Hanuman Rampage: హనుమాన్ ర్యాంపేజ్.. 150 ప్రీమియర్ షోలు ఫుల్-hanuman rampage teja sajja prashanth varma movies 150 premier shows sold out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Rampage: హనుమాన్ ర్యాంపేజ్.. 150 ప్రీమియర్ షోలు ఫుల్

Hanuman Rampage: హనుమాన్ ర్యాంపేజ్.. 150 ప్రీమియర్ షోలు ఫుల్

Hari Prasad S HT Telugu
Jan 10, 2024 03:06 PM IST

Hanuman Rampage: సంక్రాంతి బరిలో ఈసారి అందరూ చిన్న సినిమాగా అంచనా వేసిన హనుమాన్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. ప్రీమియర్ షోలతో ఆ మూవీ పెద్ద సినిమాలకు దడ పుట్టిస్తోంది.

హనుమాన్ 150 ప్రీమియర్ షోలు హౌజ్‌ఫుల్
హనుమాన్ 150 ప్రీమియర్ షోలు హౌజ్‌ఫుల్

Hanuman Rampage: హనుమాన్ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి పండగ బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగలాంటి సినిమాలు ఉన్నా.. తేజ సజ్జ నటించిన ఈ సినిమా మాత్రం దూసుకెళ్తోంది. జనవరి 12న మూవీ రిలీజ్ కానుండగా.. ఒక రోజు ముందు జనవరి 11న ఏర్పాటు చేసిన 150 ప్రీమియర్ షోల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.

హనుమాన్ మూవీకి ఏ స్థాయి క్రేజ్ ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ మేకర్స్ బుధవారం (జనవరి 10) ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. నిజానికి ముందు రోజు కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో చాలా కొద్ది మొత్తంలోనే ప్రీమియర్ షోలు ఏర్పాటు చేయాలని మేకర్స్ మొదట భావించారు. కానీ వాటికి నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడైపోవడంతో షోల సంఖ్య పెంచుతూ వెళ్లారు.

ఇలా మంగళవారం (జనవరి 9) 70 ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అవన్నీ అమ్ముడుపోవడంతో బుధవారం ఉదయం మరిన్ని షోలను జోడించారు. 150 షోలకు తీసుకెళ్లినా.. అవీ అమ్ముడైపోయాయి. దీంతో ప్రీమియర్ షోల సంఖ్యను మరింత పెంచనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

హనుమాన్ ర్యాంపేజ్

ఏపీ, తెలంగాణల్లో హనుమాన్ ర్యాంపేజ్ నడుస్తోంది.. జనవరి 11 కోసం ఏర్పాటు చేసిన 150 ప్రీమియర్ షోల టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.. పబ్లిక్ డిమాండ్ మేరకు మరిన్ని షోలు ఏర్పాటు చేస్తున్నాం.. మీరు కూడా మీ టికెట్లు బుక్ చేసుకోండి అంటూ హనుమాన్ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈసారి సంక్రాంతికి హనుమాన్ ను అందరూ ఓ చిన్న సినిమాగా భావించారు.

గుంటూరు కారంలాంటి సినిమా రిలీజ్ అవుతున్న జనవరి 12నే రిలీజ్ కానుండటంతో దానితో పోటీ పడగలదా అని సందేహాలు వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ ప్రీమియర్ షోలకే కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా.. భారీ ఓపెనింగ్స్ ఖాయం. గుంటూరు కారంలాంటి సినిమాకు దీనివల్ల పెద్దగా నష్టం జరగకపోవచ్చు కానీ.. హనుమాన్ మాత్రం తన బిజినెస్ భారీగా చేసుకుంటుంది.

అయితే ఈ స్థాయిలో ప్రీమియర్ షోలు కాస్త నష్టం కూడా చేయొచ్చన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. వీటిలో కాస్త నెగటివ్ టాక్ వచ్చినా.. రిలీజ్ రోజుపై దాని ప్రభావం ఉంటుందన్న ఆందోళన కూడా ఉంది. అయితే మేకర్స్ మాత్రం తమ కంటెంట్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాలన్న ఒత్తిళ్లు వచ్చినా.. వాళ్లు మొండిగా ముందుకే వెళ్లారు.

రూ.50 కోట్ల భారీ బడ్జెట్ తో హనుమాన్ ను తెరకెక్కించారు. అయితే ఇందులో 80 శాతం వరకూ రిలీజ్ కు ముందే వచ్చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో మేకర్స్ ఖాతాలోకి భారీ మొత్తం వచ్చినట్లు చెబుతున్నారు.

Whats_app_banner