Salaar 27 Days Collection: సలార్‌కు ఇండియాలోనే 404 కోట్ల కలెక్షన్స్.. ముగింపు దశకు థియేట్రికల్ రన్
18 January 2024, 9:06 IST
Salaar 27 Days Box Office Collection: ప్రభాస్ నటించిన 'సలార్: పార్ట్ వన్ సీజ్ ఫైర్' చిత్రానికి వసూళ్లు తగ్గినా కూడా థియేటర్లలో విడుదలైన నాలుగో వారం కూడా ప్రదర్శించబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సలార్‌కు వసూళ్లు బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది.
సలార్‌కు ఇండియాలోనే 404 కోట్ల కలెక్షన్స్.. ముగింపు దశకు థియేట్రికల్ రన్
Salaar Day 27 Box Office Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్: సీజ్ ఫైర్ - పార్ట్ 1 విడుదలైన నాలుగో వారం కూడా బాగానే థియేటర్లలో ఆడుతోంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంటూ ముందుకు సాగుతోంది. థియేట్రిలక్ రన్ ముగింపు దశకు చేరుకున్న ఇంకా బాక్సాఫీస్ వద్ద సలార్ కలెక్షన్స్ సాధించడం విశేషంగా మారింది. ఈ క్రమంలోనే సలార్ మూవీకి 27వ రోజున ఇండియాలోని అన్ని భాషల్లో కలిపి రూ. 0.2 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
సలార్‌కు 27వ రోజున రూ. 0.2 కోట్లు వచ్చినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థ Sacnilk.com తెలిపింది. అయితే, మునుపటి కలెక్షన్లతో పోలిస్తే సలార్ మూవీ కలెక్షన్ల సంఖ్య తగ్గినప్పటికీ.. దాదాపు నాలుగు వారాలుగా ఈ చిత్రం థియేటర్లలో ఉండటం అభినందనీయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతుండటం, ఈ చిత్రానికి ఉన్న బలమైన ప్రేక్షకాదరణకు, వివిధ ప్రాంతీయ మార్కెట్లలో ఉన్న అభిమానానికి నిదర్శనం అని అంటున్నారు.
ఇక సలార్ మూవీ 27 రోజుల టోటల్ కలెక్షన్లు చూస్తే.. భారతదేశంలో రూ. 404.87 కోట్లుగా ఉన్నాయని Sacnilk.com నివేదిక తెలిపింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ 27 రోజుల్లో రూ. 611.8 కోట్లు వసూలు చేసింది. రూ.270 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ మూవీ 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాలో ఐదో స్థానాన్ని సంపాదించుకుంది. మరోసారి ప్రభాస్ క్రేజ్ ఏంటో తెలుస్తోంది.
కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ మూవీ తొలి వారాంతంలో రూ. 308 కోట్ల నెట్ కలెక్ట్ చేయగా, తెలుగు భాషలో అత్యధికంగా రూ.186.05 కోట్లు, హిందీ భాషలో రూ.92.5 కోట్ల నెట్ వసూలు చేసింది. అయితే రెండో వారంలో ఈ చిత్రం రూ. 70.1 కోట్లు, మూడో వారంలో రూ.23.7 కోట్లు వసూలు చేయడంతో కలెక్షన్లు పడిపోయాయి.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి వాయిదా పడి డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే.
విజయ్ కిరగందూర్ నిర్మించిన సలార్ చిత్రంలో ప్రభాస్‌తోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, మధు గురుస్వామి కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో 14 భారీ సెట్స్ వేసి చిత్రీకరణ చేశారు. ఇదిలా ఉంటే సలార్: పార్ట్ 1 - థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ప్రభాస్ సినిమా విషయాలకొస్తే.. మకర సంక్రాంతి సందర్భంగా తన తదుపరి చిత్రం రొమాంటిక్ హారర్ 'రాజా సాబ్' టైటిల్‌ను ప్రకటించారు. అలాగే పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇదే కాకుండా ప్రభాస్ కల్కి ఏడీ 2898 సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకు మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.