Hanuman vs Adipurush: హనుమాన్ గోటికి కూడా ఆదిపురుష్ సరిపోదు.. మళ్లీ ప్రభాస్ మూవీపై ట్రోలింగ్.. తేడాలు ఇవే!
Hanuman vs Adipurush: సూపర్ క్రేజ్ అందుకున్న హనుమాన్ మూవీ ఎట్టకేలకు జనవరి 12న అంటే ఇవాళ విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ప్రభాస్ ఆదిపురుష్‌పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అలాగే ఆదిపురుష్, హనుమాన్‌కు మధ్య తేడాలను ప్రేక్షకులు చెబుతున్నారు.
Hanuman vs Adipurush: ఇండియన్ తెలుగు సూపర్ హీరో మూవీగా తెలుగు వెండితెరపైకి వచ్చేసింది హనుమాన్ మూవీ. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీలో కుర్ర హీరో తేజ సజ్జా ప్రధాన్ పాత్ర పోషించాడు. అతనికి జోడీగా రెడ్ మూవీ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేసుకున్న హనుమాన్ మూవీ ఎట్టకేలకు జనవరి 12న అంటే శుక్రవారం తెలుగు వెండితెరపై ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ట్రోలింగ్-కంపారిజన్
హనుమాన్ సినిమా విడుదలైన నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులందరికీ ఎక్కువగా గుర్తుకు వస్తున్న మూవీ ఆదిపురుష్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీని హనుమాన్ సినిమాతో పోలుస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రావత్‌పై తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. అందుకు కారణం ఆదిపురుష్ మూవీని తెరకెక్కించిన విధానమే. ఈ ట్రోలింగ్, పోల్చడం ఆదిపురుష్, హనుమాన్ సినిమాలు ప్రారంభమైనప్పటి నుంచే మొదలైన విషయం తెలిసిందే.
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఆశలు పెట్టుకున్న ఆదిపురుష్ టీజర్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆదిపురుష్ టీజర్ విడుదలైంది. కానీ, ఆదిపురుష్ టీజర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్‌తోపాటు సినీ ప్రేక్షకులంతా నివ్వెరపోయారు. రూ. 500 కోట్ల బడ్జెట్ అని చెప్పిన చిన్న పిల్లల వీడియో గేమ్ తీశారేంటీ అంటూ నానా రకాలుగా కామెంట్స్, ట్రోలింగ్ జరిగిన విషయం గుర్తుండే ఉంటది. ఆదిపురుష్ టీజర్ రిలీజ్ తర్వాత కొన్ని రోజులకు హనుమాన్ టీజర్ రిలీజ్ అయింది.
మళ్లీ అదే సీన్
హనుమాన్ టీజర్ చూసి తెలుగు సినీ జనం ఆశ్చర్యపోయింది. చిన్న బడ్జెట్ మూవీతో ఇంత క్వాలిటీ గ్రాఫిక్సా అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను చూసి ఓం రౌత్ నేర్చుకో అంటూ ట్రోలింగ్ కూడా చేశారు. ఇదంతా అప్పుడు. మళ్లీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. హనుమాన్ సినిమా చూసిన ప్రేక్షకులు మరోసారి ఆదిపురుష్ డైరెక్టర్‌ను ఏకిపారేస్తున్నారు.
హనుమాన్ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు అసలు ఆదిపురుష్‌తో పోలికే వద్దంటున్నారు. 40, 50 కోట్ల బడ్జెట్ ఇంత బాగుంది.. 700 కోట్లు పెట్టి తీసిన ఆ మూవీ గ్రాఫిక్స్ అలా ఉంది. అసలు ఇంత మంచి ఔట్ పుట్ ఎలా ఇచ్చారో అర్థం కావట్లేదు. ఎలివేషన్స్, బీజీఎమ్, క్లైమాక్స్ అదిరిపోయాయని, సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ వాచ్ మూవీ అంటూ ప్రశాంత్ వర్మకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఆదిపురుష్ పనికిరాదు
"హనుమాన్ మూవీ సంక్రాంతి విన్నర్. కచ్చితంగా థియేటర్ వాచ్ మూవీ. 50 కోట్ల బడ్జెట్‌తో ఇలాంటి గ్రాఫిక్స్ అస్సలు ఊహించలేం. నెక్ట్స్ లెవెల్ గ్రాఫిక్స్ ఉంది. హనుమాన్ గోరు మీదకు కూడా ఆదిపురుష్ సినిమా పనికిరాదు. అంతా బాగుంది సినిమా" అని ఓ సినీ ప్రేక్షకుడు చెప్పుకొచ్చాడు. ఇలా ఆదిపురుష్‌ను ట్రోలింగ్ చేస్తూ హనుమాన్ మూవీని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్, ఆదిపురుష్ మధ్య తేడాలు ఆసక్తికరంగా మారాయి.
ఆదిపురుష్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తోపాటు కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, దేవ దత్తా నాగే, సన్నీ సింగ్ వంటి పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ నటించారు. హనుమాన్ మూవీలో ఇప్పుడిప్పుడే హీరోగా పైకి వస్తున్న తేజ సజ్జాతోపాటు పెద్దగా స్టార్ రేంజ్ లేని అమృత అయ్యర్, నటిగా పాపులరైన వరలక్ష్మీ శరత్ కుమార్, విలన్ పాత్రలతో ఆకట్టుకున్న వినయ్ రాయ్, కామెడీ హీరోలు వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను నటించారు.
హనుమాన్ బడ్జెట్ వర్సెస్ ఆదిపురుష్ బడ్జెట్
2023 జూన్ 16న విడుదలైన ఆదిపురుష్ సినిమాకు సుమారు రూ. 500 నుంచి 700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు సమాచారం. ఈ సినిమాకు టోటల్‌గా రూ. 354 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఆదిపురుష్ బడ్జెట్ 700 కోట్లు అనుకుంటే దాదాపుగా రూ. 346 కోట్ల నష్టం వాటిల్లినట్లే. ఇక సినిమాలోని గ్రాఫిక్స్ చాలా వరకు ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. ఇక సినిమాకు ప్రభాస్ సుమారు 100 కోట్ల పారితోషికం తీసుకున్నాడని టాక్.
రెమ్యునరేషన్
ప్రభాస్ రెమ్యునరేషన్ కంటే తక్కువగా రూ. 50 కోట్ల బడ్జెట్‌తో హనుమాన్ చిత్రీకరించారు. ఇందులోని గ్రాఫిక్స్‌కు స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వొచ్చని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాకు తొలి రోజు దాదాపుగా 10 కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. టాక్ సూపర్‌గా ఉండటంతో లాంగ్ రన్‌లో బడ్జెట్ దాటి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక ఇందులో హీరోగా చేసిన తేజకు రూ. 2 కోట్లు, అమృతకు కోటిన్నర, వరలక్ష్మికి కోటి ఇచ్చినట్లు సమాచారం.
డైరెక్టర్స్
ఇక ఆదిపురుష్ తెరకెక్కించిన ఓం రౌత్ హిందీలో తానాజీ సినిమా తెరకెక్కించాడు. అజయ్ దేవగణ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తొలి సినిమా అ!తో మంచి సక్సెస్ కొట్టాడు. తర్వాత కల్కితో పేరు వచ్చిన బాక్సాఫీస్ పరంగా ఫెయిల్ అయ్యాడు. అనంతరం జాంబీ రెడ్డి యావరేజ్‌గా నిలిచింది.