Chamanthi Serial: త్రినయని స్థానంలో జీ తెలుగులో రానున్న కొత్త సీరియల్ ఇదే - లాంఛింగ్ డేట్, టెలికాస్ట్ టైమ్ ఫిక్స్!
22 December 2024, 16:23 IST
Chamanthi Serial: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ చామంతి పేరుతో ఓ కొత్త సీరియల్ చేస్తోంది. జీ తెలుగు ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు ఈ సీరియల్ రాబోతుంది.ఈ సీరియల్ లాంఛింగ్ డేట్, టెలికాస్ట్ టైమింగ్స్‌ను జీ తెలుగు రివీల్ చేసింది. ఈ సీరియల్‌లో మేఘన లోకేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నది.
చామంతి సీరియల్
Chamanthi Serial: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొత్త సీరియల్‌తో త్వరలో బుల్లితెర అభిమానుల ముందుకు రాబోతున్నాడు. చామంతి పేరు తెరకెక్కుతోన్న ఈ సీరియల్ జీ తెలుగు ఛానెల్‌లో టెలికాస్ట్ కాబోతోంది. ఈ సీరియల్ లాంఛింగ్ డేట్, టెలికాస్ట్ టైమింగ్స్‌ను జీ తెలుగు రివీల్ చేసింది.
జనవరి 1 నుంచి...
నూతన సంవత్సరాది సందర్భంగా జనవరి 1 నుంచి చామంతి సీరియల్ ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సీరియల్ ప్రసారమవుతుందని జీ తెలుగు వెల్లడించింది. ప్రభాకర్ సీరియల్ కోసం ప్రైమ్ టైమ్ స్లాట్‌ను కేటాయించారు.
మేఘనా లోకేష్...
చామంతి సీరియల్‌లో ప్రభాకర్‌తో పాటు మేఘనా లోకేష్, ఐశ్వర్య వర్మ, భార్గవ రామ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవల చామంతి సీరియల్ ప్రోమోను రిలీజ్ చేశారు. మట్టి మనుషులు అంటే నచ్చని ఓ గొప్పింటిలోకి పల్లెటూరి అమ్మాయి పనిచేయడానికి వస్తుంది. అదే ఇంటి కోడలిగా ఆ పల్లెటూరి అమ్మాయి అక్కయ్య అడుగుపెట్టబోతుందనే నిజం ఆ యువతికి తెలుస్తుంది.
కోటీశ్వరురాలిని కాదనే నిజం బయటపెడితే ఆత్మహత్య చేసుకుంటానని చెల్లెలిని బెదిరిస్తుంది అక్క. ఆ నిజాన్ని చెల్లి ఎలా దాచిపెట్టింది? గొప్పింట్లో కోడలిగా అక్క గౌరవ మర్యాదలు పొందితే...పనిమనిషిగా చెల్లెలు ఎలాంటి అవమానాల్ని ఎదుర్కొంది అనే పాయింట్‌తో ఈ సీరియల్ తెరకెక్కుతోంది.
ప్రభాకర్ క్యారెక్టర్ సస్పెన్స్...
చామంతి సీరియల్‌లో మేఘన లోకేష్‌కు తండ్రి పాత్రలో ప్రభాకర్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ ప్రోమోలో ప్రభాకర్‌ను చూపించలేదు మేకర్స్. ఆయన క్యారెక్టర్ ఏమిటన్నది మేకర్స్ సస్పెన్స్‌లో ఉంచబోతున్నట్లు సమాచారం. చామంతి సీరియల్‌కు జయంత్ రాఘవన్ దర్శకత్వం వహిస్తోన్నాడు. సంతోష్ షానమోని సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు…
ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించిన ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇటీవలే స్టార్ మా ఛానెల్‌లో ప్రారంభమైంది. బుల్లితెరకు దాదాపు రెండేళ్ల పాటు గ్యాప్ ఇచ్చిన ప్రభాకర్ ఇళ్లు ఇళ్లాలు పిల్లలుతో సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. లాంఛింగ్ వీక్‌లోనే టీఆర్‌పీతో ఈ సీరియల్ అదరగొట్టింది. ప్రస్తుతం స్టార్ మా సీరియల్స్‌లో టీఆర్‌పీలో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.
ఇది మా ప్రేమకథ...
కళ్యాణ వైభోగమే, కళ్యాణం కమనీయం సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మేఘన లోకేష్. ఈ రెండు సీరియల్స్ జీ తెలుగులోనే టెలికాస్ట్ కావడం గమనార్హం. ప్రస్తుతం తెలుగులో రక్త సంబంధం సీరియల్ చేస్తోంది. ఈ సీరియల్ కూడా జీ తెలుగులోనే ప్రసారమవుతోంది. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన శశిరేఖ పరిణయంలో లీడ్‌లో రోల్‌లో కనిపించింది. ఇది మా ప్రేమకథ పేరుతో హీరోయిన్‌గా తెలుగులో ఓ సినిమా చేసింది.