AP CM Serious On Aqua Feed Prices : ఆక్వా ధరల పతనంపై ముఖ్యమంత్రి ఆగ్రహం….
09 October 2022, 11:58 IST
- ఆక్వా ధరల పతనం, ఆక్వాఫీడ్ ధరల పెరుగుదలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్.జగన్ కమిటీని ఏర్పాటు చేశారు. సిండికేట్‌గా మారి రైతులను నష్టపరుస్తున్నారన్న ఫిర్యాదులపై సీఎం తక్షణ చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ఆక్వాధరల పతనం, ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై రైతులు, రైతు సంఘాలు నేతలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో ఆక్వా రైతుల ఫిర్యాదులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.
సీఎం జగన్ (ఫైల్ ఫొటో)
AP CM Serious On Aqua Feed Prices ఆక్వా ధరల తగ్గుదల, ఫీడ్ ధరల పెరగడం, వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని రైతుల ఫిర్యాదు చేయడంతో ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ధరలు పతనమై నష్టపోతున్నామన్న రైతులు గగ్గోలు పెట్టడంతో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్వాఫీడ్ విషయంలోనూ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెంచారని ఫిర్యాదు చేయడంతో సిఎం స్పందించారు. తన దష్టికి వచ్చిన అంశాలపై ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా సిండికేట్‌గా మారి రైతులను నష్టపరచడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. వారంరోజుల్లో నివేదిక అందించాలన్నారు. నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కమిటీలో మంత్రులు విద్యుత్ , అటవీ పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, సీఎస్ సమీర్ శర్మ, స్పెషల్ సీఎస్‌లు విజయానంద్, పూనం మాల కొండయ్య, మత్సశాఖ కమిషనర్ కన్నబాబులు ఉన్నారు.
ఆక్వాకల్చర్‌లో 60 శాతం నిర్వహణ వ్యయం కేవలం ఫీడ్ కోసం వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొనడంపై సిఎం తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఫీడ్‌కు సంబంధించిన నాణ్యత ఇతర అంశాల పర్యవేక్షణకోసం ఎలాంటి నియంత్రణ వ్యవస్ధ రాష్ట్రంతో పాటు దేశంలోనూ మరెక్కడా లేకపోవడంపై చర్యలు చేపట్టాలన్నారు. ఫిష్ ఫీడ్‌కు సంబంధించి... అధిక ధరలు, సిండికేట్ వ్యవహారాలను నియంత్రించడానికి, మత్స్యపరిశ్రమ మనుగడ కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఆంద్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ – 2020 ని తీసుకుని రావడం ద్వారా ఆక్వా రైతులకుఅండగా నిలబడిందని సిఎం గుర్తు చేశారు.
ఏపీ ఆక్వాకల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ 2020ను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. తద్వారా ఆక్వాకల్చర్ రంగలో నాణ్యమైన సీడ్ అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు అడుగులు పడ్డాయని, మరోవైపు కల్తీ సీడ్‌ని నియంత్రించడం ద్వారా వ్యాధుల బారిన పడని, పెరుగుదల లేని రకాలను నియంత్రణతో పాటు మంచి దిగుబడినిచ్చే సీడ్ అందుబాటులోకి వచ్చే అవకాశం కలిగిందన్నారు.
ఆక్వా కల్చర్ రంగానికి వెన్నుముక అయిన రైతుకు అండగా నిలబడటానికి ప్రత్యేక చట్టాల ద్వారా ద్వారా ఆక్వారంగంలో అనైతిక విధానాలకు అడ్డుకట్టు వేయడంతో పాటు నాణ్యత కలిగిన ఉత్పత్తులను మెరుగుపర్చేందుకు అవకాశం కలిగిందన్నారు.
మత్స్యపరిశ్రమ, ఆక్వాకల్చర్ సమగ్రాభివృద్ధి కోసం ఆ రంగంలో నిపుణుల అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం.. దానికై అత్యధిక ప్రాధాన్యతనిస్తూ... ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ యాక్ట్ 39(2020) ద్వారా, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీని పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటుకు నిర్ణయించిందన్నారు.
రాష్ట్రంలో ఆక్వారంగ అభివృద్ధికి ఈ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలోని ఆక్వాకల్చర్‌కు సంబంధించిన కార్యకలాపాలును ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు... ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ ఆధారిటీ(ఏపీఎస్‌ఏడీఏ) యాక్ట్– 2020 ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆయన ఛైర్మన్‌గా గా వ్యవహరించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ ఆధారిటీని ఏర్పాటు చేసిందన్నారు.
ఈ సంస్ధ ఆక్వాకల్చర్ ఉత్పత్తుల నాణ్యత, ధరలతో పాటు సీడ్, ఫీడ్‌కు సంబంధించిన అంశాలను కూడా పర్యవేక్షిస్తుందని, కోవిడ్ సమయంలో కూడా 2020లో ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు పలు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.
రొయ్యలు దిగుమతి చేసుకునే దేశాల నుంచి నిషేధం కారణంగా... ధరలు గణనీయంగా పడిపోవడంతో పాటు రైతులు కూడా తమ ఉత్పత్తులను అమ్ముకోలేని పరిస్థితి తలెత్తడంతో అప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని, శీతలగిడ్డంగులను, ప్రాసెసింగ్ ప్లాంట్లను వెంటనే తెరిపించడంతో పాటు రైతుల ఉత్పత్తులను తగిన ధరలను కూడా నిర్ణయించిందన్నారు.
ఆక్వారైతుల సంక్షేమ కోసం...
ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు... వారి ఉత్పాదయ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటలపాటు సరఫరా చేయడంతో పాటు యూనిట్‌కు రూ.1.50 పైసలు సబ్సిడీ కూడా ఇచ్చింది.
గతంలో 2016లో ఆక్వా రైతులకు పవర్ టారిఫ్ యూనిట్ రూ.4.63 నుంచి రూ.7 కాగా.. 2016 నుంచి 2018 మే వరకు యూనిట్ రూ.3.86 పైసలకు సరఫరా చేసింది.
జూన్ 2108 నుంచి జూన్ 2019 వరకు రూ.2 కే యూనిట్ సరఫరా చేయగా... జూలైలో ప్రభుత్వం దాన్ని రూ.2 యూనిట్ కాస్ట్ నుంచి రూ.1.50 కే అందిస్తూ ఉత్తర్వులుజారీ చేసింది.
రాష్ట్రంలో సాగు వివరాలు:
ఆక్వాకల్చర్ సాగులో దేశంలోనే అగ్రస్ధానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని సిఎం చెప్పారు. సుమారు 2 లక్షల హెక్టార్ల ఆక్వాసాగులో 1.10 లక్షల హెక్టార్లలో రొయ్యల సాగు జరుగుతోందన్నారు. 429 రొయ్యల హేచరీస్, 102 ప్రాసెసింగ్ ప్లాంట్లు, 107 శీతలగిడ్డంగులు, 37 ఫీడ్ ప్లాంట్లు, 225 ఆక్వా ల్యాబులు, 1014 ఆక్వా షాపులతో ఏపీలో ఏడాదికి సుమారు 60వేల మిలియన్‌ల ఉత్పత్తి జరుగుతోదన్నారు. ఫలితంగా ఆక్వా హబ్ ఆఫ్ ఇండియాగా నిల్చిందన్నారు. దేశంలోనే 30 శాతానికి పైగా వాటాతో రొయ్యలు, చేపల ఉత్పత్తిలో అగ్రగామిగా నిల్చిందని చెప్పారు. ఆక్వా కల్చర్ ద్వారా రాష్ట్రంలో సుమారు 16.50 లక్షల మందికి ఉపాధి దొరుకుతోందన్నారు.
దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్న రొయ్యలలో 78 శాతం వాటాను సొంతం చేసుకోవడం ద్వారా.. దేశవ్యాప్తంగా 10.17 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి కాగా... కేవలం ఏపీలోనే 7.89 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిషాతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు ప్రతిఏటా దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల చేపలు సరఫరా చేస్తున్నారన్నారు. అక్వా పరిశ్రమను దెబ్బతీసే చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.
టాపిక్