక్ష్మీ మూవీ 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి నేరుగా రానుంది. థియేటర్లలో విడుదల కాకుండానే డైరెక్టుగా ఓటీటీలోకి దటీజ్ మహాలక్ష్మీ మూవీని రిలీజ్ చేస్తున్నారు.

నేరుగా ఓటీటీలోకి హనుమాన్ ప్రశాంత్ వర్మ మూవీ.. థియేటర్‌లో కాకుండానే.. ఎక్కడ చూడాలంటే?
నేరుగా ఓటీటీలోకి హనుమాన్ ప్రశాంత్ వర్మ మూవీ.. థియేటర్‌లో కాకుండానే.. ఎక్కడ చూడాలంటే?

That Is Mahalakshmi OTT: కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. ఎన్నో ఏళ్ల క్రితం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయినప్పటికీ థియేట్రికల్ రిలీజ్‌కు నోచుకోవు. అలాంటి చిత్రాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మంచి వేదికగా నిలిచాయి. ఇప్పుడు ఈ ఓటీటీలోనే డైరెక్టుగా హనుమాన్ మూవీ (Hanuman Movie) డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వం వహించిన దటీజ్ మహాలక్ష్మీ సినిమా రానుంది.

దటీజ్ మహాలక్ష్మీ సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్‌గా చేసింది. ఇది ఒక లేడి ఒరియెంటెడ్ మూవీ. బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటి కంగనా రనౌత్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ క్వీన్‌కు రీమేక్‌గా తెలుగులో దటీజ్ మహాలక్ష్మీ మూవీ నిర్మించారు. తెలుగులోనే కాకుండా క్వీన్‌కు తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా రీమేక్ చేశారు. తమిళంలో చందమామ కాజల్ అగర్వాల్‌తో క్వీన్ మూవీని పారిస్ పారిస్ టైటిల్‌తో రీమేక్ చేశారు.

క్వీన్ మూవీని మలయాళంలో జామ్ జామ్ టైటిల్‌తో మంజిమా మోహన్‌తో రీమేక్ చేయగా.. కన్నడలో బటర్ ఫ్లై పేరుతో పరుల్ యాదవ్‌తో తెరకెక్కించారు. అయితే, తెలుగులో దటీజ్ మహాలక్ష్మీగా రీమేక్ అయిన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదు. 2014లో షూటింగ్ స్ట్రార్ట్ కాగా.. 2016లో పూర్తి అయింది. అంటే సుమారు 8 ఏళ్ల క్రితం దటీజ్ మహాలక్ష్మీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి థియేట్రికల్ విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

దక్షిణాది రీమేక్ రైట్స్ విషయంలో వివాదం చోటు చేసుకోవడంతో దటీజ్ మహాలక్ష్మీ సినిమా థియేటర్ రిలీజ్‌కు నోచుకేలేదు. ఇప్పుడు ఈ దటీజ్ మహాలక్ష్మీ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సోషల్ మీడియాలో తెగ టాక్ నడుస్తోంది. ఇప్పుడు థియేటర్లలో విడుదల చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అన్న అనుమానంతో నేరుగా ఓటీటీలోకి తీసుకురానున్నారట మేకర్స్. ఓటీటీ రిలీజ్‌ కోసం ప్రముఖ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

త్వరలోనే దటీజ్ మహాలక్ష్మీ ఓటీటీ రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. కాబట్టి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే అః వంటి తొలి సినిమాతోనే క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. టైమ్ ట్రావెల్, సైంటిఫిక్ కథాంశంతో వచ్చిన అః మూవీ అప్పట్లో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. తొలి చిత్రంతోనే కొత్త ప్రయోగం చేసి యంగ్ డైరెక్టర్ అనిపించుకున్నాడని ప్రశాంత్ వర్మకు మంచి పేరు వచ్చింది.

అః మూవీ తర్వాత ప్రశాంత్ వర్మ రాజశేఖర్‌తో కల్కి సినిమా తెరకెక్కించాడు. ఇది కమర్షియల్‌గా హిట్ కాలేదు కానీ, సాంకేతికంగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అనంతరం తేజ సజ్జాతో జాంబీ రెడ్డి మూవీ తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు తేజ సజ్జాతోనే పాన్ వరల్డ్ మూవీగా హనుమాన్‌తో వస్తున్నాడు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీతోపాటు విదేశీ భాషల్లో హనుమాన్ విడుదల కానుంది.

హనుమాన్ సినిమాలో తేజ సజ్జాతోపాటు అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. అలాగే వినయ్ రాయ్ విలన్ పాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే హనుమాన్ సినిమాలోని పాటలు, విజవల్స్, టీజర్, ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024