తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Next Movie Update: ప్రభాస్ తదుపరి మూవీపై ఆసక్తికర అప్డేట్.. ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవ్వాల్సిందే..!

Prabhas Next Movie update: ప్రభాస్ తదుపరి మూవీపై ఆసక్తికర అప్డేట్.. ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవ్వాల్సిందే..!

20 May 2023, 19:05 IST

    • Prabhas Next Movie update: రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి ప్రాజెక్టు గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. మారుతీ దర్శకత్వంలో మన డార్లింగ్ నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి కావచ్చొందని ఫిల్మ్ వర్గాల టాక్. అంతేకాకుండా అది కూడా ఈ నెలాఖరుకు పూర్తవుతుందని సమాచారం.
ప్రభాస్
ప్రభాస్ (AFP)

ప్రభాస్

Prabhas Next Movie update: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. అంతేకాకుండా కొత్త కథలను కూడా వింటున్నారు. తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటూ అంకితభావంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్, సలార్ లాంటి చిత్రాలను పూర్తి చేసిన మన డార్లింగ్ తన అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో చేస్తున్న మూవీ గురించి ఆసక్తికర అప్డేట్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

Murder in Mahim OTT Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మర్డర్ ఇన్ మహిమ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా పేరు రాజా డీలక్స్‌గా ప్రచారంలో ఉంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వని మన స్టార్ ఈ సారి ఏకంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరు కల్లా పూర్తవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణలో తీరికలేకుండా గడుపుతున్న మన డార్లింగ్ మూవీని మే 26 కల్లా పూర్తి చేయనున్నట్లు సమాచారం. దీంతో ఫ్యాన్స్ సహా ప్రతి ఒక్కరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. అసలు ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు పూర్తి చేశారు అంటూ షాక్ అవుతున్నారు.

మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లీడింగ్ యాక్ట్రెస్‌గా చేస్తున్నారు. రొమాంటిక్ హర్రర్‌గా జోనర్‌లో రాబోతున్న ఈ సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రాజెక్టు-కేపై ఫోకస్ పెట్టనున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్.. ఇక పూర్తి స్థాయిలో ప్రాజెక్టు కేపైనే దృష్టి పెట్టనున్నారు. దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా.. సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ముఖ్య పాత్రలను పోషించారు. అంతేకాకుండా టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లలో భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు. తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాచేత్ పరంపరా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.