Prabhas Rebel Release again: మరోసారి రెబల్ వచ్చేస్తున్నాడు.. విడుదలకు డేట్ ఫిక్స్
08 October 2022, 21:40 IST
- Rebel Release again: ప్రభాస్ నటించిన రెబల్ మూవీని మరోసారి విడుదల చేయనున్నారు. అక్టోబరు 15న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆదిపురుష్ చిత్రంతో బిజీగా ఉన్నారు ప్రభాస్.
రెబల్ మరోసారి రిలీజ్
Rebel Movie Re Release: ఇటీవల కాలంలో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజున పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డేన జల్సా, తమ్ముడు విడుదల కాగా.. ఇటీవలే బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమా కూడా మళ్లీ విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా ఈ జాబితాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా చేరిపోయారు. ఆయన నటించిన ‘రెబల్’ చిత్రం థియేటర్లలో మళ్లీ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. ఆయన పెదనాన్న కృష్ణం రాజు కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు. శ్రీ బాలాజీ సినీ మీడియా సంస్థ అక్టోబరు 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. ఇందులో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపించారు. అంతేకాకుండా మాస్ ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఇందులో ఫైట్లను ఇప్పటికీ అభిమానించేవారున్నారు.
ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించగా.. తమన్నా, దీక్షా సేథ్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో కృష్ణంరాజు కూడా ముఖ్య భూమిక పోషించారు. 2012లో విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆదిపురుష్.. వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయితే తెలుగు నాట మాత్రం ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఓంరౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు ముఖ్య భూమికలు ప పోషిస్తున్నారు.